LGBT Tech
యుక్తవయస్సులోని పిల్లలతో వారి టెక్స్టింగ్, సామాజిక మాధ్యమం మరియు సెల్ ఫోన్ వినియోగం గురించి డైలాగ్‌ను రూపొందించడం ఈ వయస్సులో ఉన్న చాలా మంది వయోజనులకు సవాలుగా ఉంటుంది. చాలా వరకు సామాజిక మాధ్యమ యాప్‌లకు వినియోగదారులు కనీసం 13 ఏళ్ల వయస్సుకలిగి ఉండవలసి ఉండగా, యుక్తవయస్కులు ఖాతా కోసం సైన్ అప్ చేసుకోవడానికి తమ వయస్సు గురించి నిజాయితీగా ఉండకపోవచ్చు. U.S.లో సగటు వ్యక్తి సొంత సెల్‌ఫోన్‌ను పొందే వయస్సు 10 సంవత్సరాలుగా ఉంటూ ఉండగా , యుక్తవయస్సు పిల్లలలోని 95% మంది స్మార్ట్‌ఫోన్‌కు యాక్సెస్‌ను కలిగి ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అందువల్ల, విశ్వసనీయ వయోజన వ్యక్తులు యుక్తవయస్సులోని తమ పిల్లలతో స్మార్ట్‌ఫోన్‌లు మరియు సామాజిక మాధ్యమాన్ని సముచితంగా ఉపయోగించడం గురించి బహిరంగ సంభాషణలు చేయడం చాలా ముఖ్యం.
యుక్తవయస్సులోని పిల్లల జీవితంలో మీ పాత్ర ఏదైనప్పటికీ, వారు తమ జీవితంలో మరింత స్వాతంత్ర్యం, బాధ్యత మరియు గోప్యతను కోరుకుంటారని మరియు ఇందులో ఫోన్‌లు మరియు సామాజిక మాధ్యమం వంటివి పెద్ద పాత్ర పోషిస్తాయని మీకు తెలుసు. LGBTQ+ యువతకు, వారి లైంగికత, కమ్యూనిటీ ఏర్పాటు, ఆరోగ్య సమాచారం మరియు సాధారణ భద్రతా సమస్యలు వంటి వాటిని అర్థం చేసుకోవడానికి నావిగేట్ చేస్తున్నప్పుడు వారి సెల్ ఫోన్ అనేక సందర్భాల్లో లైఫ్‌లైన్‌గా ఉంటుంది. అయినప్పటికీ, దానిని వారి ఆన్‌లైన్ భద్రతతో సమతుల్యం చేసుకోవడం చాలా కీలకమైన అంశం. ఈ క్రింది సూచనలు యుక్తవయస్సులోని పిల్లలు అందరికీ ముఖ్యమైనవి, కాగా అధిక సురక్షత మరియు భద్రత ప్రమాదావకాశంలో ఉన్న LGBTQ+ యువతకు ఈ సంభాషణలు మరింత ముఖ్యమైనవిగా ఉంటాయి. కొన్నిసార్లు కష్టతరంగా ఉండే ఈ సంభాషణలను ఎలా నిర్వహించాలి అనే దానిపై సూచనలు కూడా చేర్చబడ్డాయి.
యుక్తవయస్సులో ఉన్నవారు డిజిటల్ లేదా సామాజిక మాధ్యమ ఖాతాను కలిగి ఉండటానికి తగినంత పరిపక్వత లేదా బాధ్యతను వహించలేరని సూచించడంతో పాటు దానిని మూసివేయమని డిమాండ్ చేయడానికి బదులుగా, Netsmartz.org సూచించిన కొన్ని చర్చా ప్రారంభాలనుఉపయోగించడాన్ని ప్రయత్నించండి. వీటిలో కొన్ని ఈ విధంగా ఉంటాయి:
LGBTQ+ యువత ఇతర యుక్తవయస్సు పిల్లలను రీచ్ కావడానికి మరియు వృత్తిపరమైన మద్దతుని పొందడం కోసం, మీరు వారికి సురక్షితమైన వనరుల జాబితాను కూడా అందించవచ్చు.
సగటు LGBTQ+ యువత తమ భిన్న లింగ సహచరులతో పోలిస్తే రోజుకు 45 నిమిషాలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో గడుపుతున్నారని తెలుసుకోవడం ద్వారా యుక్తవయస్సు పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు అని తెలుసుకోవడం అలాగే వారు అనుచితమైన టెక్స్ట్‌లు, ఫోటోలు లేదా సమాచారాన్ని షేర్ చేయడానికి ప్రయత్నించారా లేదా ఎప్పుడైనా షేర్ చేసారా అని తెలుసుకోవడం ముఖ్యం. గోప్యత మరియు బాధ్యతను కలిగి ఉండడంలో భాగంగా ఆన్‌లైన్ ప్రవర్తనలలో ఏది సరైనది మరియు ఏది సరైనది కాదు అనే దానికి సంబంధించిన అవగాహనను ప్రదర్శించడం అని మీ యుక్తవయస్సు పిల్లలతో చర్చించండి.
కేవలం ఫోన్/ఇంటర్నెట్ అధికారాలను పర్యవేక్షించడం లేదా తీసివేయడం ద్వారా తమ యుక్తవయస్సు పిల్లల ఆన్‌లైన్ భద్రతా సమస్యలను నిర్వహించేందుకు తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ప్రేరేపింపబడవచ్చు. సహజంగానే, యువత ఇలాంటి వాటిపై ప్రతిఘటించే అవకాశం ఉంది. ఈ పరిమితులు కొన్నిసార్లు ప్రభావవంతంగానే ఉన్నప్పటికీ, వాటిని ఆన్‌లైన్ భద్రతకు సంబంధించి ఓపెన్ కమ్యూనికేషన్ మరియు డైలాగ్‌లతో కలిపి పరిగణించవలసి ఉంటుంది లేదా అవి బ్యాక్‌ఫైర్ కావచ్చు. యుక్తవయస్సు పిల్లలపై తమ నియంత్రణ లేదా పరిమితుల కోసం తల్లిదండ్రులు కనుగొన్న ఒక ప్రత్యామ్నాయం సులభంగా దొరికే చవకైన "బర్నర్" లేదా "ట్రాప్ ఫోన్‌లను" ఉపయోగం. సాంకేతికత లేదా డిజిటల్ అనుభవాలను తీసివేయడం అనేది తరచుగా ఉపయోగకరమైన విషయం కాదు; బదులుగా తల్లిదండ్రులు యుక్తవయస్సులోని తమ పిల్లలకు ఆన్‌లైన్‌లో తమను తాము రక్షించుకోవడం ఎలా అనే దాని గురించి అవగాహన కల్పించే మార్గాలపై దృష్టి పెట్టవచ్చు.
ప్రత్యేకించి లైంగికపరమైన సందేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎలాంటివి షేర్ చేయాలి మరియు ఎలాంటివి షేర్ చేయకూడదు అనే దాని గురించి యుక్తవయస్సులోని మీ పిల్లలతో మాట్లాడటం చాలా ముఖ్యం. యుక్తవయస్సు పిల్లలులు యుక్తవయస్సులోని ఇతర పిల్లలతో అనుచితమైన సంబంధాలలో చిక్కుకుపోవచ్చు, అంతే కాకుండా వారి వ్యక్తిగత చిత్రాలు లేదా సమాచారాన్ని కోరుకుంటూ వారిని మోసగించే వ్యక్తుల బారిన పడవచ్చు. బాధిత యుక్తవయస్సు పిల్లలకు వారి జీవితంపై శ్రద్ధ వహించే వయోజనులు మరియు మానసిక ఆరోగ్య నిపుణుల మద్దతు అవసరం ఉంటుంది. యువతతో ఈ సంభాషణలను ఎలా నిర్వహించాలనే దానికి సంబంధించిన సమాచారం "లైంగికపరమైన సందేశాలను గురించి యుక్తవయస్సులోని పిల్లలతో మాట్లాడటం" విభాగంలో ఉంది అలాగే ఈ విషయంలో కుటుంబ సభ్యులకు సహాయం చేయగల వనరులను Netsmartz అందిస్తోంది.
యుక్తవయస్సు పిల్లలు తమ గోప్యతా సెట్టింగ్‌లతో పాటు వారు గేమింగ్ కార్యకలాపాలలో నిమగ్నమైనప్పుడు ఆన్‌లైన్‌లోని తమ సహచరులు లేదా ప్రత్యర్థులతో షేర్ చేసుకునే సమాచారం పట్ల అవగాహనను కలిగి ఉండాలి. పాన్‌డెమిక్ సమయంలో, ఆన్‌లైన్‌లో ప్రలోభ పెట్టడం లో దాదాపు 100% పెరుగుదల నమోదైంది. గేమింగ్, సామాజిక మాధ్యమం మరియు మెసేజింగ్ యాప్‌ల వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా యువతను సంప్రదించినప్పుడు ఇది జరుగుతుంది. పాత్ర పోషణ, సంభాషణ లేదా సంబంధాలను పెంచుకోవడం వంటి వాటి ద్వారా యువత "సిద్ధం చేయబడవచ్చు" లేదా బ్లాక్‌మెయిల్ లేదా అమ్మకం/వాణిజ్యం కోసం ఉపయోగించడం కోసం స్పష్టమైన ఫోటోలు/చిత్రాలను పంపవలసిందిగా ప్రోత్సహించబడవచ్చు. LGBTQ+ యువత తరచుగా తమ లైంగిక గుర్తింపును తమ సన్నిహితులతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు వివిధ వనరుల నుండి సమాచారం లేదా మద్దతును కోరుతారు కాబట్టి వారు మరింత ప్రమాదంలో ఉంటారు. ఈ స్థితిలో LGBTQ+ యువతకు మద్దతు ఇవ్వాలనుకునే వారికి HRC.org అందజేస్తున్న LGBTQ+ మిత్రులుగా ఉండడం వంటి వనరులు సహాయపడతాయి.
యుక్తవయస్సులోని మీ పిల్లలు వేధింపులకు గురవుతున్నా లేదా వారు వేరొకరిని వేధింపులకు గురి చేస్తునా, ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన విషయాలు నిజానికి ఎప్పటికీ అదృశ్యం అయిపోవు. పేర్కొనబడిన ఒక సంవత్సరంలో 48.7% మంది LGBTQ విద్యార్థులు సైబర్ వేధింపులకు గురి అవుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎవరినైనా బాధపెట్టడానికి ఉద్దేశించిన వాటిని షేర్ చేయడం లేదా "లైక్ చేయడం" కూడా వేధింపులను ప్రోత్సహించినట్లుగానే పరిగణించబడుతుంది. Stopbullying.gov సైబర్ వేధింపులను నిర్వచించడంతో పాటు వాటిని రిపోర్ట్ చేసే విధానానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరిస్థితులలో యుక్తవయస్సులోని మీ పిల్లలకు మద్దతు ఇచ్చే మార్గాలను మీరు ఇక్కడ కనుగొనవచ్చు.
యుక్తవయస్సు పిల్లలు సామాజిక మాధ్యమం పేజీలో కొత్త స్నేహితులు మరియు ఫాలోవర్‌లను నిర్ధారించడం మరియు పొందడం ఉత్తేజకరమైన విషయమే. స్నేహితుల స్నేహితుల నుండి స్నేహ అభ్యర్థనలను అంగీకరించడం ప్రమాదకరం కాకపోవడంతో పాటు కొత్త మరియు సానుకూలమైన సంబంధాలకు దారితీయవచ్చు, కానీ ఇలాంటి వాటిలో యువత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వయోజనులు తరచుగా పర్యవేక్షణ అవసరం లేదు అని భావించే ఆన్‌లైన్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన మరొక మూలం ఆన్‌లైన్ వీడియో గేమ్‌లు, కానీ వీటిని కూడా పరిగణించవలసి ఉంటుంది. యుక్తవయస్సులోని చాలా మంది పిల్లలు (వారు తమ ఫోన్‌లను ఉపయోగించనప్పుడు) వీడియో గేమ్‌లు, ఒక ప్రముఖ సామాజిక అవుట్‌లెట్‌గా ఉండడంతో పాటు యువతలో సగం కంటే ఎక్కువ మంది తాము వీడియో గేమ్‌లు ఆడుతున్నప్పుడు తమకు కొత్త ఆన్‌లైన్ స్నేహితులు దొరికినట్లు తెలియజేసారు. కమ్యూనిటీని రూపొందించడం, కొత్త స్నేహితులను మరియు ప్రాతినిధ్యాన్ని కనుగొనడం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ LGBTQ+ యువతకు ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయితే యుక్తవయస్సు పిల్లలు గేమింగ్ చేసేటప్పుడు కూడా సురక్షితంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
కొత్త స్నేహితులు లేదా ఫాలోవర్ పోస్ట్‌లను పర్యవేక్షించవలసిందిగా యుక్తవయస్సులోని మీ పిల్లలకు గుర్తు చేయడం ముఖ్యం. ఖాతాలు హ్యాక్ చేయబడవచ్చు అలాగే వారి ఖాతాలను రక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉన్న యువత తమను తాము మాత్రమే కాకుండా తమ నిజమైన స్నేహితులు మరియు ఫాలోవర్‌లను రక్షించడంలో కూడా సహాయం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ప్లాట్‌ఫారమ్‌లోని విధానాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తుల ఖాతాలను విస్మరించడం మాత్రమే కాకుండా బ్లాక్ చేసి, రిపోర్ట్ చేయవలసిందిగా యుక్తవయస్సులోని మీ పిల్లలను ప్రోత్సహించండి.
LGBTQ+ యువతకు ఆన్‌లైన్‌లో ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులలో తమకు తాముగా ఎలా సహాయం చేసుకోవాలి అనే విషయంపై అవగాహన లేకుండా వదిలేస్తే మరింత హానికరం అవుతుంది. యుక్తవయస్సు LGBTQ+ పిల్లల జీవితంలోని విశ్వసనీయమైన వయోజన వ్యక్తిగా, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగాన్ని ముందస్తుగా పరిష్కరించడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ భద్రత మరియు గోప్యతకు సంబంధించిన LGBTQ+ సమస్యలను చర్చిస్తున్నప్పుడు అసౌకర్యం కారణంగా ఈ సంభాషణలను విస్మరించకండి; బదులుగా, ప్రత్యేకించి ఉపేక్షించని విధానానికి సంబంధించిన చర్యలు బ్యాక్‌ఫైర్ కావచ్చు కాబట్టి ఈ బాధ్యతను ఎలా నిర్వహించాలి అనే దాని గురించి యుక్తవయస్సులోని మీ పిల్లలకు అవగాహనతో మద్దతు కల్పించండి. మీ కంఫర్ట్ జోన్‌కి వెలుపల ఉన్న అంశాల కోసం దిగువన ఉన్న వనరుల ద్వారా సహాయం కోరండి అలాగే అన్నింటికి మించి, మీ జీవితంలోని యుక్తవయస్సు పిల్లలు వారి గురించి మరియు వారి డిజిటల్ సంరక్షణ గురించి మీరు శ్రద్ధ వహిస్తున్నట్లు వారికి తెలియజేయండి.