సామాజిక మాధ్యమానికి సంబంధించిన పిల్లల సంరక్షణ చిట్కాలు

నేటి యుక్తవయస్సు పిల్లలు ఎల్లప్పుడూ ఇంటర్నెట్ అందుబాటులో ఉండే ప్రపంచంలో పెరుగుతున్నారు. అలాగే యువత తమ గుర్తింపు మరియు ఆసక్తులను అన్వేషించడానికి, తమ భావాలను వ్యక్తపరచడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించగలిగే అద్భుతమైన మార్గాలను కలిగి ఉన్నప్పటికీ, వారు బెదిరింపు మరియు వేధింపుల వంటి ప్రతికూల అనుభవాలను కూడా ఎదుర్కోవచ్చు.

అందుకే మీ యుక్తవయస్సు పిల్లలతో బహిరంగంగా కమ్యూనికేషన్‌ను కొనసాగించడం చాలా ముఖ్యం. వారు సామాజిక మాధ్యమానికి కొత్తవారైనా కాకపోయినా, ఈ సమస్యల గురించి ముందుగానే మరియు తరచుగా వారితో మాట్లాడటం చాలా ముఖ్యం.

మీరు మొదటిసారిగా సంభాషణను ప్రారంభిస్తున్నా లేదా కీలక అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నా, సామాజిక మాధ్యమంలో సురక్షత, శ్రేయస్సు మరియు మానసిక ఆరోగ్యం గురించి మీ యుక్తవయస్సు పిల్లలతో మాట్లాడటానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

చిట్కా #1: మీ యుక్తవయస్సు పిల్లలు సామాజిక మాధ్యమాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి

మీ యుక్తవయస్సు పిల్లలచే ఆన్‌లైన్ ప్రపంచంలోకి మొదటి అడుగు వేయించడానికి మీరు సిద్ధమవుతూ ఉండవచ్చు లేదా మీ యుక్తవయస్సు పిల్లలు కొంత కాలంగా ఆన్‌లైన్‌లో ఉండడంతో పాటు వారికి ఇష్టమైన యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఆన్‌లైన్ కార్యకలాపాలు ఎంపిక చేసుకొని ఉండవచ్చు. మీ యుక్తవయస్సు పిల్లలతో మాట్లాడటానికి సమయాన్ని వెచ్చించి, వారు సామాజిక మాధ్యమంలో చూసి ఆనందించే వాటితో పాటు నిరాశ లేదా ఆందోళన వంటి ప్రతికూల భావాలను రేకెత్తించే అవకాశం ఉన్న వాటి గురించి తెలుసుకోండి. వారు ఆన్‌లైన్ ప్రపంచాన్ని నావిగేట్ చేస్తున్నప్పుడు వారికి మార్గనిర్దేశం చేయడంలో మీరు ముఖ్యపాత్ర పోషించగలరు.

చిట్కా #2: మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సరిపోయే సామాజిక మాధ్యమ తల్లిదండ్రుల చిట్కాల శైలిని కనుగొనండి

మీ కుటుంబ సభ్యులకు ఏది సరిపోతుందనే విషయం అందరికంటే మీకు బాగా తెలుసు. కాబట్టి పరికరాలు మరియు యాప్‌ల కోసం నియమాలను సెట్ చేయడానికి, కొత్త ఆసక్తులను కనుగొనడంలో, అలాగే ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కార్యకలాపాల మధ్య సమతుల్యతను కనుగొనడంలో వారికి సహాయపడటానికి మీరు ఉత్తమ వ్యక్తి.

ఒక్కొక్క కుటుంబం ఒక్కో విధంగా ఉంటుంది. మీ పిల్లల పెంపకం శైలి అంటే మీరు మరియు మీ యుక్తవయస్సు పిల్లలు చేసుకునే ఒక మౌఖిక ఒప్పందం, తల్లిదండ్రులు మరియు యుక్తవయస్సు పిల్లలు ఇద్దరూ కలిసి సంతకం చేసే వ్రాతపూర్వక ఒప్పందం లేదా పర్యవేక్షణ టూల్‌లను కూడా కలిగి ఉంటుంది అని అర్థం. మీ యుక్తవయస్సు పిల్లలతో సంభాషణ జరపండి, ఆపై సానుకూల మార్గంలో ఆన్‌లైన్ ప్రపంచంతో ఎంగేజ్ కావడంలో వారికి సహాయపడే ఉత్తమమైన మార్గాన్ని కలిసి కనుగొనండి.

చిట్కా #3: కలిసి గోప్యతా సెట్టింగ్‌లను విశ్లేషించండి

పరికరాలు మరియు యాప్‌లు అనేక గోప్యతా టూల్‌లు మరియు సెట్టింగ్‌లను అందిస్తాయి. ఈ సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోవడం మరియు వాటి గురించి మీ యుక్తవయస్సు పిల్లలతో చర్చించడం అనేది ఎప్పుడూ మంచి పద్ధతి. వారి సెట్టింగ్‌లపై మీరు మరియు వారు ఎంత ఎక్కువ నియంత్రణ మరియు అవగాహనను కలిగి ఉంటే, సమగ్ర అనుభవం అంత మెరుగ్గా ఉంటుంది.

శక్తివంతమైన మరియు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోవడంలో మీ యుక్తవయస్సు పిల్లలకు సహాయపడండి. పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ ప్రొఫైల్ యొక్క లాభనష్టాల గురించి వారితో చర్చించండి. సమయ పరిమితులను సెట్ చేయడం మరియు మొత్తమ్మీద వారి సమయాన్ని సమతుల్యం చేయడం ఎలాగో కనుగొనడం గురించి తెలుసుకోండి.

చిట్కా #4: కంటెంట్‌ను ఎప్పుడు రిపోర్ట్ చేయాలి మరియు వినియోగదారులను ఎప్పుడు అన్‌ఫాలో చేయాలి లేదా బ్లాక్ చేయాలి వంటివి చర్చించండి

మీ యుక్తవయస్సు పిల్లలు ఆన్‌లైన్‌లో ఉండకూడని కంటెంట్ లేదా ప్రవర్తనను ఎదుర్కోవడం ఎప్పుడైనా జరిగినట్లయితే, వారి ఆన్‌లైన్ అనుభవాలను సురక్షితంగా మరియు సానుకూలంగా ఉంచుకోవడంలో సహాయపడగల టూల్‌లను ఉపయోగించే విధానం వారికి తెలుసని నిర్ధారించుకోండి.

Instagramలో, యుక్తవయస్సు పిల్లలు ఖాతాలను బ్లాక్ చేయడం లేదా అన్‌ఫాలో చేయడం ద్వారా తమ అనుభవాన్ని నియంత్రించగలరు. యాప్ కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు సేవా నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్‌ను సమీక్ష కోసం ప్రపంచవ్యాప్త బృందాలకు రిపోర్ట్‌లను పంపి, వీలైనంత త్వరగా దానిని తీసివేసే విధంగా పని చేసే అంతర్నిర్మిత రిపోర్టింగ్ ఫీచర్‌లను కూడా Instagram కలిగి ఉంది.

యుక్తవయస్సు పిల్లలు తమను వేధిస్తున్న వారిని గమనిస్తూనే తమ ఖాతాను నిశబ్ధంగా రక్షించుకోగల సాధికారతను వారికి కల్పించేలా రూపొందించబడిన Instagramలోని పరిమితం ఫీచర్‌ను కూడా వారు ఉపయోగించవచ్చు. పరిమితం ఫీచర్ ప్రారంభించబడిన తర్వాత, వారు పరిమితం చేసిన వ్యక్తి నుండి వారి పోస్ట్‌లపై వచ్చే కామెంట్‌లు ఆ వ్యక్తికి మాత్రమే కనిపిస్తాయి. మీ యుక్తవయస్సు పిల్లలు నియంత్రించిన వ్యక్తి కామెంట్ చేసినట్లు నోటిఫికేషన్‌లు వారికి కనిపించవు.

Instagramలో కంటెంట్‌ను రిపోర్ట్ చేయడం గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

చిట్కా #5: Instagramలో పర్యవేక్షణను సెటప్ చేయండి

వారి ఆన్‌లైన్ అలవాట్ల గురించి మీరు మీ యుక్తవయస్సు పిల్లలతో మాట్లాడిన తర్వాత, Instagramని నావిగేట్ చేయడంలో వారికి సహాయపడటానికి కలిసి ప్రణాళికను రూపొందించండి.

మీరిద్దరూ కలిసి అంగీకారానికి వచ్చిన దాని ఆధారంగా, Instagramలో తల్లిదండ్రుల పర్యవేక్షణ టూల్‌లను సెటప్ చేయడానికి వారితో కలిసి పని చేయండి. వారి ఫాలోవర్‌లు మరియు వారు ఫాలో చేసేవారి జాబితాలను చూడటానికి, రోజువారీ సమయ పరిమితులను సెట్ చేయడానికి మరియు వారు యాప్‌లో ఎంత సమయాన్ని గడుపుతున్నారో చూడటానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. అలాగే మీ యుక్తవయస్సు పిల్లలు Instagramలో పోస్ట్ లేదా మరొక ఖాతా వంటి ఏదైనా కంటెంట్‌ను రిపోర్ట్ చేసినట్లు వారు షేర్ చేసినప్పుడు, మీరు వాటిని చూడగలరు.

చిట్కా #6: గోప్యతా తనిఖీలు గోప్యతా తనిఖీలు

గోప్యతా తనిఖీలు అనగా Facebookలో మీ యొక్క మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క గోప్యతా ప్రాధాన్యతలను సమీక్షించగల Meta హబ్. మీరు పోస్ట్ చేసే వాటిని ఎవరు చూడగలరు, సమాచారానికి ఏయే యాప్‌లు యాక్సెస్లి కలిగి ఉన్నాయి, స్నేహ అభ్యర్థనలను ఎవరు పంపగలరు మరియు మరిన్నింటిని పరిమితం చేయడం వంటి మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మీరు టూల్‌ని సర్దుబాటు చేయవచ్చు. శక్తివంతమైన పాస్‌వర్డ్ మరియు రెండు దశల అథెంటికేష‌న్‌ను ఉపయోగించడం ఎంత ముఖ్యమో గోప్యతా సెట్టింగ్‌లపై ట్యాబ్‌లను ఉంచడం కూడా ఎల్లప్పుడూ మంచి ఆలోచన.

Facebook భద్రతా తనిఖీ వంటి టూల్‌లను ఉపయోగించి మీ యుక్తవయస్సు పిల్లల సామాజిక ఖాతాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా ముఖ్యం. పాస్‌వర్డ్‌లను మళ్లీ ఉపయోగించకుండా ఉండటం మరియు రెండు దశల అథెంటికేషన్‌ను ఉపయోగించడం వంటి మంచి భద్రతా పద్ధతులను కొనసాగించడానికి ఇది అదనంగా ఉంటుంది.

చిట్కా #7: పరికరాలు మరియు యాప్‌లలో తల్లిదండ్రుల నియంత్రణలను ప్రారంభించండి

మీ యుక్తవయస్సు పిల్లల పరికరాన్ని నిర్వహించడంలో మీకు మరింత సహాయం అవసరమైనట్లయితే, Android మరియు iOS పరికరాలు రెండింట్లోనూ అందుబాటులో ఉన్న తల్లిదండ్రుల నియంత్రణలను తనిఖీ చేయండి. మీరు యాప్ డౌన్‌లోడ్‌లను బ్లాక్ చేయడానికి, కంటెంట్‌ని పరిమితం చేయడానికి లేదా పరికరం సమయ పరిమితులను సెట్ చేయడానికి ఎంపికలను కనుగొనవచ్చు. మీ చిన్నారి పరికర సెట్టింగ్‌లను తనిఖీ చేసి, అవి మీకు మరియు మీ యుక్తవయస్సు పిల్లలకు సరిపడే విధంగా సెట్ చేయబడినట్లు నిర్ధారించుకోండి.

మీ తల్లిదండ్రుల నియంత్రణ ఎంపికలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మీరు మీ యుక్తవయస్సు పిల్లల యాప్‌ల సెట్టింగ్‌లను కూడా అన్వేషించవచ్చు. ఉదాహరణకు, తల్లిదండ్రులు వారి యుక్తవయస్సు పిల్లల ఫాలోవర్ మరియు ఫాలోయింగ్ జాబితాలను చూడటానికి, అలాగే సమయ పరిమితులను సెట్ చేయడానికి వారిని అనుమతించే పర్యవేక్షణ టూల్‌లు Instagramలో ఉన్నాయి.

Instagram పర్యవేక్షణ టూల్‌ల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

చిట్కా #8: నిష్కపటంగా ఉంటూ విశ్వాసాన్ని ఏర్పరుచుకోండి

మీ యుక్తవయస్సు పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాన్ని గౌరవం మరియు స్పష్టతతో పర్యవేక్షించడమే ఉత్తమమైన మార్గం. యువకులలో కొంతమంది ఇతరులతో పోలిస్తే ఎక్కువగా మోసపోయే ప్రమాదం ఉండవచ్చు, కనుక వారిని తల్లిదండ్రులు మరింత ఎక్కువగా గమనించాల్సిన అవసరం ఉండవచ్చు.

మీరు మీ యుక్తవయస్సు పిల్లలను పర్యవేక్షిస్తున్నట్లయితే, దాని గురించి వారికి ముందుగానే తెలియజేయడం సహాయకరంగా ఉంటుంది. ఆ విధంగా, అందరూ ఒకే అభిప్రాయంపై ఉండటంతో పాటు వారి నమ్మకాన్ని ఉల్లంఘించినట్లుగా ఎవరూ భావించరు.


చిట్కా #9: హద్దులను సెట్ చేసి, అమలు చేయండి

మీ యుక్తవయస్సు పిల్లల స్క్రీన్ సమయం మరియు సామాజిక మాధ్యమం వినియోగంపై మీరు హద్దులను సెట్ చేస్తే, ఆ హద్దులను గురించి వారితో పర్యవేక్షించి, అమలు చేస్తున్నట్లు నిర్ధారించుకోండి. హద్దులను సెట్ చేయడం వల్ల యుక్తవయస్సు పిల్లలు ఏది సరైనది మరియు ఏది సరైనది కాదు అనే వాటి గురించి ఆలోచించేలా చేస్తుంది.

యుక్తవయస్సు పిల్లలు వారి స్నేహితులు మరియు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో వారి సంబంధాలను ఆన్‌లైన్‌లో ఉత్తమంగా నిర్వహించడం ఎలా అనే దాని గురించి ఆలోచించడంలో వారికి సహాయపడటానికి ఇది సహాయకరమైన వ్యాయామం.

చిట్కా #10: మంచి ఉదాహరణను సెట్ చేయండి

జీవితంలోని అన్ని అంశాలలో సంబంధాలను నావిగేట్ చేయడానికి యుక్తవయస్సు పిల్లలు తమ తల్లిదండ్రులను మోడల్‌గా భావిస్తారు. అది మనం సాంకేతికతను ఉపయోగించే విధానానికి కూడా వర్తిస్తుంది.

పరికరాలు మరియు సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించడంలో, అలాగే మీరు వారి కోసం సెట్ చేసిన మార్గదర్శకాలను అనుసరించడంలో మంచి ఉదాహరణను సెట్ చేయడంలో కూడా మీ యుక్తవయస్సు పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు మీ యుక్తవయస్సు పిల్లలు సామాజిక మాధ్యమాన్ని ఎప్పుడు ఉపయోగించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో ఉండవచ్చనే వాటిపై సమయ పరిమితులను సెట్ చేసినట్లయితే, అవే నియమాలను అనుసరించండి. వారు రాత్రి 10 గంటల తర్వాత సందేశం పంపడం కుదరకుంటే, ఆ ప్రవర్తనను మోడల్ చేయడం మరియు అదే పని చేయడం గురించి ఆలోచించండి.

సంబంధిత అంశాలు

మీ స్థానానికి నిర్దిష్టమైన కంటెంట్‌ను చూడడానికి మరొక దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా?
మార్చండి