Metaలో, సానుకూలమైన ఆన్‌లైన్ సంబంధాలను పెంపొందించుకోవడంలో కుటుంబాలకు సహాయపడటానికి విశ్వసనీయ సంస్థలు మరియు భాగస్వాములతో కలిసి పని చేయడం మాకు గర్వంగా ఉంది.
MediaSmarts అనేది కెనడాలో ఉన్న డిజిటల్ మీడియా అక్షరాస్యతకు సంబంధించిన ద్విభాషా కేంద్రం. రిజిస్టర్ చేయబడిన స్వచ్ఛంద సంస్థగా, MediaSmarts 1996 నుండి పరిశోధనను నిర్వహిస్తోంది, వనరులను అభివృద్ధి చేస్తోంది మరియు డిజిటల్ మీడియా అక్షరాస్యతను పురోగతి దిశగా నడిపిస్తోంది.
NAMLE మీడియా అక్షరాస్యతకు సంబంధించిన ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో అన్ని వయస్సుల వారికి సహాయంగా విలువైన వనరులను అందిస్తుంది.
Parent Zone అనేది పిల్లల కోసం సాధ్యమైనంత ఉత్తమ భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, డిజిటల్ కుటుంబ జీవితానికి అత్యంత ప్రధానమైనదిగా ఉంది.
ConnectSafely ఆన్‌లైన్ సురక్షత, గోప్యత, భద్రత మరియు డిజిటల్ సంక్షేమం గురించి కుటుంబాలకు మరియు పాఠశాలలకు అవగాహన కల్పించేందుకు పని చేస్తుంది.
సురక్షత మరియు భద్రత మొదలుకుని మీ కుటుంబ సభ్యుల యొక్క డిజిటల్ సంరక్షణ వరకు, మీకు మరియు మీ యుక్తవయస్సు పిల్లలకు ముఖ్యమైన అంశాలను మా సలహాదారు ఇనిషియేటివ్‌లు కవర్ చేస్తాయి.
మీ కుటుంబ సభ్యులు సైబర్ దాడుల బారిన పడకుండా సురక్షితంగా ఉండగల, అలాగే ఆన్‌లైన్‌లో శోధిస్తున్నప్పుడు మరియు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సున్నితమైన లేదా కలవరపెట్టే కంటెంట్‌ను నావిగేట్ చేయగల మార్గాల గురించి వారికి మార్గనిర్దేశం చేయండి.
రూపకల్పన ప్రక్రియలో భాగంగా విభిన్న దృక్కోణాలను వినడం మరియు ప్రోత్సహించడం ద్వారా మేము వయస్సుకు తగిన అనుభవాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు నిపుణులు, సంరక్షకులు మరియు యుక్తవయస్సు పిల్లలతో కలిసి పని చేస్తాము.
మీ కుటుంబ సభ్యులు వారి ఆన్‌లైన్ కమ్యూనిటీలు మరియు కార్యకలాపాల్లో ఆరోగ్యకరమైన సంబంధాలు మరియు మరింత సానుకూలమైన కమ్యూనికేషన్‌ను కలిగి ఉండటంలో వారికి సహాయపడండి.