ఆన్‌లైన్‌లో సమతుల్యతను సాధించడం

Meta

మార్చి 2, 2022

అన్ని స్క్రీన్ సమయాలు ఒకటే కాదు

యుక్తవయస్సు వ్యక్తులకు (అలాగే ప్రతి ఒక్కరికీ!) ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో వెచ్చించిన సమయాల మధ్య తగిన సమతుల్యతను కనుగొనడం ముఖ్యం. మన జీవితాల్లోని అనేక స్థలాల్లో సాంకేతికత కనిపిస్తున్నందున, ఆన్‌లైన్ స్పేస్‌లలో మనం వెచ్చించే సమయం యొక్క పరిమాణం మరియు నాణ్యత రెండిటికీ సావధానత చూపడం అవసరం.

ఎప్పటిలాగానే: సంభాషణ అనేది మొదటి దశగా ఉంటుంది. యుక్తవయస్సులోని తమ పిల్లలు వారి సమయాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కడ వెచ్చిస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి అలాగే ఆ సమయం వెచ్చించడానికి సరైనదా కాదా అనే దాని గురించి వారితో సంభాషణ జరపాలి.

పైన పేర్కొన్నవే కాకుండా: వారి సాంకేతికత మరియు ఇంటర్నెట్ వినియోగం వల్ల వారి మనఃస్థితిని అర్థం చేసుకునేందుకు మీ శాయశక్తులా ప్రయత్నించండి. యుక్తవయస్సులోని మీ పిల్లలు ఆన్‌లైన్‌లో వారి సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నారనే దాని గురించి మరింత తెలుసుకోవడం ద్వారా, ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ కార్యకలాపం మధ్య వ్యత్యాసాన్ని కనుగొనడంలో వారికి సహాయపడటం ద్వారా మీరు వారి శ్రేయస్సుకు మద్దతివ్వవచ్చు.

స్క్రీన్ సమయాన్ని నిర్వహించడంలో యుక్తవయస్సులోని పిల్లలకు సహాయపడేందుకు చిట్కాలు

యుక్తవయస్సులోని మీ పిల్లల ఇంటర్నెట్ వినియోగం గురించి వారితో మాట్లాడటానికి ఉత్తమమైన మార్గం ఏదీ లేనప్పటికీ, సంభాషణను ప్రారంభించడానికి మార్గాలు ఉన్నాయి. యుక్తవయస్సులోని మీ పిల్లలపై స్క్రీన్ సమయం ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు మీరు గమనిస్తున్నట్లయితే, ఆ విషయాన్ని గురించి తగిన సమయంలో చర్చించడంతో ప్రారంభించండి.

సామాజిక మాధ్యమంలో వారు ఇప్పటికే వెచ్చించిన సమయం గురించి అలాగే దాన్ని వినియోగించడం గురించి వారు ఎలా అనుకుంటున్నారో ముందుగా తెలుసుకోవడం ఒక ఉత్తమ పద్ధతి. ఈ జ్ఞానాన్ని పొందడానికి, మీరు ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు:

  • మీరు ఆన్‌లైన్‌లో చాలా ఎక్కువసేపు గడుపుతున్నట్లు మీకు అనిపిస్తోందా?
  • మీరు ఆన్‌లైన్‌లో గడిపే సమయం మిమ్మల్ని మీ ఇతర బాధ్యతలు నెరవేర్చకుండా అడ్డుకుంటోందా?
  • మీరు గడిపే సమయం మీపై (శారీరకంగా లేదా మానసికంగా) ఎలాంటి ప్రభావం చూపుతోంది?

మొదటి రెండు ప్రశ్నలకు “అవును” అనే సమాధానాలు వస్తే, యుక్తవయస్సులోని మీ పిల్లలు ఆన్‌లైన్‌లో గడిపే సమయం గురించి వారు ఏమనుకుంటున్నారు అనే సూచన మీకు అందుతుంది. అక్కడి నుంచి, ఆ సమయాన్ని నిర్వహించడం కోసం మార్గాలను వెతికేందుకు మరియు ఆఫ్‌లైన్‌లో అర్థవంతమైన కార్యకలాపాలతో దాన్ని సమతుల్యం చేసేందుకు వారికి సహాయంగా మీరు ప్రారంభించవచ్చు.

మీరు ఇటువంటి అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు:

  • ఉదయం ఎంతసేపటి వరకు మీరు మీ ఫోన్‌ను తనిఖీ చేయకుండా ఉండగలరు?
  • అది లేకుండా మీరు పరధ్యానంగా లేదా ఆందోళనగా ఉన్నట్లుగా భావిస్తున్నారా?
  • మీరు మీ స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు, మీరు ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ ఉంటారా?
  • మీరు ఏ రకమైన ఆఫ్‌లైన్ కార్యకలాపాలను చేయడం మిస్ అవుతుంటారు?
  • దేనికోసమైనా ఎక్కువ సమయం కావాలని మీరు భావించేది ఏదైనా ఉందా?

ఆఫ్‌లైన్‌లో ఆసక్తులను అన్వేషించడం

ఫోన్‌ను పక్కన పెట్టడం మాత్రమే స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి ఉన్న మరొక మంచి మార్గం కాదు, అయితే ఆ సమయాన్ని అర్థవంతంగా మరియు ఆఫ్‌లైన్‌లో వినోదకరమైన కార్యకలాపాలతో గడపడానికి యాక్టివ్‌గా పని చేయడం కూడా ఒక మార్గం.

యుక్తవయస్సులోని మీ పిల్లలు ఆర్ట్ రూపొందించడం, సంగీతాన్ని ప్లే చేయడం, పుస్తకాలు చదవడం, అంశాలను రూపొందించడం, ఆటలు ఆడటం లేదా స్క్రీన్ సమయంతో సంబంధం లేని ఏదైనా చేస్తుంటే - బయటపడేందుకు వారికి సహకరించండి! వారు ఏమి చేస్తున్నారనే వాటి పట్ల ఆసక్తి చూపడం ద్వారా ఆ ఆసక్తులను మెరుగుపరచండి. యువత సౌకర్యం కోసం లేదా కొన్నిసార్లు విసుగు నుంచి బయటపడేందుకు ఫోన్‌లను ఆశ్రయించవచ్చు. వారిని ఎల్లప్పుడూ ఆ భావాలకు దూరంగా ఉండనివ్వకుండా ప్రయత్నించండి. అటువంటి భావాల ద్వారా పని చేసినప్పుడు ఒక చిన్నపాటి అసౌకర్యం లేదా విసుగు కారణంగా ఒక యువ వ్యక్తికి ఇతర వ్యాపకాలు ఎక్కువ అవుతాయి.

తరచుగా, యువ వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఫాలో అయ్యే అంశాలు, విషయాలు మరియు క్రియేటర్‌లు అనేవి ఆఫ్‌లైన్‌లోని వారికి ఆసక్తి ఉన్న అంశాలకు సంబంధించిన మంచి సూచిక.

ఉదాహరణకు, DIY వంట, డ్యాన్స్ లేదా ఏదైనా ఇతర నైపుణ్యాన్ని బోధించే క్రియేటర్‌లను వారు ఫాలో అవుతున్నట్లయితే, ఇంట్లో లేదా వారి స్నేహితులతో ఆ ట్యుటోరియల్‌లలో కొన్నింటిని అభ్యసించమని వారిని ప్రోత్సహించండి. ఆన్‌లైన్ ప్రపంచం నుండి ప్రేరణతో వినోదభరితమైన, ఆఫ్‌లైన్ కార్యకలాపాన్ని ప్రోత్సహించడం ద్వారా సమతుల్యతను కనుగొనడంలో మరియు వారి స్వీయ-వ్యక్తీకరణకు మద్దతునివ్వడంలో వారికి సహాయపడండి.

వారి జీవితాలపై ఆసక్తిని కొనసాగించడం ద్వారా, మొత్తంమీద స్క్రీన్ సమయాన్ని తగ్గించి, మీరు ఆ ఆఫ్‌లైన్ ఆసక్తులను అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడవచ్చు.

ఆలోచనలు కావాలా? సమతుల్యతను పాటించేందుకు యుక్తవయస్సులోని మీ పిల్లలకు సహాయపడే కొన్ని కార్యకలాపాలు ఇక్కడ ఉన్నాయి:

Meta డిజిటల్ విధానానికి మారండి: యువత కోసం సంక్షేమ కార్యకలాపాలు

సామాజిక మాధ్యమంలో సమతుల్యతను కనుగొనడం

యాప్‌లో సానుకూల అనుభవాలను సృష్టించేందుకు తల్లిదండ్రులు మరియు యుక్తవయస్సులోని పిల్లలను అనుమతించే టూల్‌లు Instagramలో ఉన్నాయి. ఉదాహరణకు, Instagramలో సమయాన్ని ఉత్తమంగా గడిపే విషయం గురించి మాట్లాడుకున్న విధంగానే, యాప్‌లో రోజువారీ పరిమితులు సెట్ చేసుకోవడం లేదా నిద్ర మోడ్‌ను ప్రారంభించడం వంటి సమతుల్యాన్ని కనుగొనడంలో మీకు సహాయపడే టూల్‌ల గురించి కూడా మీరు మరియు యుక్తవయస్సులోని మీ పిల్లలు మాట్లాడుకోండి.

మీరు ఈ టూల్‌లను ఇక్కడ కనుగొనవచ్చు:

Instagram - రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయడం

Instagram - నిద్ర మోడ్‌ను ప్రారంభించడం

యుక్తవయస్సులోని పిల్లల కోసం, సామాజిక మాధ్యమంతో వారి ప్రారంభ అనుభవాల ద్వారా మీరు వారికి మార్గదర్శకం చేసేందుకు సహాయపడవచ్చు. Instagramలో సానుకూల మరియు సమతుల్య అనుభవాలను పెంపొందించడానికి, అందుబాటులో ఉన్న అనేక పర్యవేక్షణ టూల్‌లను ఉపయోగించుకోండి. యుక్తవయస్సులోని మీ పిల్లలతో మీరు చేసే సంభాషణలో, Instagramలో గడిపే సమయం నాణ్యత మరియు పరిమాణం మధ్య సమతుల్యతను కనుగొనడం అనేది ఎలా ముఖ్యమైన విషయం అనే దాని గురించి మాట్లాడండి. మంచి సమతుల్యతను అంగీకరించండి మరియు పర్యవేక్షణ టూల్‌లను ఉమ్మడిగా సెటప్ చేయండి.

Instagram పర్యవేక్షణ టూల్‌లు యుక్తవయస్సులోని మీ పిల్లల ఫాలోవర్‌లు మరియు ఫాలో అవుతున్న జాబితాను వీక్షించడం, యాప్ కోసం రోజువారీ సమయ పరిమితులు సెట్ చేయడం మరియు వారి యాప్ వినియోగం గురించి అంతర్దృష్టులు చూడడం వంటి వాటిలో మీకు సహాయపడవచ్చు.

Instagram - పర్యవేక్షణ టూల్‌లు

సమతుల్యతను కనుగొనడంలో మీ యుక్తవయస్సులోని పిల్లలకు సహాయంగా Meta ఉత్పత్తులు మరియు వనరులపై మరింత సమాచారాన్ని తెలుసుకోండి:

Facebook - సమయ పరిమితులు సెట్ చేయండి

మీ స్థానానికి నిర్దిష్టమైన కంటెంట్‌ను చూడడానికి మరొక దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా?
మార్చండి