మీ యుక్తవయస్సు పిల్లల డిజిటల్ కీర్తి ప్రతిష్టల ప్రాముఖ్యత

సైబర్ వేధింపుల పరిశోధన కేంద్రం

సమీర్ హిందూజా & జస్టిన్ డబ్ల్యు. ప్యాచిన్

పాఠశాలలో, కార్యాలయ సిబ్బందిలో, కమ్యూనిటీలో మరియు – పెరుగుతున్న – ఆన్‌లైన్‌లో కీర్తి ప్రతిష్టలు చాలా ముఖ్యం. సామాజిక మాధ్యమం, వెబ్ మరియు ఇతర ఇంటర్నెట్ ఆధారిత వేదికలలో మీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే, ఇతరులు మీ పట్ల కలిగి ఉన్న దృక్కోణాలు మరియు వైఖరులను ఆకృతీకరించే కంటెంట్ యొక్క సంక్షిప్త సారాంశం ఉంటుంది. ఇది మీ డిజిటల్ కీర్తి ప్రతిష్టలను ప్రతిబింబిస్తుంది, అలాగే మీరు (లేదా ఇతరులు) అప్‌లోడ్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు, మీరు షేర్ చేసిన కామెంట్‌లు, మీరు ఫీచర్ చేయబడిన కథనాలు, మీ గురించి ఇతరులు పోస్ట్ చేసిన ప్రకటనలు, మీరు ఉపయోగించిన స్క్రీన్‌పేర్లు మరియు మరిన్నింటి నుండి రూపొందించబడింది.

పెద్దవారిగా, సానుకూల కీర్తి ప్రతిష్టలను సృష్టించడం మరియు నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుని ఉండవచ్చు. మన పిల్లలు అర్థం చేసుకున్నారా? యుక్తవయస్సు పిల్లలు మాధ్యమిక లేదా ఉన్నత పాఠశాలలో ఉన్నారా అనే దానితో సంబంధం లేకుండా, వారి జీవితాలలో వారి డిజిటల్ కీర్తి ప్రతిష్టలు ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉండాలి. వారి సహచరులు, వారి ఉపాధ్యాయులు, వారి శిక్షకులు మరియు మెంటార్‌లు, అలాగే వారి కమ్యూనిటీలోని ఇతరులు వారిని ఏ విధంగా చూస్తారనే దానిపై ఇది ప్రభావం చూపుతుంది. వారు ఆన్‌లైన్‌లో వర్ణించబడిన తీరు ఆధారంగా వ్యక్తులు వారిపై అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవచ్చు (మరియు తరచుగా ఏర్పరుచుకుంటారు) కాబట్టి, కొంత స్థాయిలో ఈ వాస్తవికత గురించి వారు ఇప్పటికే ఆలోచించి ఉంటారని ఆశిస్తున్నాము. వాస్తవానికి, కళాశాల ప్రవేశాలు, ఉపకార వేతనాలు, ఉపాధి లేదా ఇతర కీలకమైన అవకాశాలకు సంబంధించిన నిర్ణయాలు వారి డిజిటల్ కీర్తి ప్రతిష్టలు లేదా కొందరు వారి డిజిటల్ అడుగుజాడలను ఏ విధంగా పరిగణిస్తారు అనే విషయాల ఆధారంగా ఉండవచ్చు.

మీ యుక్తవయస్సు పిల్లల డిజిటల్ కీర్తి ప్రతిష్టలను నిర్వహించడంలో సహాయపడటం

మీ యుక్తవయస్సు పిల్లలతో వారి ఆన్‌లైన్ సమాచారాన్ని సరిగ్గా నిర్వహించాల్సిన ప్రాముఖ్యత గురించి చర్చించడం ముఖ్యం. వారు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసేది ఏదైనా భవిష్యత్తులో ఇతరుల ద్వారా యాక్సెస్ చేయబడవచ్చని వారికి గుర్తు చేయండి. ఆ విషయంలో వారు సౌకర్యంగా ఉన్నారా? మీ యుక్తవయస్సు పిల్లలను వారు పోస్ట్ చేసే కంటెంట్‌లోని ప్రతి భాగానికి సంబంధించి తమను తాము ప్రశ్నించుకునే విధంగా ప్రోత్సహించండి.

తర్వాత, వారి గురించి ఇప్పటికే బహిర్గతమైన దాన్ని చూడటానికి కొంత సమయాన్ని వెచ్చించండి. ప్రధాన శోధన ఇంజిన్‌‌లు మరియు శోధనలకు అవకాశం ఉన్న ఇతర సైట్‌ల ద్వారా వారి మొదటి మరియు చివరి పేరుతో (ఇంకా బహుశా పాఠశాల మరియు/లేదా నగరం) శోధనను అమలు చేయడంతో ప్రారంభించండి. కొత్త “ప్రైవేట్” లేదా “అజ్ఞాత” ట్యాబ్ లేదా విండోను ఉపయోగించండి, తద్వారా మీ బ్రౌజింగ్ చరిత్ర మరియు కుక్కీల ఆధారంగా శోధన ఫలితాలు ప్రత్యేకంగా మీ కోసం క్యూరేట్ చేయబడవు. మీరు లేదా వారు కలిగి ఉన్న ఖాతాలలో సమస్యాత్మక కంటెంట్ ఉన్నట్లయితే, దాన్ని తీసివేయవలసిందిగా వారిని ప్రోత్సహించండి. మీకు నియంత్రణ లేని మరొక సైట్ లేదా ప్రొఫైల్‌లో ఇది అందుబాటులో ఉన్నట్లయితే, ఆ సృష్టికర్త, పోస్ట్ చేసిన వ్యక్తి లేదా వెబ్ హోస్ట్‌ను సంప్రదించడం ఎలాగో కనుగొనండి. మీరు ప్రతిస్పందనను పొందనట్లయితే, ప్రయత్నం కొనసాగించండి లేదా వృత్తిపరమైన కీర్తి ప్రతిష్టల నిర్వహణ కంపెనీతో కనెక్ట్ అవ్వండి మరియు/లేదా న్యాయవాది సహాయం తీసుకోండి. అలాగే నిర్దిష్ట శోధన ఫలితాల నుండి కాలం చెల్లిన కంటెంట్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని తీసివేయమని మీరు అధికారికంగా అభ్యర్థించవచ్చు. సమస్యాత్మక కంటెంట్‌ను ఎదుర్కోవడంలో సహాయపడటానికి, వారు ఆన్‌లైన్‌లో వార్తల కథనాలు మరియు విభాగాలలో ఫీచర్ చేయబడటం కోసం అవకాశాలను కనుగొనడంలో కూడా మీరు మీ యుక్తవయస్సు పిల్లలకు మద్దతు అందించవచ్చు.

ఇతరులు వారి ఫోటోలు మరియు పోస్ట్‌లలో యుక్తవయస్సు పిల్లలను ట్యాగ్ చేయడం (ఆపై సామాజిక మాధ్యమ ఫీడ్‌లలో లేదా శోధన పదంగా మీ పిల్లల పేరుతో ఇతరులు నిర్వహించే శోధన ఫలితాలలో చూపబడవచ్చు) ద్వారా వారి కీర్తి ప్రతిష్టలపై ప్రతికూలంగా ప్రభావం చూపగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.యుక్తవయస్సు పిల్లలు ఎల్లప్పుడూ తమని తాము అన్‌ట్యాగ్ చేసుకోవడానికి లేదా దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించి, దాన్ని తీసివేయమని వారిని అభ్యర్థించడానికి ప్రయత్నించవచ్చు. అది పని చేయనట్లయితే, వ్యక్తిని రిపోర్ట్ చేయడం మరియు కంటెంట్‌ను తీసివేయడం కోసం సామాజిక మాధ్యమ సైట్‌ను అధికారికంగా అభ్యర్థించడం గురించి మీ యుక్తవయస్సు పిల్లలతో మాట్లాడండి.

వ్యక్తిగత బ్రాండింగ్

పరిశోధన1 సామాజిక మాధ్యమం అనేది వ్యక్తిగత బ్రాండింగ్, స్వీయ-ప్రచారం మరియు ఇంప్రెషన్ మేనేజ్‌మెంట్ వంటి ముఖ్యమైన వృత్తిపరమైన ప్రయోజనాలను అందించగలదని చూపుతోంది. అందుకని, మేము దాని ఉద్దేశ్యపూర్వక సానుకూల వినియోగాన్ని ప్రోత్సహిస్తాము. యువతీయువకులందరూ కేవలం వ్యక్తిగత వృద్ధి కోసం కాకుండా, ఇతరులు వారి కోసం ఆన్‌లైన్‌లో శోధించినప్పుడు వారి కఠోర శ్రమ, సమగ్రత మరియు పౌర మనస్తత్వం ఆనవాళ్లు కనుగొనబడే విధంగా పాఠశాలలో మరియు వారి కమ్యూనిటీలో గొప్ప పనులు (ఉదా. గౌరవప్రదమైన పాత్ర పోషించడం, స్వచ్ఛందంగా సేవలందించడం, ఇతరేతర కార్యకలాపాలు మొదలైనవి) చేయడం కోసం అదనంగా కష్టపడి పని చేయడం ముఖ్యం.

సంబంధితంగా, వ్యక్తిగత వెబ్‌సైట్‌ను సృష్టించమని మీ యుక్తవయస్సు పిల్లలను ప్రోత్సహించడం (లేదా సహాయపడటం) తెలివైన చర్య కావచ్చు. ఇక్కడ, వారు విద్యాసంబంధిత, క్రీడా సంబంధ, వృత్తిపరమైన లేదా సేవ-ఆధారిత కార్యసాధనలు, వారి గురించి గొప్పగా మాట్లాడే ఇతరుల వాంగ్మూలాలు మరియు సిఫార్సులు, అలాగే పరిపక్వత, వ్యక్తిత్వం, సమర్థత మరియు దయను వర్ణించే సముచితమైన ఫోటోలు మరియు వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. యుక్తయవయస్సు పిల్లలు గతంలో పొరపాటు చేసి, ఆన్‌లైన్‌లో ఏదైనా అనుచితమైనది పోస్ట్ చేసి ఉన్నట్లయితే, ఇది మరింత ముఖ్యం. సాధ్యమైతే, వారు ప్రతికూల కంటెంట్ దృశ్యమానత మరియు ప్రభావాన్ని తగ్గించగలిగేలా ఆన్‌లైన్‌లో తమ గురించి సానుకూల కంటెంట్‌ను హైలైట్ చేయడానికి మరియు పరిమాణాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. మొత్తంగా, యుక్తవయస్సులోని పిల్లలు వారి గురించి పోస్ట్ చేయబడినది వారికి హాని కలిగించే బదులుగా వారికి ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపై నిరంతర పరిశీలనతో వారి ఆన్‌లైన్ భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులుగా, మీ యుక్తవయస్సు పిల్లలకు ఎదురుకాగల అవకాశాల కోసం వారి డిజిటల్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడానికి వారితో భాగస్వామిగా మారండి మరియు ఈ విధంగా విజయం సాధించగల వారి అవకాశాలను అనుకూలపరచండి.

సంబంధిత అంశాలు

మీ స్థానానికి నిర్దిష్టమైన కంటెంట్‌ను చూడడానికి మరొక దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా?
మార్చండి