Instagramలో సురక్షితమైన, వయస్సుకు తగిన అనుభవాలను క్రియేట్ చేయడం
తల్లిదండ్రులు మరియు టీనేజ్ పిల్లలు సురక్షితంగా మరియు తగిన అవగాహన పొందినట్లు భావించడంలో సహాయపడటానికి మా టూల్‌లు మరియు వనరులు ఇక్కడ ఉన్నాయి. Instagramను నమ్మకంగా మరియు మనశ్శాంతితో ఆస్వాదించడానికి మా మార్గదర్శకాలు, చిట్కాలు మరియు అవగాహన అంశాలను ఒకసారి పరిశీలించండి.
పరిచయం చేస్తున్నాము Instagram టీనేజ్ పిల్లల ఖాతాలు
తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో టీనేజ్ పిల్లలకు అందించబడే సరికొత్త, సురక్షితమైన అనుభవం
త్వరలో, Instagramలోని టీనేజ్ పిల్లలకు ఆటోమేటిక్‌గా టీనేజ్ పిల్లల ఖాతాలు కేటాయించబడతాయి, వారిని ఎవరు కాంటాక్ట్ చేయగలరు మరియు వారికి చూపబడే కంటెంట్ వంటి వాటిపై అంతర్నిర్మిత పరిమితులు, అలాగే వారి ఆసక్తులతో కనెక్ట్ కావడానికి మరియు వాటిని అన్వేషించడానికి మరిన్ని మార్గాలను కలిగి ఉంటాయి. 16 ఏళ్లలోపు వయస్సు గల టీనేజ్ పిల్లలు ఈ సెట్టింగ్‌లను మార్చాలంటే, తల్లిదండ్రుల అనుమతి అవసరం.
ఫీచర్‌లు మరియు టూల్‌లు
instagram ఫీచర్‌ల గురించి తెలుసుకోండి
టీనేజ్ పిల్లలు సురక్షితమైన, వయస్సుకు తగిన మార్గాలలో Instagramలో క్రియేట్ చేయడం, అన్వేషించడం మరియు కనెక్ట్ కావడంలో వారికి సహాయపడటం కోసం నిర్దేశించబడిన ఫీచర్‌లు మరియు టూల్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.
తగిన కంటెంట్
మేము ప్రతిఒక్కరి భద్రతను మెరుగుపరచడానికి క్రియాశీల చర్యలు తీసుకుంటాము. మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్‌ని పరిశీలించడానికి మరియు తీసివేయడానికి మా బృంద సభ్యులు పని చేస్తున్నారు. మేము ఇలాంటి టూల్‌లను కూడా క్రియేట్ చేసాము:
డిఫాల్ట్ సున్నితమైన కంటెంట్ స్క్రీన్లు , ఇవి కలతపెట్టేలా లేదా ప్రేరేపించేలా ఉండే అవకాశమున్న పోస్ట్‌ల విజిబిలిటీని పరిమితం చేస్తాయి
అనుచితమైనవిగా లేదా అభ్యంతరకరమైనవిగా పరిగణించబడే కామెంట్‌లు మరియు మెసేజ్ రిక్వెస్ట్‌లను ఫ్లాగ్ చేసేలా దాచబడిన పదాలను సెట్ చేసే సామర్థ్యం.
పర్యవేక్షణ ఎంపికను ప్రారంభించినట్లయితే, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు:
వారి టీనేజ్ పిల్లలు నిర్దిష్ట కంటెంట్ గురించి ఫిర్యాదు చేసి, ఆ సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఎంచుకుంటే నోటిఫికేషన్ పొందగలరు
మేము వేధింపులు మరియు బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తాము. ప్రతికూలంగా లేదా అభ్యంతరకరంగా ఉండే అవకాశమున్న కామెంట్‌లను పోస్ట్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు, మా కమ్యూనిటీ మార్గదర్శకాల గురించి వ్యక్తులకు గుర్తు చేయడానికి కామెంట్ హెచ్చరికలు ప్రదర్శించబడతాయి, వారు ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తే వారి కామెంట్ తీసివేయబడవచ్చు లేదా దాచబడవచ్చని ఇవి వారికి తెలియజేస్తాయి.
పరిమితం చేయడం అనే మా టూల్ పరిమితం చేసిన వ్యక్తి మినహా మరెవరూ కామెంట్‌లను చూడకుండా నిరోధిస్తుంది
బ్లాకింగ్ ఫీచర్‌తో, టీనేజ్ పిల్లలు ఖాతాను, అలాగే బ్లాక్ చేసిన వ్యక్తి క్రియేట్ చేయగల ఏవైనా భవిష్యత్తు ఖాతాలను బ్లాక్ చేయవచ్చు
పరిమితులు ఎంపికతో, మీ టీనేజ్ పిల్లలు కొత్త ఫాలోవర్‌లు లేదా వారిని ఫాలో అవ్వని వ్యక్తుల నుండి వచ్చే కామెంట్‌లు మరియు మెసేజ్ రిక్వెస్ట్‌లను ఆటోమేటిక్‌గా దాచవచ్చు
నియంత్రణల ఎంపికతో కామెంట్, క్యాప్షన్ లేదా స్టోరీలో వారు ఫాలో అయ్యే వ్యక్తులు మాత్రమే చేయగలిగేలా లేదా అస్సలు ఎవరూ చేయలేకుండా ట్యాగ్‌లు లేదా ప్రస్తావనలను పరిమితం చేయవచ్చు
పర్యవేక్షణ ఎంపికను ప్రారంభించినట్లయితే, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు:
మీ టీనేజ్ పిల్లలు ఎవరిని ఫాలో అవుతున్నారు, వారిని ఎవరు ఫాలో అవుతున్నారు వంటి వాటికి సంబంధించిన నోటిఫికేషన్‌లను స్వీకరించగలరు
వారి టీనేజ్ పిల్లలు ఎవరెవరిని బ్లాక్ చేసారో చూడగలరు
మీ టీనేజ్ పిల్లలు దేని గురించైనా ఫిర్యాదు చేసి, ఆ ఫిర్యాదును మీతో షేరు చేసుకోవాలని ఎంచుకుంటే, నోటిఫికేషన్ పొందగలరు
టీనేజ్ పిల్లలు Instagramలో ఎంత సమయం గడుపుతారనే దానిపై హద్దులు క్రియేట్ చేయవలసిందిగా ప్రోత్సహించడమైనది. మీరు మరియు మీ టీనేజ్ పిల్లలు ఇలాంటి ఫీచర్‌లకు యాక్సెస్ కలిగి ఉంటారు:
రాత్రిపూట అన్ని నోటిఫికేషన్‌లను నిశ్శబ్దం చేయడానికి మరియు వారి కార్యకలాపం స్టేటస్‌ను మార్చడానికి స్లీప్ మోడ్
రోజువారీ వినియోగ పరిమితులు మరియు రిమైండర్‌లు, ఇవి టీనేజ్ పిల్లలు ప్రతిరోజూ 60 నిమిషాలు యాప్‌ను ఉపయోగించిన తర్వాత యాప్ నుండి నిష్క్రమించవలసిందిగా తెలియజేస్తాయి, అలాగే 16 ఏళ్లలోపు వయస్సు ఉన్న టీనేజ్ పిల్లలు ఈ నోటిఫికేషన్‌ను మార్చడానికి వారి తల్లిదండ్రుల అనుమతి అవసరం
పర్యవేక్షణ ఎంపికను ప్రారంభించినట్లయితే, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు:
వారి టీనేజ్ పిల్లల వినియోగానికి సంబంధించిన అవగాహన అంశాలను చూడగలరు
రోజువారీ వినియోగంపై పరిమితులను సెట్ చేయగలరు
Instagramలో ఎక్కువ సమయం గడపడానికి ఎక్స్‌టెన్షన్ అభ్యర్థనలు చేయడానికి వారికి ఏజెన్సీ అందించగలరు
Instagramను ఉపయోగించే వ్యక్తుల భద్రత మరియు గోప్యతకు మేము అగ్ర ప్రాధాన్యతను ఇస్తాము. టీనేజ్ పిల్లలు Instagramలో చేరినప్పుడు, వారి ఖాతా రక్షిత మరియు వయస్సుకు తగిన సెట్టింగ్‌లకు సెట్ చేయబడుతుంది. టీనేజ్ పిల్లల కోసం మా ఆటోమేటిక్ డిఫాల్ట్‌లలో ఇవి ఉంటాయి:
18 ఏళ్లలోపు వయస్సు ఉన్న టీనేజ్ పిల్లల కోసం వ్యక్తిగత ఖాతాలు. 16 ఏళ్లలోపు వయస్సు గల టీనేజ్ పిల్లలు ఈ సెట్టింగ్‌లను మార్చాలంటే, వారి తల్లిదండ్రుల అనుమతి అవసరం
మెసేజ్ నియంత్రణలు ఎంపికతో టీనేజ్ పిల్లలు తమకు ఎవరెవరు DMలు పంపగలరు మరియు గ్రూప్ చాటింగ్‌లను వారిని యాడ్ చేయగలరు అనే వాటిని పరిమితం చేయవచ్చు, ఇది వారిని ఫాలో అయ్యే వ్యక్తుల నుండి మాత్రమే మెసేజ్‌లను స్వీకరించే ఎంపికను వారికి అందిస్తుంది
DM పరిమితులు అంటే వారు ఫాలో అయ్యే వ్యక్తులు లేదా వారు ఇప్పటికే కనెక్ట్ అయిన వ్యక్తులు మాత్రమే వారికి మెసేజ్ పంపగలరు లేదా వారిని గ్రూప్ చాటింగ్‌లకు యాడ్ చేయగలరు
పర్యవేక్షణ ఎంపికను ప్రారంభించినట్లయితే, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు:
వారి ఖాతా గోప్యత, మీ టీనేజ్ పిల్లలు ఎవరికి మెసేజ్ పంపగలరు మరియు గ్రూప్ చాటింగ్‌లకు వారిని ఎవరు యాడ్ చేయగలరు వంటి ఖాతా గోప్యతా సెట్టింగ్‌లను చూడగలరు
టీనేజ్ పిల్లలు Instagramలో గడిపే సమయం పట్ల సానుకూలమైన భావనను పొందడంలో మేము సహాయం చేయడం ముఖ్యం. మేము ఇలాంటి టూల్‌లతో వారికి సపోర్ట్ అందిస్తాము:
ప్రత్యామ్నాయ అంశం పలకరింపులు , వీటి ద్వారా ఇతర అంశాలపై అవగాహనను ప్రోత్సహించడం కోసం వారి దృష్టిని మళ్లించడానికి వారిని ప్రాంప్ట్ చేస్తూ, నోటిఫికేషన్‌లను పంపుతాము
మ్యూట్ ఎంపికతో, వారు పోస్ట్‌లు మరియు స్టోరీలను స్వీకరించకూడదనుకునే ఖాతాలను నిశ్శబ్దం చేయగల సౌలభ్యం వారికి ఉంటుంది
వారి పోస్ట్‌లపై మరియు స్క్రోల్ చేస్తున్నప్పుడు వారు చూసే పోస్ట్‌లపై వచ్చిన లైక్‌ల సంఖ్యను దాచడం
ఎవరైనా ఆహార రుగ్మతలు లేదా తమను తాము గాయపరచుకోవడానికి సంబంధించిన కంటెంట్ కోసం వెతుకుతున్నట్లయితే, మేము సహాయకరమైన నిపుణుల మద్దతు గల వనరులను షేర్ చేస్తాము