సానుకూల చర్య తీసుకోవడం
ఉదాహరణకు మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి Instagramలో ఎవరినైనా బ్లాక్ చేయడం లేదా రిపోర్ట్ చేయడాన్ని కనుగొన్నట్లయితే, అది ఏదైనా సమస్య ఏర్పడి ఉండవచ్చనే దానికి మీకు మొదటి సంకేతం కావచ్చు. అయితే అది ఏదైనా మంచి జరిగిందనే దానికి కూడా సంకేతం కావచ్చు.
మంచి విషయం ఏమిటంటే: వారు ఎవరినైనా రిపోర్ట్ చేస్తే లేదా బ్లాక్ చేస్తే, ఇది ఒక సానుకూల చర్య అవుతుంది. ఇది తమను తాము రక్షించుకోవడానికి అందుబాటులో ఉండే టూల్‌లను ఉపయోగించడంలో వారి స్వీయ-అవగాహనను మరియు విశ్వాసాన్ని చూపుతుంది.
అందులో కల్పించుకుని, ఏమి జరిగింది మరియు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని అనుకోవడం సహజం. మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి సానుకూల చర్య తీసుకున్నట్లు గుర్తించి, మరిన్ని వివరాలు చెప్పవలసిందిగా డిమాండ్ చేయడం కంటే మీరు ఎంత సంతోషంతో ఉన్నారో వారికి చెప్పడం అనేది సంభాషణకు మంచి ప్రారంభం.