ఆరోగ్యకరమైన ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌ల గురించి యుక్తవయస్సు పిల్లలతో మాట్లాడటం


ఇంటర్నెట్ అనేది ‘నిజ జీవితం’

వ్యక్తులు ముఖాముఖి మాట్లాడుకునేటప్పుడు, పరస్పరం అర్థం చేసుకోవడానికి వారి వాయిస్ టోన్ లేదా ముఖ కవళికలను మార్చడం వంటి.సామాజిక సూచనలను వారు ఉపయోగించవచ్చు. వ్యక్తులు ఆన్‌లైన్‌లో పరస్పరం ఇంటరాక్ట్ అయ్యినప్పుడు, కొన్నిసార్లు ఈ సూచనలు మిస్ కావచ్చు, ఇది వ్యక్తులు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆందోళన లేదా బాధ వంటి భావాలకు దారి తీయవచ్చు.

అందుకే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువతకు వారు ఆన్‌లైన్‌లో కనుగొన్న సంక్లిష్టమైన ఇంటరాక్షన్ ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో కొన్నిసార్లు మార్గదర్శకత్వం అవసరం. తల్లిదండ్రులు వారి యుక్తవయస్సు పిల్లలు ఇంటర్నెట్ లేదా సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించేటప్పుడు మంచి ఫలితాలను పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో వారికి సహాయపడవచ్చు. అలాగే వారు స్థితిస్థాపకత భావనను పెంపొందించుకోవడంలో కూడా వారికి సహాయపడవచ్చు - తద్వారా వారు గతంలో ప్రతికూల ఇంటరాక్షన్‌లు జరిగి ఉన్నట్లయితే (బహుశా అనివార్యంగా), వాటి నుండి బయటపడగలుగుతారు.

అన్నింటికీ మించి, మీ యుక్తవయస్సు పిల్లలతో బహిరంగంగా మాట్లాడండి. వారు మీ వద్దకు వచ్చి, సహాయం కోసం అడగవచ్చని వారికి తెలియాలి. అలా వారు అడిగినప్పుడు, మీరు సహాయం అందించగల మార్గాలు అనేకం ఉన్నాయి. వారి సమస్యను వినడంతో ప్రారంభమై, అక్కడి నుండి ఇక్కడికి వెళ్తుంది: సందర్భాన్ని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడటం.

ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లు మరియు స్థితిస్థాపకత పెంపొందించడం

బహిరంగంగా తెలియపరిచే మార్గాల ద్వారా, ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఇప్పటికీ ఈ బంగారు నియమం వర్తిస్తుందని అర్థం చేసుకోవడంలో మీరు మీ యుక్తవయస్సు పిల్లలకు సహాయపడగలరు: మీతో వ్యక్తులు ఎలా వ్యవహరించాలని మీరనుకుంటున్నారో వారితో మీరు కూడా అలాగే వ్యవహరించండి.

మీరు ఎవరితోనైనా మాట్లాడినా లేదా వారికి DM చేసినా, వారికి ఉత్తరం వ్రాసినా లేదా వారి పేజీలో కామెంట్‌ను పోస్ట్ చేసినా, భావోద్వేగాలు తరచుగా ఒకే విధంగా ఉంటాయి. మీరు మంచి కామెంట్‌తో ఒకరి రోజును ఆనందదాయకం చేయవచ్చు లేదా అవమానంతో వారి భావాలను గాయపరచవచ్చు.

ఇక్కడ తల్లిదండ్రులకు ప్రత్యేక బాధ్యత ఉంది. మీ యుక్తవయస్సు పిల్లలు ఆన్‌లైన్‌లో ప్రతికూల లేదా వాడివేడి ఇంటరాక్షన్ జరిపి ఉన్నట్లయితే, మీరు జరిగిన విషయం గురించి తెలుసుకుంటూ, ముందుకు కొనసాగే మార్గాన్ని కనుగొనడంలో వారికి సహాయపడటం ద్వారా వారికి సహాయపడవచ్చు. వారి అనుభవానికి సంబంధించి మీరు ఏమి చేయగలరో తెలుసుకోండి, వారి భావాలను ధృవీకరించండి మరియు వారు మంచి ఫలితానికి దారి తీయగల ప్రతిస్పందనతో మాట్లాడాలనుకుంటున్నారో లేదో చూడండి.

ఇదంతా స్థితిస్థాపకత నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో భాగం - చెడు విషయాలు జరిగినప్పుడు వాటి నుండి తిరిగి కోలుకునే సామర్థ్యం

సంభాషణను కొనసాగిస్తూనే ఉండండి

ఆన్‌లైన్‌లో సానుకూల ఇంటరాక్షన్‌లను పెంపొందించడంలో యుక్తవయస్సు పిల్లలు మరియు యువతకు సహాయపడటం అనేది సుదీర్ఘ ప్రక్రియగా ఉండవచ్చు, ఇందులో కాలానుగుణంగా చాలా సంభాషణలు జరపాల్సి రావచ్చు. సంభాషణను ప్రారంభించగల అంశాలు మీకు కావాలంటే, ఇలాంటి అంశాలతో మొదలుపెట్టండి:

  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు కొన్నిసార్లు నువ్వు ఆన్‌లైన్‌లో ఎటువంటి అంశాలను ఎదుర్కొంటావనే దాని గురించి నేను ఆందోళన చెందుతాను. ప్రతిస్పందించడంలో మీకు సహాయపడే మార్గాల గురించి మనం మాట్లాడవచ్చా?
  • నువ్వు ఆన్‌లైన్‌లో చేసిన ఇటీవలి ఇంటరాక్షన్ గురించి నాకు వివరాలు కావాలి.
  • నువ్వు ఎప్పుడు కలత చెందావు మరియు ఎందుకు?
  • విచారకరమైన విషయాలు జరిగినప్పుడు బాధపడటంలో తప్పేమీ లేదు, చెడు విషయాలు జరిగినప్పుడు బాధపడటంలో తప్పేమీ లేదు. తదుపరిసారి పరిస్థితులను మెరుగుపరచడానికి మనము ఇంటర్నెట్ మరియు సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించే విధానాన్ని ఎలా మార్చుకోవచ్చు?

సంబంధిత అంశాలు

మీ స్థానానికి నిర్దిష్టమైన కంటెంట్‌ను చూడడానికి మరొక దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా?
మార్చండి