సామాజిక మాధ్యమం మరియు అసత్య సమాచారం
ఇంటర్నెట్‌లో చాలా సమాచారం ఉంది, ఏది నిజమైనది మరియు విశ్వసనీయమైనది, అలాగే ఏది కాదు అనేది తెలుసుకోవడానికి సమయం మరియు ప్రయత్నం అవసరం అవుతాయి. అందరి మాదిరిగా, ఆన్‌లైన్‌లో అసత్య సమాచారాన్ని గుర్తించడానికి యువతకు నైపుణ్యాలు అవసరం.
‘అసత్య సమాచారం’ అనే పదానికి ఒకే నిర్వచనం అంటూ ఏమీ లేదు. కానీ అది “తప్పుడు సమాచారం” వలె సాధారణంగా అర్థం చేసుకోబడుతుంది, ఇది ఎవరినైనా మోసం చేయాలనే ఉద్దేశంతో వ్యాప్తి చెందని ‘తప్పు సమాచారం’ నుండి భిన్నంగా ఉంటుంది.
సామాజిక మాధ్యమంలో, ఇది సంచలనాత్మక హెడ్‌లైన్‌గా లేదా తప్పు అభిప్రాయాన్ని సృష్టించడానికి విషయాలను సందర్భంతో సంబంధం లేకుండా తప్పుగా సూచించే అతిశయోక్త పోస్ట్ వలె కనిపించవచ్చు. స్పామర్‌లు దీన్ని క్లిక్‌లను పొందడానికి మరియు లాభాలను రాబట్టుకోవడానికి ఉపయోగిస్తారు, అలాగే విరోధులు దీన్ని ఎన్నికలు మరియు జాతి వైరుధ్యాలలో ఉపయోగించవచ్చు.
అసత్య సమాచారంపై పోరాటం అనేది విపరీతమైన భావనను కలిగించవచ్చు, కానీ దాని వ్యాప్తికి సంబంధించి పోరాడటానికి మనం చేయదగిన అంశాలు చాలా ఉన్నాయి.
Metaలో, అసత్య సమాచారాన్ని ఆపడానికి మేము అవలంబించే వ్యూహానికి మూడు భాగాలు ఉన్నాయి:
అసత్య సమాచార వ్యాప్తిని ఆపివేయడానికి మరియు పబ్లిక్ ప్రసంగాన్ని అణిచివేయకుండా సమాచారం తెలుసుకోవడంలో వ్యక్తులకు సహాయపడటానికి ఈ పద్ధతి రూపొందించబడింది.
తల్లిదండ్రులు మరియు యువత పాత్ర కూడా ఉంది. బ్రిడ్జ్‌వాటర్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన మ్యాక్స్‌వెల్ లైబ్రరీ ప్రముఖంగా తెలిపిన ఆలోచనల ఆధారంగా, సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో మీకు మరియు మీ యుక్తవయస్సు పిల్లలకు సహాయపడే మరికొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
చిట్కా #1: లోతుగా తెలుసుకోండి
హెడ్‌లైన్‌లు మరియు స్టోరీ సారాంశాలతోనే మనము మరింత ఎక్కువ సమాచారాన్ని పొందవచ్చు. మనము చూసే లేదా చదివే అంశాలకు సంబంధించి పూర్తి సందర్భాన్ని పొందడం కోసం పోస్ట్ లేదా అసలు మూలాధార మెటీరియల్‌కు లింక్‌ను దాటి పరిశీలించడం కూడా సహాయకరంగా ఉంటుంది.
చిట్కా #2: ఇంటర్నెట్‌ను ఉపయోగించండి
ఫ్యాక్ట్-చెకర్‌ల ద్వారా స్టోరీ ఇప్పటికే ఫ్లాగ్ చేయబడనట్లయితే, అది ఖచ్చితమైనదైతే తరచుగా త్వరిత శోధన దాన్ని తెలుపుతుంది. మంచి వార్తల మూలాధారాలు ఇతర చట్టబద్ధమైన వార్తల సైట్‌లకు కూడా లింక్ చేయబడతాయి.
చిట్కా #3: మీ నిర్ణయాన్ని ఉపయోగించండి
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నేను చదువుతున్న దాని చుట్టూ ఉన్న పరిధి ఎంతమేరకు న్యాయమైనది? రచయిత ఉద్దేశ్యం ఏమిటి? ఇది వార్తల స్టోరీయా లేదా అభిప్రాయమా? వాస్తవాన్ని నిర్ధారించడం కోసం ఒకే సూత్రం అంటూ ఏమీ లేదు, కానీ కొన్నిసార్లు దీనికి మరికొంత ప్రయత్నం మాత్రమే అవసరం అవుతుంది.
చిట్కా #4: పరిశోధన సూక్తులు
సూక్తులు ఎన్నడూ చెప్పని వ్యక్తులకు ఆపాదించబడుతూ, అనేక సూక్తులు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దేని విషయంలో అయినా సరే, షేర్ చేయడానికి ముందు కొద్దిపాటి పరిశోధన చాలా సహాయకరంగా ఉంటుంది.
చిట్కా #5: స్కామ్‌తో కూడిన యాడ్‌లు లేదా ఇతర “క్లిక్‌బెయిట్” కోసం చూడండి
అసత్య సమాచారాన్ని అందించే కొందరు వారి వెబ్‌సైట్‌ను మీరు క్లిక్ చేసేలా చేయడానికి అలా చేస్తారు, ఇక్కడ మీకు అడ్వర్టయిజ్ చేయడం ద్వారా వారు ప్రయోజనం పొందుతారు. తక్కువ-నాణ్యత కలిగిన మరియు స్కామ్‌తో కూడిన యాడ్‌లు అనేవి మీరు విశ్వసించదగిన స్థాయి లేకపోవచ్చనే దానికి సంకేతం.
చిట్కా #6: సంచలనాత్మకమైన కంటెంట్ కోసం చూడండి
పేలవమైన వ్యాకరణం, ఆశ్చర్యాత్మక చిహ్నాలను అత్యధికంగా ఉపయోగించి ఉండటం, అన్ని క్యాపిటల్ అక్షరాలలో పదబంధాలు మరియు మీ భావోద్వేగాలకు కఠిన అప్పీల్‌ల పట్ల జాగ్రత్త వహించండి. చాలావరకు అసత్య సమాచారం అనేది ప్రతిస్పందనను పొందడానికి మాత్రమే రూపొందించబడింది, సమాచారం అందించడానికి కాదు.
చిట్కా #7: అన్నింటికంటే, విమర్శనాత్మకంగా చదవండి
ఏదైనా షేర్ చేయడానికి ముందు, వేగం తగ్గించి, సంచలనాత్మకమైన హెడ్‌లైన్ మాత్రమే కాకుండా మొత్తం స్టోరీని విమర్శనాత్మకంగా చదవడం అనేది ముఖ్యమైనది.
ఆన్‌లైన్ కంటెంట్‌కు మెరుగైన పాఠకులుగా ఉండటంలో యుక్తవయస్సు పిల్లలకు సహాయం చేయడం గురించి మనం చర్చించినట్లుగా, ఈ ప్రశ్నలను ఉపయోగించడం అనేది విశ్వసించదగిన మూలాధారాలను గుర్తించడానికి ఉన్న ఒక మార్గం: ఎవరు? ఏమిటి? ఎక్కడ? ఎందుకు? ఎప్పుడు?
విశ్వసించదగిన మూలాధారాలను గుర్తించడం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, క్రింది చిట్కాలను చూడండి:
అసత్య సమాచారాన్ని పోస్ట్ చేసేవారు ప్రత్యేకించి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు అయినప్పుడు వారితో సంభాషణను నావిగేట్ చేయడం అనేది కఠినమైన విషయం కావచ్చు. ఈ సందర్భాలు అనేవి చర్చను ప్రారంభించడానికి మరియు విశ్వసించదగిన మూలాధారాల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని షేర్ చేయడానికి అవకాశాలుగా ఉంటాయి.
అసత్య సమాచారంపై ఇంటరాక్షన్‌లను నావిగేట్ చేస్తున్నప్పుడు మీ యుక్తవయస్సు పిల్లలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
సాధారణంగా అసత్య సమాచారం ఇతరులను ఒప్పించడానికి మానసిక అప్పీల్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ రకమైన కంటెంట్‌ను షేర్ చేసే ఎవరితోనైనా మాట్లాడటం అనేది కఠినం కావచ్చు మరియు అధిక స్థాయిలో భావోద్వేగంగా ఉండవచ్చు. ఆ భావోద్వేగాల పట్ల జాగ్రత్త వహించడం మరియు ఇతరుల యొక్క భావనలపై సానుభూతి చూపడం అనేవి ఏదైనా ఇంటరాక్షన్‌కు సందర్భాన్ని అందించడంలో సహాయపడతాయి.
పబ్లిక్‌లో జరిగే అపార్థాలను ప్రైవేట్ సంభాషణలు నివారించవచ్చు. విశ్వసించదగిన మూలాధారాల నుండి తాజా వార్తలను సూచిస్తున్నప్పుడు స్వరాన్ని మర్యాదపూర్వకంగా మరియు సంఘటితంగా ఉంచండి.
మా సాంకేతికతలు అంతటా అసత్య సమాచార వ్యాప్తిని Meta ఎలా తగ్గిస్తోందనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.