రహస్యంగా ఉంచడం కాకుండా దాపరికం లేకుండా ఉండటాన్ని ప్రోత్సహించడం
నాకు అర్థమైంది. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు, మా అమ్మ దగ్గర చాలా విషయాలు దాచాను, ఎందుకంటే నా గురించి ఏమనుకుంటారో లేదా శిక్షిస్తారేమో అనే భయం ఉండేది. ఇప్పుడు నా టీనేజ్ పిల్లలకు అలాంటి పరిస్థితి ఉండకూడదనుకుంటున్నాను. అందుకే సామాజిక మాధ్యమం, గోప్యత, అలాగే ఆన్‌లైన్ సురక్షత వంటి క్లిష్టమైన అంశాల విషయంలో కూడా వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే నాతో చెప్పుకోవడానికి ఎలాంటి భయం లేకుండా సౌకర్యవంతంగా ఉండే వాతావరణాన్ని ఏర్పరచడానికి నేను చాలా ఎక్కువ కృషి చేస్తున్నాను.
ఉదాహరణకు, నా టీనేజ్ అమ్మాయి/అబ్బాయి ఏదైనా కొత్త యాప్‌కు సైన్ అప్ చేసుకోవాలనుకున్నప్పుడు, మేమిద్దరం కూర్చుని, అందులోని సెట్టింగ్‌లను కలిసి పరిశీలిస్తాము. గోప్యతా నియంత్రణలను సర్దుబాటు చేసే అవకాశాన్ని నేను వారికే ఇస్తాను, అలాగే యాప్‌ను ఉపయోగించడానికి వారు ఎలా ప్లాన్ చేసుకున్నారో వారినే చెప్పమంటాను. ఇన్‌పుట్ ఏమీ తీసుకోకుండా నియమాలు పెట్టడానికి బదులుగా, “నీ అభిప్రాయం ప్రకారం ఇందులో ఉండే అత్యంత పెద్ద ప్రమాదాలు ఏవి? నీకు వాటి నుండి రక్షణ ఉండేలా మనం ఎలా చూసుకోగలము?” అని వారిని అడిగాను ఇలా మాట్లాడటం వల్ల సంభాషణ అనేది “అమ్మ నా జీవితాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటోంది” నుంచి “మేము అన్నీ కలిసే చేస్తాము” అనే భావనకు మారుతుంది.
వయస్సు ఎందుకు ముఖ్యమైన అంశం
టీనేజ్ అనేది పూర్తిగా ఎదిగే, మార్పులు వచ్చే దశ. ఒక రోజు వారు యానిమేట్ చేసిన సినిమాలు చూస్తుంటే, మరో రోజు వారు ఆన్‌లైన్‌లో సామాజిక అంశాలపై చర్చించుకుంటూ ఉంటారు. డిజిటల్ స్పేస్‌లు అనేవి వారి వయస్సు మరియు ఎదుగుదల దశకు సరిపోయే విధమైన కంటెంట్, ఫీచర్‌లు మరియు ఇంటరాక్షన్‌లకు యాక్సెస్ అందిస్తూ, పరిణతి చెందుతున్న పరిపక్వతను ప్రతిబింబించాలి.
Meta క్రింది వాటి కోసం రూపొందించబడిన వయస్సు హామీ ప్రమాణాలను కలిగి ఉంది:
- తమ వయో సమూహం కోసం ఉద్దేశించబడని కంటెంట్ నుండి యువ యూజర్‌లను రక్షించడం.
- సరైన గోప్యతా సెట్టింగ్‌లు, రక్షణ అంశాలతో టీనేజ్ పిల్లలు తమ వయస్సుకు తగినట్లు వ్యక్తిగతీకరించిన అనుభూతులను పొందేలా చేయడం.
- వారి టీనేజ్ పిల్లల స్వేచ్ఛను కాలరాయకుండా వారి డిజిటల్ ఇంటరాక్షన్‌ల గురించి వివరాలు తెలుసుకుంటూ ఉండటంలో తల్లిదండ్రులకు సహాయపడటం.
అయితే ఇక్కడ ఒక సవాలు ఉంది: టీనేజ్ పిల్లలు తమ వయస్సు గురించి అడిగే విషయాన్ని అంత తీవ్రమైనదిగా చూడకపోవచ్చు. వారు దీన్ని మరొక అడ్డంకిగా లేదా అధ్వాన్నమైనదిగా అనుకోవచ్చు, తమ తల్లిదండ్రులు తమను నమ్మడం లేదని భావించవచ్చు. అందుకే మనము సంభాషణను ఫ్రేమ్ చేసే విధానం చాలా ముఖ్యం.
మీ టీనేజ్ పిల్లలు తమ అసలు వయస్సును అందించడం గురించి వారితో ఎలా మాట్లాడాలి
మనందరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉంటాయి — ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మన టీనేజ్ పిల్లలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, వారు అటూ ఇటూ చూడటం, నిట్టూర్చడం లేదా “అమ్మా/నాన్నా నాకు ముందే తెలుసు” అని చెప్పడం వంటివి చేస్తుంటారు. ఈ సంభాషణలు సాఫీగా సాగాలంటే, సమర్థవంతంగా పని చేసే కొన్ని పిల్లల సంరక్షణ వ్యూహాలు ఇక్కడ అందించబడ్డాయి:
1. అధికారం కాకుండా సానుభూతితో ముందుకు నడిపించండి
"ఇలా చేయడం సురక్షితం కాబట్టి నువ్వు దీన్ని చేయాలి" అని చెప్పడానికి బదులుగా ఇలా చెప్పి ప్రయత్నించండి:
"నువ్వు అందరితో కనెక్ట్ అయ్యి ఉండటంలో సామాజిక మాధ్యమం పెద్ద పాత్ర పోషిస్తోందని నాకు తెలుసు. సాధ్యమైనంత ఎక్కువగా నీ అభిరుచికి అనుగుణమైన, అనగా నీ వయస్సులోని పిల్లల కోసం రూపొందించబడిన అనుభూతిని నువ్వు పొందుతున్నట్లు నేను నిర్ధారించుకోవాలనుకుంటున్నాను."
ఇలా చెప్పడం వల్ల నియమాలు, నియంత్రణ నుండి సపోర్ట్, స్నేహపూరిత భాగస్వామ్యం వైపు వారి దృష్టి మళ్లుతుంది.
2. వారి అనుభవం గురించి మాట్లాడండి
టీనేజ్ పిల్లలు న్యాయం మరియు స్వయం ప్రతిపత్తి పట్ల శ్రద్ధ వహిస్తారు. మీరు ఇలా వివరించవచ్చు:
"ప్లాట్‌ఫామ్‌లకు నీ అసలు వయస్సు తెలిసినప్పుడు, నీ కోసం ఉద్దేశించబడిన కంటెంట్ నీకు చూపబడేలా చేయగలవు. అప్పుడు విచిత్రమైన ప్రకటనలు తక్కువగా కనిపిస్తాయి, పరిచయం లేని వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించడం తగ్గుతుంది, అలాగే మీకు మెసేజ్ పంపగల వారిపై ఎక్కువ నియంత్రణ ఉంటుంది."
ఇలా చెప్పడం వలన వయస్సు వెరిఫికేషన్ వారిని ఎలా రక్షిస్తుందనే విషయం మాత్రమే కాకుండా వారికి ఎలా ప్రయోజనం చేకూర్చుతుందనే విషయం హైలైట్ అవుతుంది.
3. వారి దృక్కోణం పట్ల సానుకూలంగా ఉండండి
టీనేజ్ పిల్లలు చాలా తెలివైనవారు. ఒకవేళ వారు "కానీ వ్యక్తులు తమ వయస్సు గురించి అబద్దాలు చెప్తారు" అని తిరిగి సమాధానమిస్తే, జరగబోయే పరిణామాల గురించి వివరించడానికి ముందు వారు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని, గుర్తించండి:
"నువ్వు చెప్పింది నిజమే — కొంతమంది అలా చేస్తారు. అయితే Meta వంటి కంపెనీలు ఆన్‌లైన్ స్పేస్‌లను సురక్షితంగా ఉంచడం కోసం తమ వయస్సును తప్పుగా సూచించే వారిని పట్టుకునేలా తమ సాంకేతికతలను మెరుగుపరుస్తున్నాయి. అంటే ఇది కేవలం ఒక వ్యక్తి కోసమే కాకుండా అందరి కోసం సామాజిక మాధ్యమాన్ని మెరుగైనదిగా చేయడానికి సంబంధించినది."
టీనేజ్ పిల్లలకు తమ భావాలను అవతలి వ్యక్తులు వింటున్నట్లు అనిపించినప్పుడు, వారు విషయాన్ని అక్కడితో ఆపివేయకుండా ఎంగేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది
ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులుగా మీ పాత్ర
మీ టీనేజ్ పిల్లలు చేసే ప్రతి క్లిక్‌ను మీరు పర్యవేక్షించాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి నిమిషం వారి చుట్టూ తిరగకుండా వారి డిజిటల్ ప్రపంచంలో ఎంగేజ్ అయి ఉండటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారిని కనిపెట్టుకుని ఉండటానికి ఇక్కడ కొన్ని తక్కువ శ్రమతో కూడిన మార్గాలు అందించబడ్డాయి:
-
మీ టీనేజ్ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాల విషయంలో మార్గనిర్దేశం చేయడం, అలాగే సపోర్ట్ చేయడంలో మీకు సహాయపడే టూల్‌ల కోసం వెతకడానికి కుటుంబ సభ్యుల ఖాతాల నిర్వహణ కేంద్రం ఉపయోగించండి.
- నిరంతరంగా సంభాషణలు జరుపుతూ ఉండండి — ఒకేసారి ఎక్కువగా "సాంకేతికత గురించి చర్చ" జరపడం కాకుండా క్రమం తప్పకుండా వారితో మాట్లాడుతూ ఉండండి.
-
మీరు సామాజిక మాధ్యమంలో బాధ్యతాయుతంగా ఎలా ఉంటారో వారికి చూపడం ద్వారా సానుకూల డిజిటల్ అలవాట్ల విషయంలో ఆదర్శంగా ఉండండి.
-
వారి అసలైన వయస్సును చూపేలా ఖాతాల కోసం రిజిస్టర్ చేసుకోమని లేదా వారి ఖాతాలను అప్‌డేట్ చేయమని మీ టీనేజ్ పిల్లలను ప్రోత్సహించండి.
Meta సురక్షితమైన డిజిటల్ స్పేస్‌లకు కట్టుబడి ఉంది, కాబట్టి తల్లిదండ్రులుగా మనమే వాటిన్నింటినీ గుర్తించి, పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఎలాంటి దాపరికాలు లేకుండా సంభాషణలు జరపడం ద్వారా, అలాగే మనకు అందుబాటులో ఉన్న టూల్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, మన టీనేజ్ పిల్లలు ఆన్‌లైన్‌లో సురక్షితమైన, వయస్సుకు తగిన అనుభవాన్ని పొందేలా చేయవచ్చు — ఇదంతా ఏ మాత్రం భారంగా అనిపించదు.
వ్యక్తిగత వివరాలు: డా. యాన్-లూయిస్ లాక్‌హార్ట్ బోర్డ్ ద్వారా ధృవీకరించబడిన పీడియాట్రిక్ సైకాలజిస్ట్, తల్లిదండ్రుల కోచ్, అలాగే 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన వక్త. డా. లాక్‌హార్ట్ ట్వీన్స్ మరియు టీనేజ్ పిల్లల బాధ్యతలతో సతమతమవుతున్న తల్లిదండ్రులు సంఘర్షణకు లోనవడం నుండి బాంధవ్యాన్ని పెంచుకునేలా సహాయపడటంలో గొప్ప కృషి చేసారు. ప్రయోగాత్మక వ్యూహాలు, కరుణతో మార్గనిర్దేశం చేయడం, అలాగే ఎలాంటి దాపరికాలు లేని కమ్యూనికేషన్‌పై దృష్టి సారించడం ద్వారా, తల్లిదండ్రులు నిరంతరంగా ఘర్షణలు లేకుండా తమ టీనేజ్ పిల్లలతో బలమైన బంధాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని ఆమె వారికి అందించింది. డా. లాక్‌హార్ట్ గురించి www.anewdaysa.comలో మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీ టీనేజ్ పిల్లలు కేవలం కొన్ని దశల్లోనే Meta అందించే యాప్‌లలో తమ పుట్టినరోజును చెక్ చేసుకోవచ్చు లేదా అప్‌డేట్ చేయవచ్చు. వారి వయస్సు వివరాలు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకోవడంలో వారికి సహాయంగా క్రింది మార్గదర్శకాలను అనుసరించండి.
Instagram
- మీ ప్రొఫైల్‌కు వెళ్లడం కోసం దిగువ కుడివైపున ఉన్న
ప్రొఫైల్ లేదా మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి. - ఎగువ కుడివైపున ఉన్న
మెను ఎంపికను ట్యాప్ చేయండి. - ఖాతాల కేంద్రం ట్యాప్ చేసి, ఆపై వ్యక్తిగత వివరాలు ట్యాప్ చేయండి.
- మీ పుట్టినరోజు సమాచారాన్ని మార్చడానికి పుట్టినరోజు లేదా పుట్టిన రోజు ఎంపికను ట్యాప్ చేసి, ఆపై ఎడిట్ చేయి ఎంపికను ట్యాప్ చేయండి.
Facebook మరియు Messenger
- Facebookలో ఎగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
- సెట్టింగ్‌లు మరియు గోప్యత ట్యాప్ చేసి, ఆపై సెట్టింగ్‌లు ట్యాప్ చేయండి
- ఖాతాల కేంద్రం ట్యాప్ చేసి, ఆపై వ్యక్తిగత వివరాలు ట్యాప్ చేయండి.
- పుట్టినరోజు ఎంపికను ట్యాప్ చేయండి.
- ఎడిట్ చేయి ఎంపికను ట్యాప్ చేసి, ఆపై మీ పుట్టినరోజును మార్చండి.
- మార్పును కన్‌ఫామ్ చేయడానికి సేవ్ చేయి ఎంపికను ట్యాప్ చేయండి.
Meta Horizon యాప్
- మీ ఫోన్‌లో, Meta Horizon యాప్‌ను తెరవండి.
- మీ Horizon ఫీడ్ ఎగువభాగంలో ఉన్న
మెను ఎంపికను ట్యాప్ చేయండి. - ఖాతాల కేంద్రం ట్యాప్ చేసి, ఆపై
వ్యక్తిగత వివరాలు ట్యాప్ చేయండి. - పుట్టినరోజు ట్యాప్ చేసి, ఆపై మీ పుట్టినరోజుకు పక్కనే ఎడిట్ చేయి ఎంపికను ట్యాప్ చేయండి.
- మీ పుట్టినరోజును ఎడిట్ చేసి, ఆపై సేవ్ చేయి ఎంపికను ట్యాప్ చేయండి.
- కన్‌ఫామ్ చేయి ఎంపికను ట్యాప్ చేయండి