స్క్రీన్ సమయాన్ని నిర్వహించడంలో టీనేజ్ పిల్లలకు సహాయపడేందుకు చిట్కాలు
మీ టీనేజ్ పిల్లల ఇంటర్నెట్ వినియోగం గురించి వారితో మాట్లాడటానికి ఉత్తమమైన మార్గమంటూ ఏ ఒక్కటీ లేనప్పటికీ, సంభాషణను ప్రారంభించడానికి మార్గాలు ఉన్నాయి. మీ టీనేజ్ పిల్లలపై స్క్రీన్ సమయం ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు మీరు గమనిస్తున్నట్లయితే, తగిన సమయంలో ఆ విషయాన్ని లేవనెత్తడం ద్వారా ప్రారంభించండి.
వారు ఆన్‌లైన్‌లో ఇప్పటికే వెచ్చించిన సమయం గురించి, అలాగే సామాజిక మాధ్యమాన్ని వినియోగించడం గురించి వారు ఏమనుకుంటున్నారో ముందుగా తెలుసుకోవడం ఉత్తమ పద్ధతి. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి, మీరు ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు:- మీరు ఆన్‌లైన్‌లో చాలా ఎక్కువసేపు గడుపుతున్నట్లు మీకు అనిపిస్తోందా?
- మీరు ఆన్‌లైన్‌లో గడిపే సమయం మిమ్మల్ని మీ ఇతర బాధ్యతలు నెరవేర్చకుండా అడ్డుకుంటోందా?
- మీరు గడిపే సమయం మీపై (శారీరకంగా లేదా మానసికంగా) ఎలాంటి ప్రభావం చూపుతోంది?
మొదటి రెండు ప్రశ్నలకు “అవును” అనే సమాధానాలు వస్తే, మీ టీనేజ్ పిల్లలు ఆన్‌లైన్‌లో గడిపే సమయం గురించి వారు ఏమనుకుంటున్నారనే దానిపై సూచన మీకు అందుతుంది. అక్కడి నుంచి, ఆ సమయాన్ని నిర్వహించడం కోసం మార్గాలను వెతికేందుకు మరియు ఆఫ్‌లైన్‌లో అర్థవంతమైన కార్యకలాపాలతో దాన్ని సమతుల్యం చేసేందుకు వారికి సహాయపడటాన్ని మీరు ప్రారంభించవచ్చు.మీరు ఇటువంటి ఫాలో-అప్ ప్రశ్నలు అడగవచ్చు:- ఉదయం ఎంతసేపటి వరకు మీరు మీ ఫోన్‌ను చెక్ చేయకుండా ఉండగలరు?
- అది లేకుండా మీరు పరధ్యానంగా లేదా ఆందోళనగా ఉన్నట్లుగా భావిస్తున్నారా?
- మీరు మీ స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు, మీరు ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ ఉంటారా?
- మీరు ఏ రకమైన ఆఫ్‌లైన్ కార్యకలాపాలను చేయడం మిస్ అవుతుంటారు?
- ఎక్కువ సమయం కావాలని మీరు భావించేది ఏదైనా ఉందా?