యుక్తవయస్సు పిల్లలలో ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యత

సైబర్ వేధింపుల పరిశోధన కేంద్రం

సమీర్ హిందూజా & జస్టిన్ డబ్ల్యు. ప్యాచిన్

ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం అంటే “ప్రతికూల పరిస్థితులను అధిగమించగల, పుంజుకోగల, అందుకు తగినట్లు విజయవంతంగా మార్చుకోగల మరియు తీవ్రమైన ఒత్తిడి... లేదా సులభంగా చెప్పాలంటే నేటి ప్రపంచం యొక్క ఒత్తిడికి గురైనప్పటికీ సామాజిక మరియు విద్యాపరమైన పోటీతత్వాన్ని వృద్ధి చేసుకోగల సామర్థ్యం.”1 యువత ఎదుగుతున్నప్పుడు వారి పాఠశాల విద్యలో, వారి ఆరోగ్యంలో మరియు వారి సామాజిక జీవితాలలో నిస్సందేహంగా ప్రతికూలతను ఎదుర్కొంటారు. దురదృష్టవశాత్తూ, ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం యొక్క ప్రాముఖ్యత తరచుగా విస్మరించబడుతుంది. జీవితంలో వివిధ పోరాటాలు ఉంటాయి, వాటిలో అనేకం సంబంధితంగా ఉంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎటువంటి కష్టం తెలియకుండా రక్షించుకోవాలనుకుంటారు, వారికి తోడుగా నిలవడానికి బదులు వారి తరఫున మాట్లాడుతారు, అలాగే కష్టమైనప్పటికీ వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సందర్భాలు రాకుండా అడ్డుపడతారు. ప్రతి సందర్భంలోనూ ఇలా చేయడం వల్ల మీ యుక్తవయస్సు పిల్లలను ప్రమాదంలోకి నెట్టివేయవచ్చు – మరియు వారు పెరిగి పెద్దవారయ్యే సమయానికి వారికి తగిన సామర్థ్యం ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ వారితో మంచిగా ఉంటారనే భ్రమలో ఇది జరగదు.

ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం మరియు సైబర్ వేధింపులపై పరిశోధన

మా పరిశోధనలో2 యుక్తవయస్సు పిల్లలకు ఎంత ఎక్కువ ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం ఉంటే, సైబర్ వేధింపుల వల్ల వారు గణనీయంగా ప్రభావితమయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని మేము కనుగొన్నాము. అదనంగా, తప్పుగా ప్రవర్తించడాన్ని ఎదుర్కొన్నప్పుడు విద్యార్థులు చేయాలని తల్లిదండ్రులు మరియు సంరక్షకులు కోరుకునే అన్ని పనులను అధిక స్థాయిలలో స్థితిస్థాపకత కలిగిన యుక్తవయస్సు పిల్లలు చేసారు. వారు దీన్ని పాఠశాలలో రిపోర్ట్ చేసారు. వారు దీన్ని సైట్/యాప్‌లో రిపోర్ట్ చేసారు. వారు తమ స్క్రీన్ పేరుని మార్చుకుని, దూకుడుగా ప్రవర్తించినవారిని బ్లాక్ చేసారు లేదా లాగ్ అవుట్ అయ్యారు. మరోవైపు, సైబర్ వేధింపులకు గురైనప్పుడు అత్యల్ప స్థాయిలలో స్థితిస్థాపకతను కలిగి ఉన్నవారు ఏమీ చేయలేదు.

ప్రతికూలతను తిరిగి ఫ్రేమ్ చేయడం ద్వారా స్థితిస్థాపకతను పెంపొందించడం

మీ యుక్తవయస్సు పిల్లలు వారి సామాజిక మాధ్యమ ఖాతాలో బాధాకరమైన కామెంట్‌లను అందుకున్నారనుకోండి. బహుశా డిఫాల్ట్‌గా, యుక్తవయస్సు పిల్లలు కుంగిపోవచ్చు మరియు తాము “పరాజితులు” అని, అందుకే తమను ఎంచుకుంటున్నారని, అలాగే జీవితంలో వేధింపుపులకు గురి కావడం ఎంతో ఎక్కువగా ఉంటుందని వారికి వారే చెప్పుకోవడం ప్రారంభిస్తారు మరియు వారి పట్ల చాలా మంది వ్యక్తులకు ఉన్న సెంటిమెంట్‌కు ప్రతినిధిగా మారే అవకాశం ఉంది. ఏమి జరిగిందనే దాని గురించి ఆలోచించి, దాన్ని సానుకూల పద్ధతిలో పరిష్కరించడం అనేది వారికి ఉత్తమం. తమను సైబర్ బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తి గురించి వారు తమకు తామే ఇలా చెప్పుకోవచ్చు, ఉదాహరణకు, వారి స్వంత అభద్రతాభావాలు మరియు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారు మరియు ఇతరులను ఏడిపించడం ద్వారా మాత్రమే వారి స్వంత జీవితం విషయంలో కొంత ఉపశమనం పొందగలరు. దూకుడుగా ప్రవర్తించిన వ్యక్తి అభిప్రాయం మరియు చర్యలు సుదీర్ఘకాలంలో వాస్తవానికి ముఖ్యమైనవి కావని మరియు తమ బుర్రలో వారిని “అద్దె లేకుండా నివసించడం” కోసం అనుమతించకూడదని వారు తమకు తామే గుర్తు చేసుకోవచ్చు.

అటువంటి సమయంలో తల్లిదండ్రులు మరియు సంరక్షకులు కలగజేసుకుని, ఉద్దేశపూర్వక, వివేకవంతమైన సంభాషణలు జరపడం అనేది నిజంగా ఉపయోగకరంగా ఉండవచ్చు. నిష్పక్షపాతంగా చూసినప్పుడు యుక్తవయస్సు పిల్లల నమ్మకాలలో మెరిట్ లేని వాటిని గుర్తించడంలో వారికి మనము సహాయం చేయగలిగినప్పుడు, ఆరోగ్యకరం కాని ఆలోచన విధానాలను తిప్పికొట్టగల, అడ్డుకోగల మరియు వివాదం చేయగల నైపుణ్యాలు గల వారి టూల్‌బాక్స్‌కి మరిన్ని టూల్‌లను జోడిస్తాము.3 అప్పుడు వాటిని ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన వాటితో వారు రీప్లేస్ చేయవచ్చు. ఇది ఇప్పుడు మరియు భవిష్యత్తులో సానుకూల దృక్పథాలు మరియు జీవన విధానాలుగా అనువదిస్తుంది.

చలనచిత్రాలు మరియు పుస్తకాలతో స్థితిస్థాపకతను సంరక్షకులు ఎలా పెంపొందించగలరు

ప్రత్యేకించి యువత, పాప్ సంస్కృతి మరియు మీడియా దాదాపుగా విడదీయరాని విధంగా అల్లుకుపోయినందున తల్లిదండ్రులు మరియు సంరక్షకులు స్థితిస్థాపకతను బోధించడానికి చలనచిత్రాలు మరియు పుస్తకాలను ఉపయోగించవచ్చు. మనము సహజంగా కథ యొక్క ఆకృతితో కనెక్ట్ అవుతాము మరియు మన జీవితం మొత్తంలో విన్న, చూసిన లేదా చదివిన గొప్పవాటితో మనలో గాఢమైన కదలిక వస్తుంది. చాలామంది పిల్లలు ప్రాథమిక పాఠశాలలో అద్భుత కథలు మరియు గ్రీకు పురాణాలు మొదలుకుని కౌమార దశ మరియు యుక్తవయస్సులో ఎదుగుతున్న సూపర్‌హీరోలు, జీవితంలోని తర్వాత భాగంలో క్రీడల నేపథ్యం గల మరియు యుద్ధ సంబంధ చలచిత్రాల ద్వారా ప్రభావితమయ్యారు, అలాగే ఈ కథలలో ప్రతి ఒక్కటీ వారి స్వంత జీవితాలలో గొప్ప కథగా చెప్పుకునేలా జీవించేందుకు వారికి ప్రేరణ అందించగలదు. వయస్సు స్థాయిని బట్టి విభజించబడిన మా ఫేవరేట్‌లలో కొన్ని దిగువన అందించబడ్డాయి.

స్థితిస్థాపకతను బోధించడానికి చలనచిత్రాలు మరియు కార్యక్రమాలు:

మధ్యమ పాఠశాల

 • ఫేసింగ్ ది జెయింట్స్
 • ఫైండింగ్ ఫారెస్టర్
 • గ్రేటెస్ట్ షోమ్యాన్
 • ది 33
 • ది ఫ్లోరిడా ప్రాజెక్ట్
 • ది రెస్క్యూ

హై స్కూల్

 • 127 గంటలు
 • ఎటిపికల్
 • క్రీడ్
 • పెంగ్విన్ బ్లూమ్
 • రాబిట్-ప్రూఫ్ ఫెన్స్
 • వెన్ దె సీ అజ్

స్థితిస్థాపకతను బోధించే పుస్తకాలు:

మధ్యమ పాఠశాల

 • ఎల్ డెఫో
 • ఫిష్ ఇన్ ఎ ట్రీ
 • సోర్టా లైక్ ఎ రాక్ స్టార్
 • ది బాయ్ హూ హార్నెస్డ్ ది విండ్
 • ది డాట్
 • ది హంగర్ గేమ్స్

హై స్కూల్

 • ఎ లాంగ్ వాక్ టు వాటర్
 • ఫాస్ట్ ట్రాక్ ఆన్ ఎ స్లో ట్రాక్
 • హాట్చెట్
 • ఆఫ్ హ్యూమన్ బాండేజ్
 • ది రూల్స్ ఆఫ్ సర్వైవల్
 • వర్లిగిగ్

యుక్తవయస్సు పిల్లలు ఎదుర్కొనే ఏదైనా ఆన్‌లైన్ (లేదా ఆఫ్‌లైన్!) ప్రతికూలతను మరింత సానుకూల దృష్టిలో తిరిగి ఫ్రేమ్ చేయడంలో వారికి సహాయపడటం ద్వారా మరియు దృక్పథాలు, చర్యలు మరియు జీవితాలను అనుకరించగల విజేతలకు సంబంధించిన కథనాలను అందించడం కోసం మీడియాను ఉపయోగించుకోవడాన్ని చేర్చుకోవడం ద్వారా స్థితిస్థాపకతను పెంపొందించడానికి తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ప్రాధాన్యతనివ్వడం మంచిది. అలా చేయడం వల్ల వారి ఆన్‌లైన్ అనుభవాలపై నియంత్రణను కలిగి ఉండటానికి మరియు హాని నుండి తమను తాము మెరుగ్గా రక్షించుకోవడానికి వారు సన్నద్ధం అవుతారు. అదనంగా, ఈ మార్గాలలో స్థితిస్థాపకతను పెంపొందించడం వలన మీ పిల్లల ఆత్మవిశ్వాసం, సమస్య పరిష్కార సామర్థ్యం, స్వయంప్రతిపత్తి మరియు ఉద్దేశ్య భావన శక్తివంతం చేయబడతాయి – ఇవన్నీ ఆరోగ్యవంతమైన యువత అభివృద్ధికి కీలకం.

1 హెండర్సన్, ఎన్., & మిల్‌స్టెయిన్, ఎమ్. ఎమ్. (2003). పాఠశాలల్లో స్థితిస్థాపకత: విద్యార్థులు మరియు విద్యావేత్తల కోసం దీన్ని సాధ్యమయ్యేలా చేయడం.
థౌజండ్ ఓక్స్, సిఎ: సేజ్ పబ్లికేషన్స్ (కార్విన్ ప్రెస్)

2 హిందూజ, ఎస్. & ప్యాచిన్, జె. డబ్యూ. (2017). బెదిరింపు మరియు సైబర్ బెదిరింపు బారిన పడకుండా నివారించడానికి యువతలో స్థితిస్థాపకతను పెంపొందించడం. చిన్నారి దుర్వినియోగం & నిర్లక్ష్యం, 73, 51-62.

3 ఆల్బర్ట్ ఎల్లిస్ యొక్క ABC (ప్రతికూలత, నమ్మకాలు మరియు పరిణామాలు) మోడల్ ఆధారితం. దయచేసి ఎల్లిస్, ఎ. (1991) చూడండి. రేషనల్-ఎమోటివ్ థెరపీ (RET) యొక్క సవరించిన ABC. జర్నల్ ఆఫ్ రేషనల్-ఎమోటివ్ అండ్ కాగ్నిటివ్-బిహేవియర్ థెరపీ, 9(3), 139-172.

సంబంధిత అంశాలు

మీ స్థానానికి నిర్దిష్టమైన కంటెంట్‌ను చూడడానికి మరొక దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా?
మార్చండి