మీ పిల్లల డిజిటల్ వ్యక్తిత్వం గురించి వారితో సంభాషణలను ప్రారంభించడం
Meta నుండి
14 ఏప్రిల్, 2023
మన పిల్లలతో బహిరంగంగా మరియు నిరంతరంగా సంభాషణలను జరపడం అనేది డిజిటల్ శ్రేయస్సును అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన భాగం. ఆ సంభాషణలో ఆన్‌లైన్ భద్రత ఒక ముఖ్యమైన భాగం కావాలి, అయితే భద్రత మాత్రమే కాకుండా డిజిటల్ సంరక్షణ యొక్క అన్ని భాగాలను చేర్చడానికి మనం మన సంభాషణలను విస్తృతం చేయాలి. మన జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికి అలాగే మన కమ్యూనిటీలను మెరుగుపరచుకోవడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చు అనే దానికి సంబంధించిన సంభాషణలను ఇది కలిగి ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సాంకేతికతను ఉపయోగించడం గురించి మాట్లాడటం, అలాగే కొత్త విషయాలను తెలుసుకోవడానికి మరియు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమాచార వనరులను త్వరగా కనుగొనగలగడం గురించి మాట్లాడటం ఇందులో ఉంటుంది. ఇది మన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కార్యకలాపాలను తగిన విధంగా బ్యాలెన్స్ చేసుకోవడం గురించి ఉంటుంది.
మనం మన ఇళ్లు మరియు పాఠశాలల్లో బోధించాల్సినటువంటి ఆరోగ్యవంతమైన డిజిటల్ పౌరులకు సంబంధించిన 5 సామర్థ్యాలును డిజిటల్ పౌరసత్వ కూటమి గుర్తించింది. మన పిల్లలు తమ సాంకేతిక వినియోగం పట్ల సమతుల్యతతో, అవగాహనతో, అందరినీ కలుపుకొని, నిమగ్నమై ఉండటంతో పాటు అప్రమత్తంగా ఉండటం నేర్చుకునేలా చేయడంలో సామర్థ్యాలు దృష్టి సారిస్తాయి. మీ కుటుంబం యొక్క డిజిటల్ సంస్కృతి గురించి ఆలోచిస్తున్నప్పుడు, పిల్లలు సంభాషణలో పాల్గొనడం మరియు వారి స్వంత డిజిటల్ అనుభవాలను ప్రతిబింబించే అవకాశాన్ని కలిగి ఉండటం ముఖ్యం. సమర్థవంతమైన డిజిటల్ సిటిజన్‌గా ఉండేందుకు గల లక్షణాలను అభ్యసించడం ఎందుకు ముఖ్యం అనే విషయం గురించి చర్చించండి. వర్చువల్ ప్రపంచంలోని తమ ప్రవర్తనలపై ఆధారపడి తమ జీవితంలోనూ అలాగే ఇతరుల జీవితాలలోనూ తాము తీసుకురాగల వ్యత్యాసాన్ని చూడడంలో వారికి సహాయపడండి.
ఒక కుటుంబంలోని సభ్యుల సాంకేతిక సంస్కృతిని మార్చడం అనేది ఒకసారి చర్చించడంతో జరగకపోవచ్చు, కానీ సంభాషణలను కొనసాగిస్తూ ఉండడం వలన జరగవచ్చు. మీరు ప్రారంభించడంలో సహాయపడటానికి, మీ స్వంత సంభాషణలను ప్రారంభించడంలో సహాయపడటానికి 5 డిజిటల్ పౌరసత్వ సామర్థ్యాలకు అలైన్ చేయబడిన కొన్ని సంభాషణ స్టార్టర్‌లు ఇక్కడ ఉన్నాయి;
సమతుల్యతతో కూడినవి
మీ నిర్దిష్ట యాప్‌లను ఉపయోగించడం నిలిపివేయడం మీకు కష్టతరం చేసే కొన్ని అంశాలు ఏమిటి?
ఏదైనా ఒక నిర్దిష్ట డిజిటల్ కార్యకలాపం మిమ్మల్ని మరింత ముఖ్యమైన ఇతర పనులను చేయకుండా నిరోధించిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
సాంకేతికతను ఉపయోగించడం నుండి విరామం తీసుకోవలసిన సమయం వచ్చినట్లు మీకు ఎలా తెలిసింది?
రోజులోని ఏయే సమయాలలో మనం మన పరికరాలను దూరంగా ఉంచవలసి ఉంటుంది?
ఏయే యాప్‌లు లేదా డిజిటల్ కార్యకలాపాలు మీరు సమయం వెచ్చించదగినవి అని మీరు ఎలా నిర్ణయిస్తారు?
అవగాహన కలిగి ఉండడం
ఇటీవలి కాలంలో మీరు ఆన్‌లైన్‌లో నేర్చుకున్న కొత్త విషయం ఏమిటి?
మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆన్‌లైన్‌కి వెళ్లడానికి మీరు ఇష్టపడే ప్రదేశాలు ఏవి?
ఆన్‌లైన్‌లో మనం కనుగొన్న సమాచారం తప్పుదారి పట్టించేదిగా లేదా సరి కానిదిగా ఉన్నప్పుడు, వాటిని గుర్తించకపోవడం వలన కలిగే ప్రమాదాలు ఏమిటి?
ఎవరైనా సరైనది కాని సమాచారాన్ని షేర్ చేసినప్పుడు మీరు ఎలా ప్రతిస్పందించవచ్చు?
మీరు ఏదైనా షేర్ చేసి, అది నిజమైనది కాదని తెలుసుకున్నట్లయితే, మీరు ఏమి చేయాలి?
సంఘటితం
మీరు ఆన్‌లైన్‌లో వ్రాసిన లేదా చెప్పిన ఏవైనా విషయాల గురించి ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా?
మీరు గౌరవించే ఎవరైనా మిమ్మల్ని నిరాశపరిచేలా ఆన్‌లైన్‌లో ఏదైనా చేయడం లేదా చెప్పడం ఎప్పుడైనా చూసారా?
ఆన్‌లైన్‌లోనైనా లేదా వ్యక్తిగతంగానైనా ఇతరులతో దయతో వ్యవహరించడం సులభం అని మీరు అనుకుంటున్నారా?
మీతో విభేదించిన వారి నుండి మీరు నేర్చుకున్న వాటి గురించి మీరు ఆలోచించగలరా?
మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో మినహాయించబడినట్లు లేదా తిరస్కరించబడినట్లు భావించారా?
ఎంగేజ్ కావడం
ఆన్‌లైన్‌లో మరొక వ్యక్తికి సహాయం చేసే అవకాశాన్ని మీరు ఎప్పుడైనా పొందారా?
మీరు మీ పాఠశాలలో ఏదైనా ఒక సమస్యను పరిష్కరించగలిగినట్లయితే, అది ఏమిటి?
ఆ సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయం చేయడానికి మీరు సాంకేతికతను ఎలా ఉపయోగించగలరు?
మీరు ప్రపంచాన్ని మెరుగుపరచగలిగే ఏదైనా కొత్త యాప్‌ని కనిపెట్టగలిగినట్లయితే, అది ఏమి చేస్తుంది?
కుటుంబ సభ్యుల జ్ఞాపకాలు మరియు స్టోరీలను క్యాప్చర్ చేయడంలో మీరు సాంకేతికతను ఎలా ఉపయోగించగలరు?
హెచ్చరిక
ఆన్‌లైన్‌లో ఎవరైనా ఒకరు మరొకరితో అసభ్యంగా ప్రవర్తించడాన్ని మీరు చూసినప్పుడు మీరు ఏమి చేస్తారు?
ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్ సురక్షితమైనది కాదని తెలిపే కొన్ని హెచ్చరిక సంకేతాలు ఏమిటి?
ఇతరులు ఎవరైనా ఏదైనా ఆన్‌లైన్‌లో చేయమని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీకు అసౌకర్యంగా అనిపించినట్లయితే మీరు ఏమి చేస్తారు?
ఆన్‌లైన్‌లో జరిగిన ఏదైనా విషయాన్ని గురించి మీరు ఆందోళన చెందుతున్నట్లయితే, ఎవరితో మాట్లాడడాన్ని మీరు సౌకర్యవంతంగా భావిస్తారు?
ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి కుటుంబ సభ్యులుగా మనం చేయవలసిన కొన్ని విషయాలు ఏమిటి?