థోర్న్ ద్వారా రూపొందించబడి, Facebook ద్వారా రూపాంతరీకరించబడినటువంటి ఈ లైంగిక దోపిడీని అరికట్టడంలో సంరక్షకులకు సహాయపడే వనరులు అనేవి లైంగిక దోపిడీకి సంబంధించి సపోర్ట్ మరియు సమాచారాన్ని కోరే ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటాయి.
ఆన్‌లైన్‌లో ఉన్నప్పటి సమయంతో సహా జీవితం మొత్తంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో మీ సపోర్ట్ మరియు మార్గదర్శకత్వం మీ టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిలకు ఉంటాయి, కనుక వారు సురక్షితంగా ఉంటారు. మీ టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిలు లైంగిక వేధింపులకు గురి కావడం వంటి చిక్కుల్లో పడకుండా, (అలాగే కొన్నిసార్లు విపత్కర) పరిస్థితులు ఎదుర్కోకుండా వారికి సహాయపడటానికి మీరు చేయగల కొన్ని అంశాలు ఇక్కడ అందించబడ్డాయి.
ఇది కష్టంగా ఉంటుంది, కానీ మీరు ఈ మార్గదర్శకాన్ని చదివి ఇప్పటికే సరైన పని చేస్తున్నారు. మీ తదుపరి దశలు: దీని గురించి మీ టీనేజ్ అమ్మాయి(లు)/అబ్బాయి(ల)తో మాట్లాడండి, ఆ తర్వాత మీ స్నేహితులతో దాని గురించి మాట్లాడండి.
లైంగికపరమైన మెసేజ్‌ల గురించి మాట్లాడుతూ సులభంగా సంభాషణను ప్రారంభించవచ్చు, అలాగే ఇది యుక్తవయస్సులోని వ్యక్తులు అర్థం చేసుకునే భాష. లైంగికపరమైన మెసేజ్‌లు అనగా సాధారణంగా ఆన్‌లైన్‌లో లైంగికంగా అభ్యంతరకరమైన సందేశాలు లేదంటే నగ్నమైన లేదా పాక్షికంగా నగ్నమైన ఇమేజ్‌లను షేర్ చేయడం లేదా స్వీకరించడం. ప్రారంభించడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొంత వచనం అందించబడింది:
లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న యుక్తవయస్సులోని వ్యక్తులు సమస్యలు ఎదురవుతాయేమోనని భయపడుతూ ఉండవచ్చు. వారి తల్లిదండ్రులు అవమానాల పాలవడం లేదా పాఠశాల నుండి సస్పెండ్ చేయడం, స్నేహితులు తమ గురించి తప్పుగా అనుకోవడం లేదా పోలీసులతో సమస్య తలెత్తడం వంటివి జరుగుతాయని భయపడుతూ ఉండవచ్చు. వేధింపులకు గురి చేసే వ్యక్తి వారిని ఆధీనంలో ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ భయాలను కలిగించి ఉండవచ్చు, చింతించాల్సిన విషయం ఏమిటంటే ఇలాగే జరుగుతుంది. ఈ భయాల వలన యుక్తవయస్సులోని వ్యక్తులు నిశబ్దంగా ఉండిపోతారు, తత్ఫలితంగా అనుకోని ఫలితాలకు దారి తీయడం జరుగుతుంది.
మీకు భయం మరియు చిరాకు కలగడం సహజం, కానీ విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో ఎల్లప్పుడూ వారితో కలిసి ఉంటారని మీ టీనేజ్ పిల్లలకు తెలియజేయడం అవసరం. మీరు వారికి అండగా నిలబడతారనే విషయం వారికి తెలుసని మీరనుకున్నప్పటికీ, ఇలాంటి సంభాషణలు జరపడం వలన పరిస్థితులు బాగా లేనప్పుడు లేదా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మీతో వారి అనుభవాలను పంచుకునేలా వారిలో మార్పు తీసుకురావచ్చు.
తల్లిదండ్రులుగా బాధ్యతలను నిర్వర్తించడం చాలా కష్టమైన పని కావచ్చు. నేటి సాంకేతికతలలో వేగవంతమైన గమనంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉండటం చాలా కష్టం. కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేసి, వాటిని ప్రయత్నించండి. మీ టీనేజ్ పిల్లలకు ఇష్టమైన యాప్‌లను వారిని అడిగి తెలుసుకోండి. మీరు మీ టీనేజ్ పిల్లలతో దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే, ఏదైనా పరిస్థితులు దిగజారుతున్నప్పుడు అర్థం చేసుకోవడం సులభతరమవుతుంది, అలాగే అసౌకర్యంగా అనిపించే పరిస్థితులను మీతో పంచుకోవడం వారికి సులభతరమవుతుంది.
తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల కోసం మేము అందిస్తున్న వనరులను విశ్లేషించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీకు లేదా మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయికి Facebook లేదా Instagram ఖాతా ఉన్నట్లయితే, మీ అనుభవం నుండి మరిన్ని ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడటం మరియు మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయికి వారి అనుభవం గురించి దిశానిర్దేశం చేయడంలో సహాయపడటం కోసం కొన్ని ఉపయోగకరమైన లింక్‌లు, చిట్కాలు మరియు సూచనలను అందిస్తున్నాము.
పరస్పరం అవగాహనను పొందడం ద్వారా, మనం మన యువతను మెరుగ్గా సంరక్షించుకోవచ్చు. మీ టీనేజ్ పిల్లలు మరియు మీ స్నేహితులతో థోర్న్ రూపొందించిన లైంగిక దోపిడీని అరికట్టండి వీడియోను షేర్ చేయండి. లైంగిక వేధింపులు ఎదురయ్యే కొన్ని మార్గాల గురించి వ్యక్తులకు ఎక్కువగా తెలిస్తే, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి వారు మరింతగా సంసిద్ధులై ఉంటారు.
\