పర్యవేక్షణ టూల్‌లను ఉపయోగించడానికి మీరు యాప్‌కి సంబంధించిన తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసినట్లుగా దయచేసి నిర్ధారించుకోండి.

* Facebook మరియు Messengerలలో పర్యవేక్షణను ప్రారంభించడం వల్ల ఒక్కో వ్యక్తిగత యాప్‌కు గానూ మీకు అంతర్దృష్టులను అందిస్తుంది

పర్యవేక్షణ మరియు మద్దతు

Facebook మరియు Messengerలలో మీ యుక్తవయస్సు పిల్లలకు మెరుగైన మద్దతు ఇవ్వడానికి మీకు కావలసిన టూల్‌లను పొందండి

మీ యుక్తవయస్సు పిల్లల కోసం సానుకూల అనుభవాలను పెంపొందించడంలో సహాయపడేటటువంటి పర్యవేక్షణ టూల్‌లను శోధించండి.

పర్యవేక్షణకు వెళ్లండి

సాధారణ ప్రశ్నలు

యుక్తవయస్సు పిల్లలకు సురక్షితమైన, సానుకూలమైన అనుభవాలను అందించడంతో పాటు తల్లిదండ్రులు యుక్తవయస్సులోని తమ పిల్లల కోసం పరిమితులను సులభమైన మార్గంలో సెట్ చేయడంలో వారికి సహాయపడే 30కి పైగా టూల్‌లు, ఫీచర్‌లు మరియు వనరులను మేము రూపొందించాము. మీరు ఈ ఫీచర్‌లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా సహాయ కేంద్రంలో కనుగొనవచ్చు.

Facebook మరియు Messengerలో పర్యవేక్షణను సెటప్ చేయడం అనేది కేవలం ఒక ఆహ్వానంతో ప్రారంభమవుతుంది. యుక్తవయస్సు పిల్లలు తమ ఖాతాను పర్యవేక్షించడానికి తల్లిదండ్రులను ఆహ్వానించవచ్చు అలాగే తల్లిదండ్రులు పర్యవేక్షణలో నమోదు చేసుకునేందుకు తమ యుక్తవయస్సు పిల్లలను ఆహ్వానించవచ్చు. రెండు పక్షాలు తప్పనిసరిగా తమ ఆహ్వానాలను ఆమోదించాలి మరియు యుక్తవయస్సు పిల్లలు తప్పనిసరిగా పర్యవేక్షణను ప్రారంభించడం కోసం నిర్ధారించాలి. Facebook లేదా Messenger యాప్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లి, పర్యవేక్షణను ఎంచుకోవడం ద్వారా ప్రారంభించండి.

మీకు మీ యుక్తవయస్సు పిల్లల Facebook స్నేహితులు మరియు Messenger కాంటాక్ట్‌లు, అలాగే సందేశాల డెలివరీ, ప్రొఫైల్ మరియు ఆడియన్స్ ప్రాధాన్యతలు మరియు ఫ్యామిలీ సెంటర్‌లో స్టోరీ నియంత్రణలు వంటి మీ యుక్తవయస్సు పిల్లల సెట్టింగ్‌లలో కొన్నింటిని వీక్షించగల సామర్థ్యం ఉంటుంది. ఈ సెట్టింగ్‌లలో ఏదైనా మారితే, మీరు నోటిఫికేషన్‌లను అనుమతించి ఉన్నట్లయితే మీరు నోటిఫికేషన్‌ను స్వీకరిస్తారు.

మీరు పర్యవేక్షణకు వెళ్లి, "Messengerలో సమయం" లేదా "Facebookలో సమయం" ఎంపికకు వెళ్లడం ద్వారా ఒక్కో వ్యక్తిగత యాప్‌కు వెచ్చించిన రోజువారీ సగటు సమయాన్ని వీక్షించవచ్చు.

మీరు మీ యుక్తవయస్సు పిల్లల Messenger కాంటాక్ట్‌ల జాబితాను మరియు Facebook స్నేహితుల జాబితాను చూడవచ్చు, అందులో Instagramలో వారి కనెక్షన్‌లు ఉండవచ్చు. స్నేహితులు మరియు కాంటాక్ట్‌లు అత్యంత ఇటీవల జోడించినవి ఆధారంగా సంవత్సరంవారీగా సార్ట్ చేయబడ్డాయి.

మీ స్థానానికి నిర్దిష్టమైన కంటెంట్‌ను చూడడానికి మరొక దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా?
మార్చండి