యుక్తవయస్సులోని పిల్లల నిపుణులు డా. హీనా తాలిబ్ మరియు Metaలోని నికోల్ లోపెజ్‌ల ఫైర్‌సైడ్ చర్చ

ఈ సంభాషణ నిడివి మరియు స్పష్టత కోసం సవరించబడింది.

నికోల్:

శిశువైద్యులు మరియు కౌమార వైద్య నిపుణురాలు, రచయిత్రి, తల్లి అయిన డా. హీనా తాలిబ్, మా స్క్రీన్ స్మార్ట్ సిరీస్ సృష్టికర్త అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే, యుక్తవయస్సు పిల్లల తల్లిగా, నా పిల్లలతో కఠినమైన సంభాషణలను ఎలా మరియు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయాలకు సంబంధించిన చిట్కాల కోసం నేను డా. తాలిబ్‌పై ఎక్కువగా ఆధారపడతాను. ఆవిడ పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాలపై ఆచరణాత్మకమైన మరియు ఆలోచనాత్మకమైన మార్గదర్శకత్వాన్ని అందజేస్తారు. ఆవిడను Instagramలో @teenhealthdoc లోనూ అలాగే తన వెబ్‌సైట్‌లోనూ కనుగొనవచ్చు, కానీ తనను తాను పరిచయం చేసుకోవలసిందిగా నేను ఆమెను కోరబోతున్నాను.

డా. తాలిబ్:

Metaలో యువత భద్రతలో మీరు ప్రభావవంతమైన పాత్రను కలిగి ఉన్నారని నాకు తెలుసు కాబట్టి యువత మరియు సామాజిక మాధ్యమం గురించి మీతో మాట్లాడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను! అవును, నేను NYCలోని ప్రైమరీ మరియు ప్రివెంటివ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ అయిన అట్రియాలో ప్రాక్టీస్ చేస్తున్న కౌమార వైద్య నిపుణురాలిని. నేను అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌కి ప్రతినిధిగా వ్యవహరించడంతో పాటు వారి కౌన్సిల్ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియాలో ఉద్యోగం చేస్తున్నాను. నేను కలిగి ఉన్న పీడియాట్రిక్ సబ్‌స్పెషాలిటీ గురించి అలాగే కౌమార దశలోని పిల్లలకు నేను అందించే వైద్య సలహాలను గురించి చాలా మంది వ్యక్తులకు పూర్తిగా తెలిసి ఉండదు. యుక్తవయస్సు పిల్లలు మరియు వారి కుటుంబాలను చూసుకోవడం నా జీవిత అభిరుచి అలాగే నా ప్రత్యేకత నాకు మానసిక ఆరోగ్యం, గైనకాలజీ, డెర్మటాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు డిజిటల్ శ్రేయస్సు వంటి విభాగాలలో అదనపు శిక్షణను ఇచ్చింది.

నికోల్:

సామాజిక మాధ్యమం లేదా స్క్రీన్ టైమ్ గురించి యుక్తవయస్సులోని తమ పిల్లల‌తో సంభాషణను ప్రారంభించడం ఎలాగో తెలియని తల్లిదండ్రులకు మీరు ఏమి చెప్తారు? వారు తమ కుటుంబ సభ్యులతో బహిరంగ, సహాయక సంభాషణను ఎలా ప్రోత్సహించగలరు?

డా. తాలిబ్:

ఈ సంభాషణను నిజమైన ఉత్సుకత మరియు పక్షపాతం లేని విధంగా ప్రారంభించడం అత్యంత విజయవంతమైన విషయం అని నేను గుర్తించాను. ఈ ముఖ్యమైన సంభాషణలను కలిగి ఉండడానికి ఇక్కడ మూడు చిట్కాలు ఉన్నాయి. ముందుగా, ఆసక్తి కలిగి ఉంటూ, వారు తమ సాంకేతికతను ఎలా ఉపయోగిస్తున్నారు, వారు ఏ విధమైన యాప్‌లు లేదా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు, వారికి ఇష్టమైన ఫాలోయింగ్‌లు ఎవరు మరియు ఎందుకు అనే విషయాలతో పాటు వారు ఏయే గేమ్‌లను ఎందుకు ఎక్కువగా ఆస్వాదించవచ్చు అనే విషయాలకు సంబంధించిన వారి దినచర్యను గురించి వారిని అడగండి. మీరు వారి ఖాతాలను వారితో కలిసి చూడటం అలాగే వారితో కలిసి వారికి ఇష్టమైన గేమ్‌లు ఆడటం వంటి వాటి కోసం మీరు కలిసి కొంత సమయం గడపగలిగితే, అది బోనస్. రెండవది, వారిని స్టాక్ తీసుకునే వ్యక్తిగా ఉండనివ్వండి. "మీ సామాజిక మాధ్యమం లేదా ఫోన్ వినియోగంతో మీరు ఎంత మేరకు సంతృప్తి చెందారు?" అని వారిని అడగండి. నా ప్రాక్టీస్‌లో భాగంగా యుక్తవయస్సు పిల్లలను చూసినప్పుడు నేను మొదటగా చేసేది అదే. మీడియాలోని ఏ భాగాలను ఉపయోగించడంలో వారికి మంచి అనుభూతిని కలిగించడంతో పాటు కనెక్ట్ అయినట్లుగా మరియు ఉత్పాదకతను అందించే విధంగా అనిపిస్తాయి అనే విషయంతో పాటు ఏయే భాగాలు వేరే విధమైన అనుభూతిని అందజేస్తాయి అని నేను వారిని అడుగుతాను.

అలాగే మూడవది, వారి స్నేహితుల గురించి అలాగే వారి స్నేహితులు సామాజిక మాధ్యమాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అని అడిగేందుకు ప్రయత్నించండి. టీ తాగుతూ కాస్త సమయం గడపండి! మీ కంటే స్నేహితుల గురించి మాట్లాడటం చాలా సులభంగా ఉంటుంది అలాగే అదే పంథాలో, దుర్బలంగా ఉండడంతో పాటు మీరు సామాజిక మాధ్యమంలోని ఒడిదుడుకులను ఎలా ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని యుక్తవయస్సులోని మీ పిల్లలకు షేర్ చేయండి. మీరు మాట్లాడడాన్ని సామాజిక మాధ్యమం గురించిన చర్చతో ప్రారంభించకపోవడం అనేది సామాజిక మాధ్యమం గురించి మాట్లాడటానికి మరొక దొడ్డిదారి. బదులుగా, వారి మానసిక ఆరోగ్యం, పాఠశాల, క్రీడలు, నిద్ర, తలనొప్పులు లేదా వారి జీవితంలోని ఇతర అంశాలతో పాటు సామాజిక మాధ్యమం వారికి ఎలా సహాయం చేస్తోంది లేదా సవాలు చేస్తోంది అనే విషయాలను గురించి అడగండి. ఈ రకమైన సంభాషణలను ప్రారంభించడానికి అవసరమైన వనరులను Meta తన‌ ఫ్యామిలీ సెంటర్ లో కలిగి ఉంది.

నికోల్:

మీరు చూసిన యుక్తవయస్సు పిల్లలపై Instagram ఎలాంటి సానుకూల ప్రభావాలను చూపుతుంది? తల్లిదండ్రులు యుక్తవయస్సులోని తమ పిల్లలకు మంచి అనుభూతిని కలిగించే కంటెంట్‌ను కనుగొనడంలో వారికి సహాయపడే మార్గాలు ఉన్నాయా?

డా. తాలిబ్:

కమ్యూనిటీని కనుగొనడానికి, స్నేహితులతో కనెక్ట్ కావడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అలాగే మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి Instagram మరియు ఇతర సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫారమ్‌లు ఉత్తమమైనవిగా ఉంటాయి. యుక్తవయస్సు పిల్లలలోని చాలా మంది అందులోనూ ముఖ్యంగా చారిత్రాత్మకంగా అట్టడుగు స్థాయి కమ్యూనిటీలకు చెందిన యువత ఆన్‌లైన్‌లో “నాకు చెందిన వ్యక్తులను కనుగొంటున్న”ట్లు నాకు తెలియజేసారు. LGBTQIA+గా గుర్తించబడే యుక్తవయస్సు పిల్లలు సామాజిక మాధ్యమం ద్వారా మద్దతు, విద్య మరియు వనరులు వంటి వాటిని ఎలా కనుగొన్నారో నాతో షేర్ చేసుకున్నారు. ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాల కాలంలో, యుక్తవయస్సు పిల్లలు ప్లాట్‌ఫారమ్‌లు మరియు వారు ఫాలో అయ్యే వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో నేర్చుకున్న మానసిక ఆరోగ్య టూల్‌లు లేదా నిర్వహణ నైపుణ్యాల గురించి మరియు కొన్ని ఆరోగ్య చిట్కాల గురించి కూడా మాట్లాడతారు! చివరగా, న్యాయవాదం అనేది యుక్తవయస్సు పిల్లలు కూడా సామాజిక మాధ్యమాన్ని ఆలోచనలను షేర్ చేసుకోవడానికి ఒక ప్రదేశంగా సూచించే ప్రాంతంగా కనిపిస్తోంది అలాగే వారికి తగినట్లుగా వారి ప్రపంచంలో మార్పులు చేయాలనే వారి ఆశ నాకు చాలా ఇష్టం.

తల్లిదండ్రుల విషయానికి వస్తే, ప్లాట్‌ఫారమ్‌లు అందించే టూల్‌లు అన్నీ సానుకూలమైన అనుభవాలు కావు కాబట్టి యుక్తవయస్సులోని తమ పిల్లలకు సానుకూలమైన అనుభవాన్ని అందించడానికి, వారు వాటిని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, తల్లిదండ్రులు యుక్తవయస్సులోని తమ పిల్లలకు కంటెంట్ సిఫార్సు సెట్టింగ్‌లు, సమయ నిర్వహణ సెట్టింగ్‌లు మరియు తల్లిదండ్రుల పర్యవేక్షణ వంటి వాటిని సెటప్ చేయడంలో వారికి సహాయపడగలరు.

నికోల్:

తల్లిదండ్రులలో చాలా మంది యుక్తవయస్సులోని తమ పిల్లలతో సానుకూలమైన ఆన్‌లైన్ అలవాట్లకు సంబంధించిన సంభాషణను ప్రారంభించడానికి వారి పిల్లల 13వ పుట్టినరోజు వరకు వేచి ఉండడం లేదు. తమ పిల్లలు సామాజిక మాధ్యమానికి అర్హత పొందడానికి ముందే వారిని సామాజిక మాధ్యమంలో చేర్చేందుకు సిద్ధం అవుతున్న తల్లిదండ్రులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు?

డా. తాలిబ్:

నా అనుభవం ప్రకారం, సామాజిక మాధ్యమంలో చేరవలసినదిగా నేను యుక్తవయస్సులోని పిల్లలకు ఆటోమేటిక్‌గా సూచించే వయస్సు ఏదీ లేదు, అయితే అన్ని ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన కాపలాదారుగా వ్యవహరించే కనీస వయస్సుకి సంబంధించిన సేవా నిబంధనలను కలిగి ఉంటాయి. అదేవిధంగా, సామాజిక మాధ్యమం అనేది ఒక శిలాస్తంభము కాదు, ఇది ఒక విషయం కాదు అలాగే ఇది కేవలం Instagram, Facebook మరియు TikTok కాదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న అనేక అంశాలు ఉన్న కారణంగా నేను నా ముందుకు వచ్చే యుక్తవయస్సులోని ఒక్కొక్కరిని వేర్వేరుగా పరిశీలిస్తాను. మరీ ముఖ్యంగా, సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించడానికి సంబంధించిన ప్రారంభ వయస్సు విషయంలో కుటుంబ సభ్యులు నన్ను సలహా అడిగినప్పుడు, యుక్తవయస్సులోని వారి పిల్ల‌లకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే సమయం మరియు లభ్యతను పరిగణనలోకి తీసుకోవలసిందిగా తల్లిదండ్రులను కూడా పరిగణనలోకి తీసుకుంటాను లేదా కోరుతూ ఉంటాను.

నేను డైరెక్ట్ మెసేజింగ్ లేదా iMessage వంటివి సామాజిక మాధ్యమం మాదిరిగానే కొన్నింటిని కలిగి ఉండవచ్చునని నేను తెలియజేసినప్పుడు చిన్నారుల తల్లిదండ్రులు తరచుగా ఆశ్చర్యపోతారు. Youtube Kids మరియు iPad లేదా Minecraft మరియు Roblox వంటి టాబ్లెట్ గేమ్‌లు కూడా సామాజిక మాధ్యమంలో భాగమే. కాబట్టి ఈ సంభాషణలు ప్రాథమిక పాఠశాల పిల్లల తల్లిదండ్రుల మధ్య ప్రారంభం కావలసి ఉండడంతో పాటు నేను దిగువ ప్రాథమిక తరగతుల పాఠశాలలో చదివే ఇద్దరు పిల్లలను కలిగి ఉన్న కారణంగా ప్రస్తుతం నేను దీనిని కొనసాగిస్తున్నాను. మనం ఈ సంభాషణలను ముందుగానే ప్రారంభించడం కూడా చాలా ముఖ్యం, తద్వారా మన పిల్లలకు మద్దతు అవసరమైనప్పుడు వారు మన వద్దకు రావడం వారికి సౌకర్యంగా ఉంటుంది. చివరగా, ఈ సంభాషణలు మన కుటుంబాలలో జరగవలసి ఉంటుంది, కానీ మీ తరగతి గదిలో లేదా గ్రేడ్‌లోని పిల్లల తల్లిదండ్రులతో మరియు ఉపాధ్యాయులతో కూడా జరగాలి. పిల్లలు నివసిస్తున్న మొత్తం కమ్యూనిటీలలోనూ మనం ఇలాంటి సంభాషణలను కలిగి ఉండవలసి ఉంటుంది. పరికరాలు మరియు సామాజిక మాధ్యమం విషయానికి వస్తే కుటుంబ సభ్యులు వేర్వేరు విలువలను కలిగి ఉన్న కారణంగా తల్లిదండ్రులు షేర్ చేసే వాటిలో ఒక కష్టమైన భాగం ఇది.

నికోల్:

నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను మరియు ఇలాంటి విషయాల గురించి మీ యుక్తవయస్సులోని మీ పిల్లలతో ఎలా మాట్లాడాలి అనే దాని కోసం మా ఫ్యామిలీ సెంటర్‌లో విద్యా వనరులు కూడా ఉన్నాయి అని జోడిస్తాను-ఉదాహరణకు, స్వీయ-అవగాహన మరియు భావోద్వేగ నియంత్రణపై ParentZoneలో ఒక గొప్ప కథనం ఉంది. సామాజిక మాధ్యమంతో సానుకూలంగా ఎలా పాల్గొనాలి అనే విషయాన్ని యుక్తవయస్సు పిల్లలకు చెప్పేటప్పుడు మీరు ఏ నిర్దిష్ట సూత్రాల గురించి ఆలోచిస్తారు? మరియు/లేదా, దాని గురించి వారి తల్లిదండ్రులతో మాట్లాడటం గురించి వారు ఎలా ఆలోచించాలి?

డా. తాలిబ్:

పాటించవలసిన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. ముందుగా, మీరు మీ ఫోన్‌ని ఎందుకు తీసుకుంటున్నారో ఒక ఉద్దేశ్యాన్ని సెట్ చేయడానికి లేదా బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నించండి. అంటే మీరు 10 నిమిషాల పాటు ధ్యాస మరల్చుకోవడం కావచ్చు, మీరు 3 స్నేహితులకు సందేశం పంపాలనుకోవడం కావచ్చు అలాగే మీరు కుకీ రెసిపీ గురించి మరింత తెలుసుకోవాలనుకోవడం కావచ్చు. బిగ్గరగా చెప్పడంలో ఒక శక్తి ఉంటుంది మరియు మీరు మీ ఫోన్‌ని కూడా కింద పెట్టేసిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించవచ్చు.

రెండవది, మీ భావాలను ఫాలో అవ్వండి. సామాజిక మాధ్యమంలో మీరు గడుపుతున్న సమయం మీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది లేదా మీరు ఇంటరాక్ట్ అవుతున్న వ్యక్తులు మీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తున్నారు అనే విషయాలపై శ్రద్ధ వహించండి. మీరు శక్తిని, స్పూర్తిని పొందినట్లుగా లేదా ప్రోత్సహించబడినట్లుగా లేదా అవమానించబడినట్లు, ఒంటరితనాన్ని అనుభవించినట్లు లేదా బాధపడినట్లు ఏమైనా జరిగాయేమో అని గమనించండి.

అలాగే మూడవది, మీరు నిజ జీవితంలో చేసినట్లుగానే ఆన్‌లైన్‌లోనూ ప్రవర్తించడం, మాట్లాడడం మరియు షేర్ చేయడం వంటివి చేయండి. ఏదైనా విషయాన్ని గురించి మీరు మీ తాత లేదా అవ్వగారికి చెప్పకున్నా లేదా అది వార్తల్లోకి రావాలని కోరుకోకున్నా, దానిని ఆన్‌లైన్‌లో చెప్పకండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లోని విషయాలు ఎక్కడికి వెళ్తాయి, ఎవరు చూస్తారు అలాగే వాటిని ఏ విధంగా అన్వయించుకుంటారు అనే విషయాలు మీకు ఎప్పటికీ తెలియదు. నిజ జీవితంలోనూ అలాగే ఆన్‌లైన్‌లోనూ మీ పట్ల మరియు ఇతరుల పట్ల దయతో ఉండండి.

నికోల్:

ఆన్‌లైన్‌లో జరిగిన ఏదైనా విషయాన్ని గురించి మీరు మీ రోగులతో ఎప్పుడైనా కఠినమైన సంభాషణలు జరిపారా? అది ఎలా అనిపిస్తుంది?

డా. తాలిబ్:

మానసికంగా లేదా నావిగేట్ చేయడానికి సవాలుగా ఉండేలా ఆన్‌లైన్‌లో ఏమి జరిగి ఉండవచ్చు అనే దానికి సంబంధించిన సంభాషణలు వాస్తవానికి అలవాట్లలో మార్పును ప్రేరేపించడానికి లేదా ఆన్‌లైన్‌లో వాటి ఉపయోగంతో సరిహద్దులను సెట్ చేయడానికి వారికి అనుమతిని ఇవ్వడానికి ఉత్తమ టూల్‌లుగా ఉంటాయి. యుక్తవయస్సులోని వ్యక్తులతో నా సంభాషణలలో దీనిని ఎలా చేయాలి అనే ఉత్తమ ఆలోచనలు వాటి నుండి వచ్చాయి. వారు తమను తాము బాగా తెలుసుకోవడంతో పాటు కొన్ని తప్పులను సరిదిద్దుకోవడానికి క్రియేటివ్ మార్గాలతో ముందుకు వస్తారు లేదా జీవితం లేదా ఆరోగ్యపరమైన ఏదైనా లక్ష్యంతో మరింత అలైన్ అయ్యేందుకు చేయడానికి వారి ఉపయోగం యొక్క శైలిని మార్చుకుంటారు.

యుక్తవయస్సు పిల్లలతో వారు ఎలాంటి వాటిని ఎదుర్కొంటున్నారు అనే వాటి కంటే వారి తోటివారు ఆన్‌లైన్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే వాటి గురించి మాట్లాడటం కూడా చాలా సులభం. అక్కడ ప్రారంభించి, కాస్త విరామం ఇవ్వండి. ఇది ఆకర్షణీయంగా ఉంటుంది, కొన్నిసార్లు హృదయ విదారకంగా ఉండడంతో పాటు దాని గురించి మాట్లాడటానికి వారికి ఒక అవుట్‌లెట్ అవసరం ఉంటుంది.

నికోల్:

మా చివరి ఆడియన్స్ ప్రశ్నలలో ఒకటిగా, “సామాజిక మాధ్యమం నన్ను వయోజనుడిగా పోల్చడానికి కారణం అవుతుంది, సామాజిక మాధ్యమంలోని పోలికల విషయంలో నేను నా పిల్లలకు ఏ విధంగా సహాయం చేయగలను?” డా. తాలిబ్, దీనికి సంబంధించిన ఏవైనా ఆలోచనలు ఉన్నాయా?

డా. తాలిబ్:

పోల్చడం అనేది ఆనందాన్ని దొంగిలించే ఒక దొంగ అని నేను నమ్ముతాను అని థియోడర్ రూజ్‌వెల్ట్ పేర్కొన్నారు. సామాజిక పోలిక ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే యుక్తవయస్సు పిల్లలు వారి జీవితంలోని అభివృద్ధి విషయంలో పెళుసుగా ఉండే దశలో ఉంటారు, ఈ దశలో వారు కామెంట్‌లను ఇతర దశల కంటే మరింత హృదయపూర్వకంగా తీసుకోవడంతో పాటు తమపై తాము కేంద్రీకరించుకుంటారు. కాబట్టి మనం వారికి ఎలా సహాయం చేయగలము, నిజ జీవితంలోనూ అలాగే ఆన్‌లైన్‌లోనూ వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి మనం చేయగలిగినదంతా మనం చేయవలసి ఉండడంతో పాటు వారికి ఆనందాన్ని కలిగించని వారి నుండి రక్షణ పొందడం, వారు గౌరవప్రదంగా మరియు విలువతో కూడిన అనుభూతిని పొందగలగడం నేర్పించవలసి ఉంటుంది. నిజంగా, ఇది మీకు ఒక ముఖ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యక్తి అనే భావనను పెంపొందించడం అనేది సామాజిక పోలికకు శక్తివంతమైన విరుగుడుగా పని చేస్తుంది. నెవర్ ఎనఫ్ రచయిత్రి జెన్నిఫర్ వాలెస్ దీని గురించి మాట్లాడడాన్ని నేను ఇటీవల విన్నాను అలాగే ఇది చాలా శక్తివంతంగా ఉండింది. చిన్న లేదా పెద్ద మార్గాలలో, మనమందరం యుక్తవయస్సులోని మన పిల్లలకు అలాగే మనం ఇంటరాక్ట్ చేసే యుక్తవయస్సు పిల్లలందరికీ వారికి ముఖ్యమైన వ్యక్తులనీ, వారికి నైపుణ్యాలు ఉన్నాయనీ, వారికి విలువ ఉందనీ మరియు వారు ఈ ప్రపంచానికి ఏదైనా చేసి చూపించగలరనే విశ్వాసాన్ని పెంపొందించాలి.

మీకు సానుకూల అనుభూతిని కలిగించే కంటెంట్‌తో ఇంటరాక్ట్ కావలసిందిగా నేను యుక్తవయస్సు పిల్లలను అడుగుతాను. డీఫ్రెండ్ డిసెంబర్ అనేది ఒక వాస్తవమైన విషయం, అలాగే మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తులను అన్‌ఫాలో చేయడం అనేది మంచి విషయమే. అదే విధంగా, నేను తరచుగా యుక్తవయస్సు పిల్లలకు లైక్‌లను ఆఫ్ చేయమని, వారు వేరొకరిపై ఇకపై శ్రద్ధ చూపకూడదు అని కోరుకుంటున్నట్లు అవతలి వ్యక్తికి తెలియకూడదని కోరుకుంటున్నట్లయితే, వారిని పరిమితం చేయమని సూచిస్తాను. చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వీటన్నింటి గురించి యుక్తవయస్సులోని మీ పిల్లలతో క్రమం తప్పకుండా తనిఖీ చేయడం.

నికోల్:

కాబట్టి మనం చాలా విషయాలను గురించి చర్చించాము, కానీ ఇవాల్టి సంభాషణ నుండి తల్లిదండ్రులు ఏమి తీసివేయవలసి ఉంటుంది?

డా. తాలిబ్:

సామాజిక మాధ్యమం అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తుంది, యుక్తవయస్సు పిల్లలు వివిధ వయస్సులలో అలాగే పరిపక్వత స్థాయిలలో వేర్వేరు అవసరాలను కలిగి ఉంటారు. యుక్తవయస్సులోని మన పిల్లలు తమ ఆన్‌లైన్ జీవితాలలో ఉత్తమంగా మార్గనిర్దేశం పొందడంలో వారికి సహాయపడటానికి మనం వారిని నిజంగా గమనించడం అలాగే వారు చెప్పే వాటిని జాగ్రత్తగా వినడం చేయవలసి ఉంటుంది. యుక్తవయస్సులోని మీ పిల్లలు సామాజిక మాధ్యమంలో సరైన అనుభవాన్ని ఎలా పొందగలరు అనే విషయంతో పాటు వారు ఎలా మోసగించబడవచ్చు అనే వాటి గురించి వారితో చర్చించండి. దుర్బలంగా ఉండండి అలాగే సామాజిక మాధ్యమంతో మీరు కలిగి ఉన్న సంబంధం కూడా యుక్తవయస్సులోని మీ పిల్లలకు ఒక నమూనాగా ఉంటుంది అని అర్థం చేసుకోండి... ఈ అంశం గురించి కనెక్ట్ కావడంలో ఇది చాలా వరకు సహాయపడుతుంది. Instagram వంటి అనేక యాప్‌లు తల్లిదండ్రుల టూల్‌లు మరియు డిఫాల్ట్ సెట్టింగ్‌లను కలిగి ఉంటాయి, అయితే యుక్తవయస్సులోని మీ పిల్లలతో సంభాషించడం అనేది సామాజిక మాధ్యమంతో సానుకూలమైన అనుభవాలను పొందడంలో వారికి సహాయపడే ఉత్తమ మార్గం.

నికోల్:

ధన్యవాదాలు, డా. తాలిబ్. సాంకేతిక జీవన విధానం మారుతూనే ఉన్న కారణంగా చర్చించడానికి ఇంకా చాలా ఉందని మాకు కూడా తెలుసు అలాగే కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మద్దతు ఇచ్చుకునేందుకు ఉత్తమమైన మార్గాలను కనుగొనేలా తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడాన్ని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము.

డా. తాలిబ్:

యుక్తవయస్సు పిల్లలకు సహాయం చేయడంలో మాకు తోడుగా ఉంటూ మా సేవలకు మెరుగులు దిద్దుతూ, వనరులను షేర్ చేయడంలో మీ పనిని కొనసాగిస్తున్నందుకు నికోల్ మరియు మీ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఈ సంభాషణలో ప్రస్తావించిన Meta మరియు Instagram టూల్‌లు మరియు వనరుల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మరిన్నింటి కోసం, క్రింది వనరులను చూడండి.

ఫ్యామిలీ సెంటర్

Instagram తల్లిదండ్రుల పేజీ మరియు తల్లిదండ్రుల మార్గదర్శకం

Instagram సురక్షత సైట్

సంబంధిత అంశాలు

మీ స్థానానికి నిర్దిష్టమైన కంటెంట్‌ను చూడడానికి మరొక దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా?
మార్చండి