ఎలిస్సీ డిక్, Reality Labs విధానం మేనేజర్ మరియు జాక్లిన్ డోయిగ్-కీస్, భద్రతా విధానం మేనేజర్
ఈ సంవత్సరం Facebook, Instagram, WhatsApp, Meta Horizon మరియు ఇతర వర్చువల్ మరియు మిక్స్డ్ రియాలిటీ అనుభవాలలో వ్యక్తులు తమను తాము సూచించుకోవడానికి మరిన్ని ఎంపికలను అందించేలా మా Meta అవతార్‌లను అప్‌డేట్ చేసాము. ఈ తర్వాతి తరం అవతార్‌లు సరికొత్త ఇంటి శైలిని పరిచయం చేస్తాయి మరియు వ్యక్తులు తమను తాము వ్యక్తీకరించడానికి మరింత శక్తిని అందిస్తాయి.
అవతార్‌లు అనేవి ఆన్‌లైన్‌లో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి మీ యొక్క డిజిటల్ సూచికలు అని మీకు తెలిసి ఉండవచ్చు. కానీ భవిష్యత్తు మెటావర్స్‌లో, యాప్‌లు మరియు అనుభవాలలో గుర్తింపులో అవి ప్రధాన భాగంగా ఉంటాయి. అందుకోసమే మీ ప్రత్యేక సృజనాత్మకత, ఆసక్తులు మరియు గుర్తింపును ప్రతిబింబించే అవతార్‌లను డిజైన్ చేయడాన్ని మేము సులభతరం చేయాలనుకున్నాము.
మేము వ్యక్తులకు వారి ప్రామాణిక వ్యక్తిత్వాన్ని సూచించే అవతార్‌లను సృష్టించడానికి అవసరమయ్యే టూల్‌లను అందించాలనుకుంటున్నాము. కానీ అదే సమయంలో, గుర్తింపులోని వివిధ భాగాల వలన వారికి మరియు ఇతరులకు విభిన్న వర్చువల్ స్పేస్‌లలో భద్రత, గోప్యత మరియు సమగ్ర అనుభవంపై ప్రభావం ఉండవచ్చనే విషయంలో కూడా మేము జాగ్రత్త వహించాలనుకుంటున్నాము. ఈ విషయంలో మాకు సహాయకరంగా ఉండటానికి, మేము డా. రాచెల్ రోడ్జర్స్ అనే విద్యావేత్తతో కలిసి పని చేసాము, ఈయన యువత మరియు ఇతర డిజిటల్ భద్రత మరియు శ్రేయస్సు నిపుణులను సంప్రదించి ఈ గైడ్‌ని క్రియేట్ చేయడానికి మీడియా మరియు యువత శ్రేయస్సుపై దృష్టి పెట్టే విధంగా పని చేసారు. ఇందులో, మీరు టీనేజ్ పిల్లల కోసం చిట్కాలను మరియు అవతార్‌ల ద్వారా గుర్తింపును సురక్షితంగా మరియు గౌరవప్రదంగా ఎలా అన్వేషించాలనే దానిపై తల్లిదండ్రులకు మార్గదర్శకత్వాన్ని పొందుతారు.
ఈ గైడ్ అనేది యువత మరియు వారి తల్లిదండ్రులు కలిసి వర్చువల్ స్వీయ-వ్యక్తీకరణ గురించి తెలుసుకోవడంలో సహాయపడుతుందని మరియు అవతార్ అనుభవాలలో సురక్షితంగా ఎంగేజ్ కావడం కోసం వారికి టూల్‌లను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. మీ ప్రామాణిక వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజే ప్రతి అవతార్ ఒక నక్షత్రం వంటిదే - ప్రారంభించడానికి ఈ గైడ్‌ని ఉపయోగించండి మరియు మీ ఊహాత్మక శక్తి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడండి!
మీ Meta అవతార్‌ను స్టార్‌గా ఎలా మార్చాలనే విషయం గురించి ఆలోచించడానికి కొంత సమయం వెచ్చించండి: సురక్షితంగా, ఆలోచనాత్మకంగా, ప్రామాణికంగా మరియు గౌరవప్రదంగా ఉండాలి.
మీకు బహుశా తెలిసినట్లుగా, వ్యక్తులు వారి అవతార్‌లు ఎలా కనిపించాలనే విషయంలో నిజంగా చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. వారు తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే రూపాన్ని క్రియేట్ చేయవచ్చు లేదా స్టైల్ పరంగా వారికి కొన్ని మెరుగులు దిద్దుకుని, వారి అవతార్ మరింత స్టైల్‌గా ఉండేలా మార్చవచ్చు
చాలావరకు అవతార్‌లు ఒక వ్యక్తి అంతర్గత స్వభావాలు, శారీరక లక్షణాలు మరియు మరింత ప్రేరణాత్మక అంశాల కలయికగా ఉంటాయి. భౌతిక ప్రపంచంలో మీరు చేయడానికి అవకాశం లేని మార్గాల్లో మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోవడానికి అవతార్‌లు గొప్ప మార్గంగా ఉండవచ్చు.
మీ వ్యక్తిత్వం మరియు గుర్తింపుకు సంబంధించిన ఏయే అంశాలను అవతార్‌లో చేర్చాలనుకుంటున్నారో ఆలోచించడం అనేది ప్రారంభానికి మంచి విషయంగా ఉంటుంది! కొన్నిసార్లు ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టంగా ఉండవచ్చు, కాబట్టి మీకు ఏదైనా విషయాన్ని ఎలా మొదలుపెట్టాలో సరిగ్గా తెలియకపోతే, ఎల్లప్పుడూ తల్లిదండ్రులు లేదా విశ్వసనీయమైన పెద్దవారితో మాట్లాడండి.
మీరు ఆన్‌లైన్‌లో మీ గోప్యతను రక్షించుకునే విషయంలో చాలావరకు బాగా ఆలోచనాత్మకంగా ఉంటారు. స్టార్ అవతార్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది! ఇప్పటికీ మిమ్మల్ని సూచిస్తున్న ఫోటోకు కార్టూన్ వంటి అవతార్ ఒక వినోదభరితమైన ప్రత్యామ్నాయం.
మనం ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, మన గురించి చాలా విషయాలను పంచుకోవచ్చు. మనం ఎవరు, మనకు వేటిపై శ్రద్ధ ఉంది, మనం ఎలాంటి ఇంప్రెషన్ పొందడానికి ప్రయత్నిస్తున్నాము మరియు మనం ఏ కమ్యూనిటీలకు చెందుతాము వంటివి చూపగలము.
అవతార్‌లు కూడా ఈ పనులు చేయగలవు! అలాగే ఇతర వ్యక్తుల అవతార్‌లు వారి గురించిన వివరాలను మనకు తెలియజేయగలవు. ఉదాహరణకు, మీ ఫేవరేట్ జట్టు లేదా బ్యాండ్ గల చొక్కా ధరించడం అనేది మీరు వారి అభిమాని అని ఇతర వ్యక్తులకు తెలియజేస్తుంది. మీ అవతార్ మీ గుర్తింపుకు సంబంధించి మరిన్ని ముఖ్యమైన అంశాలను కూడా షేర్ చేయగలదు. ఇది మీ జాతి, జాతిమూలం మరియు సంస్కృతి, వయస్సు, లింగ వ్యక్తీకరణ, సామర్థ్యం లేదా మతం గురించి ఇతరులకు తెలియజేయవచ్చు.
భౌతిక లేదా వర్చువల్ ప్రపంచంలో తమను తాము చూపించుకోవడం అనేది మీ స్వరం లాగానే ఒక కమ్యూనికేషన్ టూల్, కనుక మీరు దీన్ని అంతే జాగ్రత్తగా ఉపయోగించాలి.
కొన్నిసార్లు ఇతరులు మన రూపాన్ని గ్రహించకపోయినప్పటికీ సామాజిక మూసపద్ధతుల్లో పాతుకుపోయిన మార్గాల్లో దాన్ని అర్థం చేసుకుంటారు. ప్రపంచాన్ని వేగంగా అర్థం చేసుకోవడానికి మన మనస్సులలో ఏర్పడే షార్ట్‌కట్‌లు ఇవి. కానీ ఇవి న్యాయమైనవి, ఖచ్చితమైనవి కాకపోవచ్చు లేదా ఎల్లప్పుడూ సహాయకరంగా ఉండకపోవచ్చు. ఒకరి ఉద్దేశ్యం ఏమిటనేది మనం ఊహించుకోవడానికి బదులుగా వారి అవతార్ ఎంపికల గురించి వారినే అడిగి తెలుసుకోండి! అలాగే ఇతరులు కూడా మీ గురించి తప్పుగా అంచనాలు వేయవచ్చని గుర్తుంచుకోండి.
మీ అవతార్ శరీర ఆకృతి, ముఖం మరియు దుస్తులతో సహా అది కనిపించే రూపం అనేది మీరు ఇతరులకు ఎంత వయస్సు గల వ్యక్తిగా కనిపిస్తారనే దానిపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు, కొన్ని ఎంపికల వలన మీకు వాస్తవంలో ఉన్నదాని కంటే ఎక్కువ వయస్సు లేదా తక్కువ వయస్సు ఉన్నట్లు కనిపించవచ్చు.
మీరు మీ అవతార్‌ను క్రియేట్ చేసేటప్పుడు, మీరు ఇతరులతో ఏమి పంచుకోవాలనుకుంటున్నారు, మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారు మరియు ఎవరితో ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నారు వంటి వాటి గురించి ఆలోచించండి.
ఆన్‌లైన్‌తో సహా ఏ స్పేస్‌లో అయినా, మీ రూపం ఆధారంగా వ్యక్తులు మీ గురించి ఏమి ఊహించుకోవచ్చనే విషయం గురించి ఆలోచించడం ముఖ్యం. ఉదాహరణకు, మీరు మీ అవతార్‌ని ఎలా డిజైన్ చేస్తారనే దాని ఆధారంగా, మీకు మీ అసలు వయస్సు కంటే ఎక్కువ ఉంటుందని వ్యక్తులు అనుకోవచ్చు లేదా వయస్సుకి తగని మార్గాల్లో ఇంటరాక్ట్ కావచ్చు. ఇది అసౌకర్యంగా ఉండవచ్చు. మీ గురించి మీరు ఏమి పంచుకోవాలనుకుంటున్నారు మరియు వ్యక్తులు మీ గురించి ఏమి "చదువుతూ" ఉండవచ్చు అనే రెండింటినీ పరిగణించండి!
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:
ఆన్‌లైన్‌లో మిమ్మల్ని మరియు మీ స్నేహితులను సురక్షితంగా ఉంచుకోవడానికి బహుశా మీరు ఇప్పటికే వ్యూహాలను కలిగి ఉండవచ్చు! మీరు “నిజానికి” ఎలా ఉంటారో ఎవరైనా తెలుసుకోవాలని కోరుకుంటే, వారికి ఫోటో పంపే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని గుర్తుంచుకోండి. మీరు ఎవరితో కనెక్ట్ అవుతున్నారనే విషయంలో జాగ్రత్త వహించండి, అలాగే ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి మీరు నేర్చుకున్న వ్యూహాలను ఉపయోగించండి. మీకు సరిగ్గా తెలియకపోతే, విశ్వసనీయమైన పెద్దలను అడగండి.
మీ అవతార్ మీ గురించి నిర్దిష్ట విషయాలను ఎలా కమ్యూనికేట్ చేయవచ్చు మరియు మిమ్మల్ని ఎవరు చూస్తారు వంటి వాటి గురించి ఆలోచించండి.
మేము వినోదం పొందడం, ఇతరులతో మాట్లాడటం మరియు మా జీవితాలలో జరిగే విషయాలను పంచుకోవడం కోసం వర్చువల్ స్పేస్‌లను ఉపయోగిస్తాము. మీరు ఎలాగైతే పాఠశాల, కుటుంబ సభ్యులతో పాల్గొనే విందు, కార్యాలయం లేదా హ్యాంగ్ అవుట్ సమయాలలో వేర్వేరుగా కనిపించినట్లే, ఈ స్పేస్‌లలో కూడా వేర్వేరు "స్వరూపాలు" ఉండేలా చేయవచ్చు. మీరు నిర్దిష్ట స్థలంలో ఎలా కనిపించాలనుకుంటున్నారు మరియు ఎందుకు అనే విషయాల గురించి ఆలోచించడం ముఖ్యం.
అవతార్ స్టైలింగ్ ఎంపికలు అనేవి నిర్దిష్ట స్పేస్‌లకు ఎక్కువ లేదా తక్కువ సముచితంగా ఉండవచ్చు. మీరు సీరియస్ ఇంటరాక్షన్‌ల కోసం మరింత ప్రామాణికమైన అవతార్ లేదా గేమ్‌ల కోసం మరింత ఉల్లాసభరితమైన అవతార్ ఉండాలని కోరుకోవచ్చు.
మీరు ప్రతిచోటా ఒకే Meta అవతార్‌ని కలిగి ఉండేలా ఎంచుకోవచ్చు లేదా వేర్వేరు యాప్‌లు లేదా స్పేస్‌ల కోసం ప్రత్యేకమైన అవతార్‌ని ఉపయోగించవచ్చు. Facebook, Instagram, WhatsApp లేదా Meta Horizonలో మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతారనే దాని గురించి ఆలోచించండి. మీరు ఆ స్పేస్‌లలోని వ్యక్తులతో మీ గురించి ఏయే విషయాలను పంచుకోవాలనుకుంటున్నారు? మీరు ఏయే విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నారు?
విభిన్న మానసిక స్థితులను క్యాప్చర్ చేయడానికి లేదా మీ గుర్తింపులోని విభిన్న భాగాలను హైలైట్ చేయడానికి బహుళ అవతార్‌లను క్రియేట్ చేయండి!
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:
మీరు మొదటి నుండి అవతార్‌ను క్రియేట్ చేయడాన్ని ఎంచుకోవచ్చు లేదంటే మీ పోలికలు ఎక్కువగా కనిపించేలా చేయడంలో సహాయకరంగా సెల్ఫీతో ప్రారంభించవచ్చు!
అవతార్‌లకు సంబంధించిన అద్భుతమైన విషయలలో ఒకటి ఏమిటంటే, ఏ స్పేస్‌లో అయినా ఇతరులు మనల్ని ఎలా చూడాలని కోరుకుంటామనేది నిర్ణయించుకునే సౌలభ్యాన్ని అవి మనకు అందిస్తాయి. ప్రతి ఒక్కరూ ముఖ లక్షణాలు మరియు జుట్టు, మేకప్ మరియు దుస్తులతో రకరకాల ప్రయోగాలు చేయవచ్చు. ఇవి మీలోని నిర్దిష్ట భాగాలు భౌతిక ప్రపంచంలో కంటే అవతార్ ద్వారా మరింత తేజోమయమైన రీతిలో అద్భుతంగా కనిపించడంలో సహాయపడతాయి.
విభిన్న రూపాలను ప్రయత్నించి, అవి మనకు ఎలా అనిపిస్తున్నాయో చూడటానికి అవతార్‌లు ఒక ఆహ్లాదకరమైన మరియు సులభమైన మార్గంగా కూడా ఉంటాయి. కొన్నిసార్లు మన భౌతిక రూపం అనేది మన "ప్రామాణిక స్వరూపానికి" మంచి ప్రతిరూపంగా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మనలోని కొన్ని విషయాలు భౌతిక ప్రపంచంలో అంత అద్భుతంగా కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు బహుశా మీరు లోపల ఎలా భావిస్తున్నారనే దానికి దగ్గరగా మీ అవతార్ కనిపించవచ్చు!
మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు మరియు ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారనే అంశాలకు ప్రామాణికంగా ఉండేలా మీ అవతార్‌ను మీరు డిజైన్ చేయవచ్చు. ఇది స్పేస్‌లు అంతటా భిన్నంగా ఉండవచ్చు! ఇది కాలానుగుణంగా కూడా మారవచ్చు. కొన్ని రోజులు మనం వేరేలా భావిస్తుంటాము, అలాగే మనమందరం మారుతూ మరియు ఎదుగుతూ ఉంటాము. మీకు ఏది ప్రామాణికంగా అనిపిస్తుందో తెలుసుకోవడానికి వివిధ ఎంపికలను ప్రయత్నించండి - ఇది మీరు నిజ జీవితంలో ఉండే విధంగానే కనిపించవచ్చు లేదా పూర్తి భిన్నంగా ఉండవచ్చు! ఇక్కడ నియమాలేవీ లేవు.
మీరు వాస్తవికత లేదా వినోదం వంటి విషయాలలో ప్రయోగాలు చేయాలనుకోవచ్చు. ఉదాహరణకు, కొన్ని జుట్టు రంగులు ఇతర వాటితో పోలిస్తే తక్కువ వాస్తవికంగా కనిపించవచ్చు. వీటిని ఎంచుకోవడం వల్ల వాస్తవికత కంటే వినోదానికి ప్రాధాన్యత ఉన్నట్లు భావన కలగవచ్చు. లేదంటే మీరు రోబో లేదా మీ ఫేవరేట్ సినిమా క్యారెక్టర్ వంటి అద్భుతమైన అవతార్‌గా మారిపోవచ్చు! మళ్లీ, మీరు మీ అవతార్‌ని ఉపయోగించబోయే స్పేస్‌ల సందర్భాన్ని ఎల్లప్పుడూ చూసుకోండి.
భౌతిక ప్రపంచంలో ఇప్పటికే మీరు తెలిసి ఉన్న వ్యక్తులు మీ అవతార్‌కు ఎలా ప్రతిస్పందించవచ్చనే విషయంలో జాగ్రత్త వహించండి. మీ భౌతిక రూపం అనేది మీ వర్చువల్ రూపానికి భిన్నంగా ఉన్నట్లయితే, వారు ఆశ్చర్యపోవచ్చు. మీకు "నిజ" జీవితంలో తెలిసిన ఎవరైనా మీరు ఆన్‌లైన్‌లో వేరే విధంగా కనిపించడాన్ని చూసినట్లయితే, వారితో జరపగల సంభాషణల గురించి ఆలోచించండి.
మరోవైపు, కొంతమంది వ్యక్తులకు మీ వర్చువల్ స్వరూపంలో మాత్రమే మీరు తెలిసి ఉండవచ్చు, అలాగే మీ గుర్తింపు గురించి వేరే ఏ ఇతర సందర్భాన్ని వారు కలిగి ఉండకపోవచ్చు. ఈ వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా "చదువుతారు" అనే దాని గురించి ఆలోచించండి. మీకు కావలసిన విధంగా మీరు కనిపించవచ్చు– కానీ మీరు వివిధ స్పేస్‌లలో అడుగుపెడుతున్నందున ఆలోచనాత్మకంగా మరియు సిద్ధంగా ఉండటం ముఖ్యం.
ఎ అనేది ప్రామాణికం, కానీ ఇది అభిలాషతో ఉండటాన్ని కూడా సూచించవచ్చు. అవతార్‌లు రెండు విధాలుగా ఉండవచ్చు!
వ్యక్తులు తమ అవతార్ అనేది వారి భౌతిక రూపానికి భిన్నంగా "అందంగా" కనిపించాలని కోరుకోవచ్చు. విభిన్న రూపాలతో ప్రయోగాలు చేయడానికి ఇది ఒక వినోదభరితమైన మార్గం కావచ్చు! కానీ మనం "అందంగా కనిపించడం" అని భావించేది తరచుగా మనం చూసే ప్రముఖులు, క్రీడాకారులు లేదా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఫోటోలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ ఇమేజ్‌లు తరచుగా భౌతిక ప్రపంచంలో చాలా మంది వ్యక్తులకు లేని "ఆదర్శ" లక్షణాలను కలిగి ఉంటాయి.
ఇది నిజ జీవితంలో దాదాపుగా ఎవరికీ సాధ్యం కాని విధంగా "మూసపోత పద్ధతిలో ఆదర్శ" రూపాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఆదర్శ రూపం అనేది వాస్తవంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ అవాస్తవికమైనదని గుర్తుంచుకోండి! మీ ఫేవరేట్ సెలబ్రిటీలు కూడా కెమెరా ముందు లేనప్పుడు బహుశా భిన్నంగా కనిపిస్తారు. వాస్తవానికి, ఎడిటింగ్ టూల్‌లు మరింత అభివృద్ధి చెందుతున్నందున, ఆన్‌లైన్‌లో కనిపించే రూపాలు భౌతిక ప్రపంచంతో పోలిస్తే తక్కువ వాస్తవంగా ఉంటున్నాయి. మీరు ఎవరినైనా ఆన్‌లైన్‌లో చూసినప్పుడు, ఇది ఆ స్పేస్‌లో మీకు వారు ఎలా కనిపించాలని కోరుకుంటున్నారనే దానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఇది వారు నిజానికి కనిపించే విధంగా ఉండకపోవచ్చని గుర్తుంచుకోండి!
మీరు మీ అవతార్‌ను అనుకూలీకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి! మీ ప్రామాణిక స్వరూపం అద్భుతంగా కనిపించే రూపాన్ని క్రియేట్ చేయడానికి వివిధ ఎంపికలను ప్రయత్నించి చూడండి.
మీరు మీ అవతార్ ముఖం, కళ్ళు లేదా ముక్కు ఆకారం మరియు పరిమాణాన్ని మార్చవచ్చు లేదా శరీరాన్ని చిన్నదిగా లేదా పెద్దదిగా చేయవచ్చు. ఎవరైనా ఒకరు వాస్తవానికి కనిపించే రూపానికి మార్పులు చేయడానికి ఈ టూల్‌లు ఉపయోగించబడవచ్చని తెలుసుకోండి, అలాగే "ఆదర్శాలు" అనేవి అవాస్తవికమైనవని గుర్తుంచుకోండి! ప్రతి ఆకారం మరియు లక్షణం అందంగా ఉంటుంది.
గుర్తుంచుకోండి: స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు అన్ని రకాల శరీరాకృతుల నుండి వస్తారు. ఆత్మవిశ్వాసం అనేది లోపలి నుండి వస్తుంది.
కొన్ని దశాబ్దాలుగా సౌందర్యం అనేది కళ, అలాగే సంస్కృతి మరియు నాగరికతలో ముఖ్యమైన విలువగా ఉంది. కానీ, “నేను “అందంగా కనిపించడానికి” ఎందుకు ప్రయత్నిస్తున్నాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వ్యక్తులను ఆకట్టుకోవడం కోసం ఈ విషయాలు ఉండాలని నేను నిజంగా విశ్వసిస్తున్నానా? ఏది ఆకర్షణీయమైనది మరియు కనిపించే రూపం అనేది ఎందుకు ముఖ్యమైనది అనే విషయాలపై నా విశ్వాసాల గురించి నేను పంపుతున్న సందేశాలు ఏమిటి?
ఎవరైనా స్నేహితులు తమ రూపం పట్ల సంతోషంగా లేనట్లయితే, ఆన్‌లైన్‌లో వ్యక్తులు కనిపించే రూపం అనేది భౌతికంగా కనిపించే రూపం మాదిరిగా ఉండదని వారికి గుర్తు చేయండి. చాలా మంది వ్యక్తులు ఫిల్టర్‌లు మరియు ఇతర టూల్‌లను ఉపయోగిస్తారు. వారి ఆందోళనలకు సంబంధించి సహాయం కోసం విశ్వసనీయమైన పెద్దవారిని అడగమని వారిని ప్రోత్సహించండి.
ప్రతి శరీర రకం, పరిమాణం, ఆకారం మరియు లక్షణంలో నుండి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు వస్తారని గుర్తుంచుకోండి! (జుట్టు, చర్మం రంగు, కన్ను లేదా ముక్కు ఆకారం, మొద.)!
మీరు అవతార్‌ను క్రియేట్ చేసేటప్పుడు మీకు ముఖ్యమైనది, అలాగే అందమైనది ఏమిటి? ఏమి అందంగా ఉంటుందనే మీ భావనకు మీ అవతార్ అనుగుణంగా ఉందా?
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:
మీ అవతార్‌కు సంబంధించిన ఎంపికల పరిధి స్వేచ్ఛగా ఉండవచ్చు, కానీ అది మీరు ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో ఎలా కనిపిస్తారనే దాని గురించి సంక్లిష్ట భావాలను కూడా తీసుకురావచ్చు. ఈ విషయం గురించి మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే, విశ్వసనీయమైన పెద్దవారిని సంప్రదించండి.
నిజమైన వ్యక్తులు ఉన్నదాని కంటే మరింత ఎక్కువ విస్తృతమైన పరిధిలో అవతార్‌లు ఉన్నాయి! వ్యక్తులు కనిపించగల వివిధ రూపాలను చూసి, ఆనందించడానికి ఇది అద్భుతమైన మార్గం. వాస్తవానికి, స్టైల్‌గా ఉండే Meta అవతార్‌ను రూపొందించడానికి క్వింటిలియన్‌కు పైగా విభిన్న మార్గాలు ఉన్నాయి!
వర్చువల్ స్పేస్‌లో ప్రతి ఒక్కరూ తమకు సూచికగా ఉంటుందని భావించే అవతార్‌ను క్రియేట్ చేసుకున్నారు. మనం వర్చువల్ ప్రపంచంలో ఉన్న అందరితో వారు ఎలా కనిపిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా మర్యాదగా మరియు గౌరవంగా ప్రవర్తించాలి.
కనిపించే రూపంలోని కొన్ని అంశాలు విభిన్న సమూహాలకు సంబంధించి శక్తివంతమైన సాంస్కృతిక అర్థాలను కలిగి ఉంటాయి. ఇవి మీ ప్రామాణిక స్వరూపం మరియు మీ విలువలకు సూచికగా ఉండటంలో మీ అవతార్‌కు సహాయపడవచ్చు. కానీ ఇతరులకు సంబంధించి ముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉండే అంశాలను ఎంచుకోవడం అనేది మీ ఉద్దేశ్యం కాకపోయినప్పటికీ అమర్యాదకరంగా కనిపించవచ్చు!
మీరు మీ అవతార్ కోసం ఉపయోగించే అంశాలను ఇతర వ్యక్తులు కూడా భిన్నంగా అర్థం చేసుకోవచ్చు. అపార్థాలు సంభవించవచ్చు. ఇతర వ్యక్తులకు సంబంధించి వివిధ చిహ్నాల అర్థం ఏమిటనేది అడిగి తెలుసుకోవడం ప్రత్యేకించి అపార్థాలు ఉన్నట్లయితే, సహాయకరంగా ఉండవచ్చు.
మీరు ఆన్‌లైన్‌లో ఇతరులతో ఎంగేజ్ అయినప్పుడు, వారు తమను ఎలా సూచించుకుంటున్నారు అనే దాని ఆధారంగా మీరు ఎలాంటి విషయాలను ఊహించుకుంటారు? అలా ఊహించుకున్న విషయాలు మీరు వారితో ఎలా ఇంటరాక్ట్ అవుతారనే దాన్ని ప్రభావితం చేస్తాయా? మీరు ఏదైనా ఊహించుకోవడానికి ముందు ఎల్లప్పుడూ స్పష్టంగా అడిగి తెలుసుకునేలా చూసుకోండి.
మీరు భౌతిక ప్రపంచంలో ఉండే దాని కంటే భిన్నంగా కనిపించే అవతార్‌ను ఎంచుకున్నట్లయితే, ఈ విధంగా కనిపించే భౌతిక రూపం కలిగిన వ్యక్తుల గురించి మీరు ఏ సందేశాలను పంపుతున్నారనేది ఒకసారి పరిశీలించండి. పెద్దవారిని లేదా స్నేహితులను ఇలా అడగండి: “ఇది వేరే ఎవరికైనా కలతను కలిగించవచ్చా?”
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:
ఊహించుకోవద్దు! ఎల్లప్పుడూ వేరే వారి గుర్తింపుల గురించి అడిగి తెలుసుకోండి. అలాగే వర్చువల్ స్పేస్‌లలో అమర్యాదకరమైన ఇంటరాక్షన్‌లను మీరు చూసినట్లయితే, విశ్వసనీయమైన పెద్దవారు జోక్యం చేసుకునేలా చేయండి. వర్చువల్ స్పేస్‌లలో గౌరవప్రదమైన ప్రవర్తనకు సంబంధించిన నియమాలు, అలాగే వాటిని అతిక్రమించే వ్యక్తులపై ఫిర్యాదు చేయడానికి టూల్‌లు ఉండవచ్చని గుర్తుంచుకోండి.
మీ అవతార్‌లను జాగ్రత్తగా ఆలోచించి క్రియేట్ చేయాలని గుర్తుంచుకోండి. మీ విలువలతో పాటుగా మా కమ్యూనిటీ విలువలకు సంబంధించి మీకు మీరే నిజాయితీగా ఉండండి.
అడగండి: మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయిని వారి అవతార్(ల) గురించి ఈ ప్రశ్నలు అడగండి:
అడగండి: “మీ అవతార్ గురించి నాకు చెప్పండి. మీ గురించి మీరు వ్యక్తులకు ఏమి చెప్పాలని కోరుకుంటున్నారు?”
అడగండి: “మీ కొత్త అవతార్‌కు వ్యక్తులు ఎలా ప్రతిస్పందిస్తున్నారు? మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ యాప్ కోసం మీరు ఎందుకు దీన్ని ఎంచుకున్నారు?”
సహాయసహకారాలు అందించండి: మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి వారి అవతార్‌ను రూపొందిస్తున్నప్పుడు వారితో సహకరించండి. మీరే స్వంతంగా రూపొందించడానికి ప్రయత్నించండి, మీకు సహాయపడటానికి వారిని అనుమతించండి! ఇద్దరూ కలిసి వివిధ లక్షణాలను ప్రయత్నించి చూడండి మరియు వారే స్వయంగా ప్రదర్శించుకునే విషయంలో ఆలోచించేందుకు వారికి సహాయపడండి.
సహాయసహకారాలు అందించండి: మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయితో కలిసి థీమ్ లేదా మనస్థితిని ఎంచుకుని, దాన్ని సూచించే అవతార్‌లను క్రియేట్ చేయడం కోసం కలిసి పని చేయండి. భౌతిక ప్రపంచంలో మీరు ఎలా కనిపిస్తారనే దానికి సారూప్యంగా లేదా భిన్నంగా ఉండే ఎంపికలు చేయడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. కొన్ని అంశాలకు భిన్నంగా సూచించడం అనేది ఎలాంటి అనుభూతిని ఇస్తోందో ఒకరినొకరు అడిగి తెలుసుకోండి.
ఇతరులపై వారి అవతార్‌ల ఆధారంగా ముందుగానే ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవద్దని టీనేజ్ పిల్లలను ప్రొత్సహించండి. బదులుగా, అవతలి వ్యక్తి లేదా ప్లేయర్‌తో మాట్లాడటం ద్వారా వారి ఎంపికల వెనుక ఉన్న అర్థాన్ని అన్వేషించడంలో వారికి సహాయపడండి.
సహాయసహకారాలు అందించండి: ఇతర వ్యక్తుల అవతార్‌ల అర్థాల గురించి మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయిని అడగండి: “దాని గురించి నాకు చెప్పండి? ఇతర వివరణలు ఉండవచ్చని మీకు అనిపిస్తోందా?”
ఇతరులు సాంస్కృతిక సంకేతాలు మరియు చిహ్నాల ఉపయోగించడం గురించి వారిని ఆలోచనాత్మక ప్రశ్నలు అడగటంలో ఆదర్శంగా నిలవండి: “నేను మీ అవతార్ [అంశాన్ని] గమనిస్తున్నాను. మీ విషయంలో దీని అర్థం ఏమిటనే దాని గురించి మీరు నాకు చెప్పగలరా”?
నియంత్రణలు: తమ అవతార్‌ను ఉపయోగిస్తూ ఉండగల అనుభవాలను నావిగేట్ చేయడానికి తల్లిదండ్రులు మరియు టీనేజ్ పిల్లల కోసం టూల్‌లను Meta అందిస్తోంది. మీ కుటుంబానికి సరిపోయే, అలాగే సురక్షితమైన వాతావరణాన్ని నిర్మించడంలో సహాయపడగల సెట్టింగ్‌లను కనుగొనడం కోసం మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయితో కలిసి పని చేయండి.
టీనేజ్ పిల్లలు తమ గుర్తింపు మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరుచుకుంటున్నారు. టీనేజ్ పిల్లలు ఎదుగుతున్న సమయంలో ఈ అంశాలను వివిధ రకాలుగా ప్రయత్నించి, చూడటం సాధారణ విషయం.
భౌతిక ప్రపంచంలో ఉండే అవకాశం లేని విధంగా ఫిర్యాదు చేయడం మరియు అమలు చర్యలు తీసుకోవడం వంటి వాటి కోసం కమ్యూనిటీ నియమాలు మరియు టూల్‌లు వర్చువల్ స్పేస్‌లలో ఉన్నాయి. మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి తమ స్వరూపంలోని విభిన్న భాగాలు మరియు వారి వ్యక్తిత్వంతో సురక్షితంగా ప్రయోగాలు చేయడం కోసం ఈ అనుభవాలు మంచి ప్రదేశంగా ఉండవచ్చు.
అయినప్పటికీ, మీరు బెదిరింపులు మరియు వేధింపులు లేదా అత్యంత ఆదర్శవంతమైన అవతార్‌లను చూసిన తర్వాత తాము కనిపించే రూపం పట్ల అసంతృప్తి వంటి విభిన్న అంశాల గురించి మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయితో సంభాషణలు జరపడానికి సిద్ధంగా ఉండాలి.