సాక్ష్యాలను సేకరించడం
జరిగిన విషయాలు మరియు ప్రమేయం వ్యక్తులకు సంబంధించి మీకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించండి. అనేక సందర్భాల్లో మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి తమను వేధిస్తున్న వారు అనామక వాతావరణంలో ఉన్నప్పటికీ లేదా తెలియని స్క్రీన్ పేరుతో ఉన్నప్పటికీ, వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటారు (లేదా కనీసం తమకు తెలుసని అనుకుంటారు). ఈ దుర్వినియోగం తరచుగా పాఠశాలలో జరుగుతున్న వాటితో ముడిపడి ఉంటుంది. అలా జరుగుతున్నట్లయితే, మీ సమస్యలతో అక్కడి నిర్వాహకులకు సంప్రదించి, పాఠశాల విధాన ఆవశ్యకాలకు అనుగుణంగా సంఘటన రిపోర్ట్ మరియు విచారణ ప్రారంభించబడినట్లు నిర్ధారించుకోండి. మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి సైబర్ వేధింపులకు గురవుతున్నట్లు నిరూపించే రుజువులుగా ఉండే సంభాషణలు, సందేశాలు, చిత్రాలు, వీడియోలు మరియు ఏవైనా ఇతర అంశాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు లేదా స్క్రీన్ రికార్డింగ్‌లను రూపొందించి, వాటిని సాక్ష్యంగా సమర్పించండి. విచారణ ప్రక్రియలో సహాయపడటానికి, అన్ని సంఘటనలకు సంబంధించిన రికార్డ్‌ని ఉంచుకోండి. అలాగే, సంఘటన ఎప్పుడు మరియు ఎక్కడ (పాఠశాలలో, నిర్దిష్ట యాప్‌లలో) జరిగిందనే విషయంతో పాటు (వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తులు లేదా సాక్షులుగా) ఎవరు ప్రమేయాన్ని కలిగి ఉన్నారు వంటి సంబంధిత వివరాలపై గమనికలు వ్రాసి ఉంచుకోండి.