Meta
పర్యవేక్షణ
Facebook మరియు Messenger
Instagram
వనరుల

టీనేజర్‌లలో ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యాన్ని పెంపొందించడంలో గల ప్రాముఖ్యత

సైబర్ వేధింపుల పరిశోధన కేంద్రం

సమీర్ హిందూజా & జస్టిన్ డబ్ల్యూ. ప్యాచిన్ వ్రాసినది

జూన్ 13, 2022

  • Facebook చిహ్నం
  • సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్ X చిహ్నం
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
ప్రకాశవంతమైన ఇండోర్ ప్రదేశంలో చేతులు కట్టుకుని నవ్వుతూ, నిలబడి ఉన్న నీలం రంగు జుట్టు గల టీనేజర్.
ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం అంటే “ప్రతికూల పరిస్థితులను అధిగమించగల, వాటి నుండి పుంజుకోగల, అందుకు తగినట్లు విజయవంతంగా మార్చుకోగల, అలాగే తీవ్రమైన ఒత్తిడి... లేదా సులభంగా చెప్పాలంటే నేటి ప్రపంచం యొక్క ఒత్తిడికి గురైనప్పటికీ సామాజిక మరియు విద్యాపరమైన పోటీతత్వాన్ని వృద్ధి చేసుకోగల సామర్థ్యం.”1 యువత ఎదుగుతున్నప్పుడు వారి పాఠశాల విద్యలో, వారి ఆరోగ్యంలో మరియు వారి సామాజిక జీవితాలలో నిస్సందేహంగా ప్రతికూలతను ఎదుర్కొంటారు. దురదృష్టవశాత్తూ, ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం ప్రాముఖ్యత తరచుగా విస్మరించబడుతుంది. జీవితంలో వివిధ పోరాటాలు ఉంటాయి, వాటిలో అనేకం సంబంధితంగా ఉంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎటువంటి కష్టం తెలియకుండా రక్షించుకోవాలనుకుంటారు, వారికి తోడుగా నిలవడానికి బదులు వారి తరఫున మాట్లాడుతారు, అలాగే కష్టమైనప్పటికీ వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సందర్భాలు రాకుండా అడ్డుపడతారు. ప్రతి సందర్భంలోనూ ఇలా చేయడం వల్ల మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయిలను ప్రమాదంలోకి నెట్టివేయవచ్చు – మరియు వారు పెరిగి పెద్దవారయ్యే సమయానికి వారికి తగిన సామర్థ్యం ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ వారితో మంచిగా ఉంటారనే భ్రమలో ఇది జరగదు.
బ్యాక్‌గ్రౌండ్‌లో రంగురంగుల లైట్లు అస్పష్టంగా వెలుగుతూ ఉండగా స్క్రీన్ యొక్క నీలిరంగు కాంతి ఫోకస్‌తో ప్రకాశిస్తున్న టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి.

ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం, అలాగే సైబర్ వేధింపులపై పరిశోధన



మా పరిశోధనలో2 టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి ఎంత ఎక్కువ ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం ఉంటే, సైబర్ వేధింపుల వల్ల వారు గణనీయంగా ప్రభావితమయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని మేము కనుగొన్నాము. అదనంగా, తప్పుగా ప్రవర్తించడాన్ని ఎదుర్కొన్నప్పుడు విద్యార్థులు చేయాలని తల్లిదండ్రులు, సంరక్షకులు కోరుకునే అన్ని పనులను అధిక స్థాయిలలో స్థితిస్థాపకత కలిగిన టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు చేసారు. వారు దీన్ని పాఠశాలలో రిపోర్ట్ చేసారు. వారు దీన్ని సైట్/యాప్‌లో రిపోర్ట్ చేసారు. వారు తమ స్క్రీన్ పేరుని మార్చుకుని, దూకుడుగా ప్రవర్తించినవారిని బ్లాక్ చేసారు లేదా లాగ్ అవుట్ అయ్యారు. మరోవైపు, సైబర్ వేధింపులకు గురైనప్పుడు అత్యల్ప స్థాయిలలో స్థితిస్థాపకతను కలిగి ఉన్నవారు ఏమీ చేయలేదు.

ప్రతికూలతను తిరిగి ఫ్రేమ్ చేయడం ద్వారా స్థితిస్థాపకతను పెంపొందించడం



మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి వారి సోషల్ మీడియా ఖాతాలో బాధాకరమైన కామెంట్‌లను అందుకున్నారనుకోండి. బహుశా డిఫాల్ట్‌గా, టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి కుంగిపోవచ్చు, అలాగే తాము “పరాజితులు” అని, అందుకే తమను ఎంచుకుంటున్నారని, అలాగే జీవితంలో వేధింపులకు గురి కావడం ఎంతో ఎక్కువగా ఉంటుందని వారికి వారే చెప్పుకోవడం ప్రారంభిస్తారు, ఇంకా వారి పట్ల చాలా మంది వ్యక్తులకు ఉన్న అభిప్రాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఏమి జరిగిందనే దాని గురించి ఆలోచించి, దాన్ని సానుకూల పద్ధతిలో పరిష్కరించడం అనేది వారికి ఉత్తమం. తమను సైబర్ బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తి గురించి వారు తమకు తామే ఇలా చెప్పుకోవచ్చు, ఉదాహరణకు, వారి స్వంత అభద్రతా భావాలు, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే ఇతరులను ఏడిపించడం ద్వారా మాత్రమే వారి స్వంత జీవితం విషయంలో కొంత ఉపశమనం పొందగలరు. దూకుడుగా ప్రవర్తించిన వ్యక్తి అభిప్రాయం, చర్యలకు సుదీర్ఘకాలంలో అంత ప్రాముఖ్యత లేదని తమకు తామే గుర్తు చేసుకోవచ్చు, అలాగే వారి గురించి అతిగా ఆలోచిస్తూ మనశ్శాంతిని పాడుచేసుకోకూడదు.

అటువంటి సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులు కలగజేసుకుని, ఉద్దేశపూర్వక, వివేకవంతమైన సంభాషణలు జరపడం అనేది నిజంగా ఉపయోగకరంగా ఉండవచ్చు. నిష్పక్షపాతంగా చూసినప్పుడు టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల నమ్మకాలలో అర్థం లేని వాటిని గుర్తించడంలో వారికి మనం సహాయం చేయగలిగినప్పుడు, ఆరోగ్యకరం కాని ఆలోచన విధానాలను తిప్పికొట్టగల, అడ్డుకోగల, అలాగే వివాదం చేయగల నైపుణ్యాలు గల వారి టూల్‌బాక్స్‌కి మరిన్ని టూల్‌లను యాడ్ చేస్తాము.3 అప్పుడు వాటిని ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన వాటితో వారు రీప్లేస్ చేయవచ్చు. ఇది ప్రస్తుత, అలాగే భవిష్యత్తులో జీవితం పట్ల సానుకూల దృక్పథాలు, జీవన విధానాలను పెంపొందిస్తుంది.
థియేటర్ సీట్‌లో ఎర్రటి డ్రింక్ కప్పు పట్టుకుని కళ్లద్దాలు పెట్టుకుని నవ్వుతున్న టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి, పక్కనే మరికొందరు నవ్వుతున్నారు.

చలనచిత్రాలు, పుస్తకాలతో స్థితిస్థాపకతను సంరక్షకులు ఎలా పెంపొందించగలరు



ప్రత్యేకించి యువత, పాప్ సంస్కృతి, అలాగే మీడియా దాదాపుగా విడదీయరాని విధంగా అల్లుకుపోయినందున తల్లిదండ్రులు, సంరక్షకులు స్థితిస్థాపకతను బోధించడానికి చలనచిత్రాలు, పుస్తకాలను ఉపయోగించవచ్చు. మనము సహజంగా కథాకృతితో కనెక్ట్ అవుతాము, అలాగే మన జీవితం మొత్తంలో విన్న, చూసిన లేదా చదివిన గొప్పవాటితో మనలో గాఢమైన కదలిక వస్తుంది. చాలామంది పిల్లలు ప్రాథమిక పాఠశాలలో అద్భుత కథలు మరియు గ్రీకు పురాణాలు మొదలుకుని కౌమార దశ మరియు యుక్తవయస్సులో ఎదుగుతున్న సూపర్‌హీరోలు, జీవితంలోని తర్వాత భాగంలో క్రీడల నేపథ్యం గల మరియు యుద్ధ సంబంధ చలచిత్రాల ద్వారా ప్రభావితమయ్యారు, అలాగే ఈ కథలలో ప్రతి ఒక్కటీ వారి స్వంత జీవితాలలో గొప్ప కథగా చెప్పుకునేలా జీవించేందుకు వారికి ప్రేరణ అందించగలదు. వయస్సు స్థాయి వారీగా విభజించబడిన మా ఫేవరేట్‌లలో కొన్ని దిగువన అందించబడ్డాయి.

స్థితిస్థాపకతను బోధించడానికి చలనచిత్రాలు, కార్యక్రమాలు:

మాధ్యమిక పాఠశాల
  • ఫేసింగ్ ది జెయింట్స్
  • ఫైండింగ్ ఫారెస్టర్
  • గ్రేటెస్ట్ షోమ్యాన్
  • ది 33
  • ది ఫ్లోరిడా ప్రాజెక్ట్
  • ది రెస్క్యూ
హై స్కూల్
  • 127 గంటలు
  • ఎటిపికల్
  • క్రీడ్
  • పెంగ్విన్ బ్లూమ్
  • రాబిట్-ప్రూఫ్ ఫెన్స్
  • వెన్ దె సీ అజ్

స్థితిస్థాపకతను బోధించే పుస్తకాలు:

మాధ్యమిక పాఠశాల
  • ఎల్ డెఫో
  • ఫిష్ ఇన్ ఎ ట్రీ
  • సోర్టా లైక్ ఎ రాక్ స్టార్
  • ది బాయ్ హూ హార్నెస్డ్ ది విండ్
  • ది డాట్
  • ది హంగర్ గేమ్స్
హై స్కూల్
  • ఎ లాంగ్ వాక్ టు వాటర్
  • ఫాస్ట్ ట్రాక్ ఆన్ ఎ స్లో ట్రాక్
  • హాట్చెట్
  • ఆఫ్ హ్యూమన్ బాండేజ్
  • ది రూల్స్ ఆఫ్ సర్వైవల్
  • వర్లిగిగ్
టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఎదుర్కొనే ఏదైనా ఆన్‌లైన్ (లేదా ఆఫ్‌లైన్!) ప్రతికూలతను మరింత సానుకూల దృష్టిలో తిరిగి ఫ్రేమ్ చేయడంలో వారికి సహాయపడటం ద్వారా, అలాగే దృక్పథాలు, చర్యలు, జీవితాలను అనుకరించగల విజేతలకు సంబంధించిన కథనాలను అందించడం కోసం మీడియాను ఉపయోగించుకోవడాన్ని చేర్చుకోవడం ద్వారా స్థితిస్థాపకతను పెంపొందించడానికి తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ప్రాధాన్యతనివ్వడం మంచిది. అలా చేయడం వల్ల వారి ఆన్‌లైన్ అనుభవాలపై నియంత్రణను కలిగి ఉండటానికి మరియు హాని నుండి తమను తాము మెరుగ్గా రక్షించుకోవడానికి వారు సన్నద్ధం అవుతారు. అదనంగా, ఈ మార్గాలలో స్థితిస్థాపకతను పెంపొందించడం వలన మీ పిల్లల ఆత్మవిశ్వాసం, సమస్య పరిష్కార సామర్థ్యం, స్వయంప్రతిపత్తి మరియు ఉద్దేశ్య భావన శక్తివంతం చేయబడతాయి – ఇవన్నీ ఆరోగ్యవంతమైన యువత అభివృద్ధికి కీలకం.
1 హెండర్సన్, ఎన్., & మిల్‌స్టెయిన్, ఎమ్. ఎమ్. (2003). పాఠశాలల్లో స్థితిస్థాపకత: విద్యార్థులు మరియు విద్యావేత్తల కోసం దీన్ని సాధ్యమయ్యేలా చేయడం.
థౌజండ్ ఓక్స్, సిఎ: సేజ్ పబ్లికేషన్స్ (కార్విన్ ప్రెస్)
2 హిందూజ, ఎస్. & ప్యాచిన్, జె. డబ్యూ. (2017). బెదిరింపు మరియు సైబర్ బెదిరింపు బారిన పడకుండా నివారించడానికి యువతలో స్థితిస్థాపకతను పెంపొందించడం. చిన్నారి దుర్వినియోగం & నిర్లక్ష్యం, 73, 51-62.
3 ఆల్బర్ట్ ఎల్లిస్ యొక్క ABC (ప్రతికూలత, నమ్మకాలు మరియు పరిణామాలు) మోడల్ ఆధారితం. దయచేసి ఎల్లిస్, ఎ. (1991) చూడండి. రేషనల్-ఎమోటివ్ థెరపీ (RET) యొక్క సవరించిన ABC. జర్నల్ ఆఫ్ రేషనల్-ఎమోటివ్ అండ్ కాగ్నిటివ్-బిహేవియర్ థెరపీ, 9(3), 139-172.

ఫీచర్‌లు మరియు టూల్‌లు


                    Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు

                    Instagram లోగో
ఎవరినైనా మ్యూట్ చేయండి

                    Instagram లోగో
సున్నితమైన కంటెంట్‌ను నియంత్రించండి

                    Instagram లోగో
ఎవరినైనా పరిమితం చేయండి

సంబంధిత వనరులు

తల్లిదండ్రులు మరియు టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి మధ్య జరిగే సంభాషణ ఇలా ఉంది.
పర్యవేక్షణ వంటి టూల్‌లను ఉపయోగించడం అనేది డిజిటల్ యుగంలో పిల్లల పెంపకాన్ని ఎలా సులభతరం చేయగలదు
మరిన్ని వివరాలు చదవండి
సోఫాలో కూర్చుని, చేతిలో పట్టుకునే డిజిటల్ డివైజ్‌లను చూస్తున్న వయోజనులైన ఒక వ్యక్తి, అలాగే టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి.
AI గురించి మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో మాట్లాడేందుకు మీకు సహాయపడే, సంభాషణను ప్రారంభించే 11 ప్రాంప్ట్‌లు
మరిన్ని వివరాలు చదవండి
13 ఏళ్లు పైబడినవారికి సంబంధించిన రేటింగ్‌లను చూపుతున్న కంటెంట్ సెట్టింగ్‌ల ui స్క్రీన్.
టీనేజ్ పిల్లల కోసం Instagramలో 13 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల పిల్లల కంటెంట్ సెట్టింగ్‌లు
మరిన్ని వివరాలు చదవండి

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta భద్రతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల గైడ్Instagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
© 2026 Meta
భారతదేశం