యుక్తవయస్సులోని పిల్లల పెంపకం అనేది ఎప్పుడూ సులభమైనది కాదు. యుక్తవయస్సులోని పిల్లలు రోజురోజుకీ తమ స్వతంత్రతను కనుగొంటూ, సరిహద్దులను చెరిపివేస్తూ, ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయంపాటు గడుపుతూ, తల్లిదండ్రులు చెప్పే మాటలను పూర్తిగా పట్టించుకోకుండా మారుతూ ఉన్నారు. (నిజాయితీగా చెప్పాలంటే, యుక్తవయస్సులో ఉన్నప్పుడు మనం కూడా అలాగే చేసాము) కానీ ఇప్పుడు ఉండేది వేరొక భిన్నమైన ప్రపంచం, కదా? ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని నావిగేట్ చేయడం లేదా సానుకూల డిజిటల్ అడుగుజాడలను రూపొందించడం లేదా మా వ్యక్తిగత డేటా ఎలా ఉపయోగించబడుతుంది అని అర్థం చేసుకోవడం వంటి మనం ఎప్పుడూ ఆలోచించని విషయాల గురించి యుక్తవయస్సులోని మన పిల్లలు తెలుసుకోవలసి ఉంది. వాళ్లు మన మాటలు వింటున్నారా, లేదా అని కూడా మనకు తెలియనప్పుడు ఈ సంక్లిష్ట సమస్యలను నావిగేట్ చేయడంలో మనం వారికి ఎలా సహాయం చేయాలి?
నిజాయితీగా చెప్పాలంటే, యుక్తవయస్సులోని మన పిల్లలు మనం చెప్పే వాటిని వినడం కంటే మనం చేసే వాటిని చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. యుక్తవయస్సులోని మీ పిల్లలు విమర్శనాత్మక ఆలోచనాపరులుగా, సమర్థవంతమైన సంభాషణకర్తలుగా మరియు బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగదారులుగా ఉండడం ఎలాగో మీరు నేర్పించాలనుకుంటే, మీరు అలా ఉంటూ వారికి చూపవలసి ఉంటుంది. వారు మీ సానుకూల ప్రవర్తనలను నేరుగా ఆచరణలో చూసి నేర్చుకోగలిగేలా, మీరు వాటిని ప్రదర్శించి, చూపవలసి ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో చేసే ఒక్కొక్క పని యుక్తవయస్సులోని మీ పిల్లలు చేసే పనిని ప్రభావితం చేస్తుంది - కాబట్టి బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా ఉండడం ఎలాగో వారికి ఎందుకు చూపించకూడదు? మీరు డిజిటల్ ప్రపంచంతో ఇంటరాక్ట్ చేసే విధానంలో మీడియా అక్షరాస్యత ప్రవర్తనలను ప్రదర్శించి, చూపడం ఎలా?
మీడియా అక్షరాస్యత ప్రవర్తనలను ప్రదర్శించి, చూపడానికి 5 చిట్కాలు ఇక్కడ ఉన్నాయి: