సామాజిక మాధ్యమాన్ని సానుకూల మార్గాల్లో ఉపయోగించేలా తల్లిదండ్రులు తమ టీనేజ్ పిల్లలను ఎలా గైడ్ చేయగలరనే దానిపై అధ్యయనం చేస్తున్న సైకాలజిస్ట్‌గా, విద్యావేత్తగా మీలో చాలా మంది ఎదుర్కొన్న సవాళ్ల గురించి నేను విన్నాను. మీ టీనేజ్ పిల్లలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడం మరియు యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లలో నిరంతరం జరిగే మార్పులకు అనుగుణంగా ఉండేందుకు ప్రయత్నించడం మధ్య మీరు సతమతమవుతున్నట్లు అనిపించవచ్చు. అందుకే Instagram టీనేజ్ పిల్లల ఖాతాల కోసం వినియోగించడానికి సులభంగా ఉండే, కుటుంబాలకు సంబంధించిన విభిన్న అవసరాలకు మరింత సౌకర్యవంతంగా ఉండే, అలాగే బలమైన రక్షణలను అందించే సెట్టింగ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
సామాజిక మాధ్యమంలో తమ టీనేజ్ పిల్లలకు కనిపించే కంటెంట్ నిజంగా వయస్సుకు తగినట్లు ఉంటుందా అనే విషయంలో తల్లిదండ్రులకు ఆందోళన ఉండవచ్చు, అలాగే కొన్నిసార్లు ఇప్పటికే ఉన్న తల్లిదండ్రుల నియంత్రణలు గందరగోళంగా లేదా పరిమితంగా ఉన్నట్లు అనిపించవచ్చు. Instagram అందించిన ఈ అప్‌డేట్‌లు అనేవి PG-13 సినిమా రేటింగ్‌ల ఆధారంగా గైడ్ చేయబడిన అనుభవంలోకి టీనేజ్ పిల్లల ఖాతాలను డిఫాల్ట్‌గా మార్చడం ద్వారా, అలాగే వినియోగించడానికి సులభంగా ఉండే అదనపు నియంత్రణలను తల్లిదండ్రులకు అందించడం ద్వారా ఆ సమస్యలు రెండింటినీ పరిష్కరించేందుకు ఉద్దేశించబడ్డాయి. దిగువన మీరు కీలకమైన అప్‌డేట్‌లను, అలాగే మీ టీనేజ్ పిల్లలతో వాటి గురించి చర్చించడానికి సహాయపడే చిట్కాలను పొందవచ్చు.
ప్రతి కుటుంబం తమ టీనేజ్ పిల్లలను సురక్షితంగా ఉంచాలనుకుంటుంది, అయితే “తగిన విధంగా ఉండే” అంశాలు అనేవి ప్రతి టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి లేదంటే ప్రతి తోబుట్టువుకు ఒకే విధంగా ఉండవనే విషయం తల్లిదండ్రులకు కూడా తెలుసు. కుటుంబాలకు స్వంతంగా కొన్ని విలువలు ఉంటాయి, టీనేజ్ పిల్లలలో ఒక్కొక్కరూ ఒక్కో సమయంలో పరిణతి చెందుతుంటారు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు అందరి పిల్లలకు ఒకే నియంత్రణలు కాకుండా తమ టీనేజ్ పిల్లలు చూడగల వాటిని తగిన విధంగా మార్చుకునే సౌలభ్యం గల మరిన్ని ఆప్షన్‌ల కోసం అడిగారు. Instagram అందించే సరికొత్త సెట్టింగ్‌లు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే రూపొందించబడ్డాయి, ఇవి తల్లిదండ్రులు తమ టీనేజ్ పిల్లలతో కలిసి వాటిని నావిగేట్ చేస్తున్నప్పుడు వారికి మరిన్ని ఎంపికలు, మరింత విశ్వాసం, అలాగే మనశ్శాంతిని అందిస్తున్నాయి