Meta
పర్యవేక్షణ
Facebook మరియు Messenger
Instagram
వనరుల

పర్యవేక్షణ వంటి టూల్‌లను ఉపయోగించడం అనేది డిజిటల్ యుగంలో పిల్లల పెంపకాన్ని ఎలా సులభతరం చేయగలదు

పేరెంజ్ జోన్ వ్యవస్థాపకులు, CEO అయిన విక్కీ షాట్‌బోల్ట్ వ్రాసినది

మే 12, 2026

  • Facebook చిహ్నం
  • సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్ X చిహ్నం
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
తల్లిదండ్రులు మరియు టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి మధ్య జరిగే సంభాషణ ఇలా ఉంది.
నేను పేరెంట్ జోన్ వ్యవస్థాపకులు, అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఇరవై సంవత్సరాలుగా డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ముందడుగు వేసేందుకు ఉత్తమ మార్గాలను కనుగొనడంలో తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం, అవకాశాలు మారుతూ ఉంటాయి, కొన్నిసార్లు కొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మన టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు సాంకేతికతను స్వీకరించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, అలాగే సరదా వాస్తవాలను కనుగొనడం వంటివి చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. వారు సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉన్నారని నిర్ధారించుకోవడం కత్తిమీద సాము లాంటిదే. అందుకే నేను ఇప్పటికే టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఉపయోగించే యాప్‌లలో మరింత ఆచరణీయంగా, తల్లిదండ్రులు నిర్వహించే టూల్‌లను చూస్తున్నాను—ఇవి Meta కుటుంబ సభ్యుల ఖాతాల నిర్వహణ కేంద్రంలో పర్యవేక్షణ ఎంపిక లాగా వారి స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేలా చేయడాన్ని సులభతరం చేసే టూల్‌లు.
ఒకే ఆహ్వానంతో, మీరు Instagram, Facebook, Messenger, అలాగే Meta Horizon అంతటా పర్యవేక్షణను సెటప్ చేయడంతో పాటు ఒక డ్యాష్‌బోర్డ్ నుండి ప్రతిదీ నిర్వహించగలరు. అంటే మీరు ఇటీవలి కనెక్షన్‌లను రివ్యూ చేయడం, గడిపిన సమయాన్ని పర్యవేక్షించడం, అలాగే పరిమితులను సెట్ చేయడం వంటివి అన్నీ ఒకే స్థలంలో చేయవచ్చు. మీరు, మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి కలిసి ఎంతమేరకు పర్యవేక్షణ సరైనదో నిర్ణయించండి.

తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది

పిల్లల పెంపకమే అసలైన విజయ రహస్యం అని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. సురక్షితంగా ఉండటానికి, వినోదం పొందేందుకు టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం, అలాగే ప్రవర్తనలను అభివృద్ధి చేసుకునే విషయంలో తల్లిదండ్రులు చేసే పనులు ఎంతో ముఖ్యం. కొన్నిసార్లు మనం దీన్ని డిజిటల్ ప్రపంచాన్ని తట్టుకోగల సామర్థ్యం అని పిలుస్తాము, కానీ తల్లిదండ్రులు ప్రతిరోజూ చేసే పనులను వివరించేందుకు నాకు ఇష్టమైన పదం 'ఆర్డినరీ మ్యాజిక్'. మీరు ఎలా చేసినప్పటికీ, మీ స్టైల్ ఏదైనప్పటికీ, మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి మార్గనిర్దేశం చేస్తూ, వారు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఎదిగేందుకు సహాయపడుతూ మీరు వెచ్చించే సమయం చాలా ముఖ్యమైనది, ప్రత్యేకమైనది; ఇది మ్యాజిక్‌లా పని చేస్తుంది. Meta ఇప్పటికే కొన్ని ముఖ్యమైన డిఫాల్ట్‌లను సెట్ చేసింది — టీనేజ్ పిల్లల ఖాతాలను ఆటోమేటిక్‌గా ప్రైవేట్ ఎంపికకు సెట్ చేయడం జరుగుతుంది, అపరిచితుల నుండి వచ్చే మెసేజ్‌లను పరిమితం చేయడం, అలాగే సున్నితమైన కంటెంట్ పరిమితం చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఖాతాల నిర్వహణ కేంద్రంలోని పర్యవేక్షణ టూల్‌లు సమయ పరిమితులు, కార్యకలాపానికి సంబంధించిన ఇన్‌సైట్‌లు, అలాగే మరిన్నింటితో ఆ పునాదిని పెంపొందించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

పర్యవేక్షణ, అలాగే సపోర్ట్

ఉత్తమ టూల్‌లు సంభాషణను రీప్లేస్ చేయవు, కానీ అవి సంభాషణను ప్రారంభించడాన్ని సులభతరం చేయగలవు, అలాగే మీరు నిర్ణయించుకున్న నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు వీలు కల్పిస్తాయి. డిజిటల్ యుగంలో పిల్లల పెంపకం అనేది భారం కాదు. తల్లిదండ్రులు నియంత్రణను కలిగి ఉండటానికి, వారి టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి స్వభావాన్ని బట్టి తగిన నిబంధనలు రూపొందించేందుకు, అలాగే అర్థవంతమైన ఆఫ్‌లైన్ సంభాషణలు జరిపేందుకు వీలుగా అందుబాటులో ఉన్న టూల్‌లు రూపొందించబడ్డాయి.

కలిసి ఉంటేనే బాగుంటుంది

వాస్తవానికి, సులభమైన సెటప్ ప్రక్రియ అనేది కేవలం ప్రారంభం మాత్రమే. తర్వాత రానున్నది క్లిష్టంగా ఉండవచ్చని నాకు తెలుసు. టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి ఆన్‌లైన్‌లో ఏమి చేస్తున్నారు, వారు ఎంత సమయం గడుపుతున్నారు, అలాగే సహేతుకమైన పరిమితి ఏమిటి అనే విషయాల గురించి వారితో మాట్లాడటం వల్ల వారు ప్రతికూలంగా ప్రతిస్పందించవచ్చు. టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల మనస్తత్వమే అలా ఉంటుంది. ఒక యువకుడికి తల్లిగా, అతను టీనేజ్‌లో ఉన్నప్పుడు గేమింగ్ కోసం ఎంత సమయం కేటాయించడం సమంజజసం అనే దాని గురించి మేమెంతగా మథనపడ్డామో నాకు ఇప్పటికీ గుర్తుంది. రోజంతా ఆడుకోవడం తనకి సరైనదే అనిపించేది, కానీ నా పరిమితులు వేరుగా ఉండేవి. పరస్పరం చర్చించుకుని, కలిసి ముందడుగు వేయడానికి ప్రయత్నించడం ముఖ్యం. మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి దృక్కోణాన్ని వివరించడానికి వారిని అనుమతించడం ద్వారా మీరు మరింత ఆలోచనాత్మకంగా స్పందించే వీలు కలుగుతుంది. తాము అన్యాయమైనవిగా భావించే విషయాలను వారు మీకు చెప్పినప్పుడు, మీరు ప్రతి అంశాన్ని విడివిడిగా చర్చించి పరిష్కరించే అవకాశం ఉంటుంది. తమ మాటలకు విలువ ఉంటుందని వారు భావించినప్పుడు, అలాగే మీ నిబంధనల వెనుక గల కారణాలను అర్థం చేసుకున్నప్పుడు, వారు వాటిని పాటించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

పరస్పర అవగాహన

పిల్లల పెంపకం అనేది ఎప్పుడూ సాఫీగా ఉండదు. అభిప్రాయభేదాలు తలెత్తుతాయి, ఒత్తిడితో కూడిన రోజులు ఉంటాయి — అవి పెంపకంలో ఒక భాగమే. మీ పనిని మరింత సులభతరం చేసేందుకు, నేను స్వయంగా పాటించి మంచి ఫలితాలను పొందిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

  • ఎప్పుడు ఆపివేయాలో తెలుసుకోండి. మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి స్పష్టంగా ఒత్తిడికి గురవుతున్నా లేదా ఆందోళన చెందుతున్నా, వేచి ఉండటమే ఉత్తమం. మీరు చెప్పాలనుకున్న విషయం ఎంత ముఖ్యమైనదైనా, సమయం అనుకూలంగా లేనప్పుడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అది ఎప్పుడో మీకు తెలుస్తుంది. ఆ సంభాషణ కార్లో కావచ్చు లేదా రాత్రి భోజన సమయంలోనైనా కావచ్చు. వారు ప్రశాంతంగా ఉండి, మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్న సమయాన్ని మాత్రమే ఎంచుకోండి. బలవంతం చేయవద్దు, ఎందుకంటే ఒత్తిడితో కూడిన చర్చలు దాదాపు ఎప్పుడూ విఫలమవుతాయి.
  • మీ మనస్సు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. తమ మాటలకు విలువ ఉంది అనే భావన టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలలో కలగడం చాలా అవసరం. కనీసం సందర్భానుసారంగా అయినా మీరు చూపే సయోధ్య, మీరు వారి మాటలను శ్రద్ధగా వింటున్నారని, అలాగే వారి దృక్కోణాన్ని అర్థం చేసుకుంటున్నారని నిరూపిస్తుంది. చర్చల్లో కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉండాలని, నేను తరచుగా కఠినమైన నిబంధనలతోనే నా ప్రతిపాదనను మొదలుపెట్టేదాన్ని!
  • పునరావృతం, పునరావృతం, పునరావృతం. మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి 13 ఏళ్ల వయసులో ఏది సరైనదో, 14 ఏళ్లు వచ్చేసరికి అది సరైనది కాకపోవచ్చు. సోమవారం నాడు వారికి ఆందోళన కలిగించిన విషయం బుధవారం నాటికి సమస్యగా అనిపించకపోవచ్చు. వారి డిజిటల్ అనుభవాల వారితో క్రమం తప్పకుండా చర్చించాలి, అలాగే టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలకు నిర్దేశించిన పరిమితులను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండాలి. సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయాలి, నియమాలను మళ్లీ పరిశీలించాలి. డిజిటల్ పేరెంటింగ్ అనేది వ్యాయామం లాంటిది. ఆశించిన ఫలితాల కోసం, దీనిని నిరంతరం కొనసాగించడం ఎంతో ముఖ్యం.

మనశ్శాంతి

మంచి విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మీరు విఫలమవుతున్నట్లు అనిపించినా, మీ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది. సరైన టూల్స్‌తో నియంత్రణను సాధించడం, టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో క్రమం తప్పకుండా మనసు విప్పి మాట్లాడటం, అలాగే మీ పెంపకానికి సంబంధించిన నైపుణ్యాలన్నింటినీ మేళవించడం ద్వారా మీరు తప్పక విజయం సాధిస్తారు. మీరు ఆచరణాత్మకమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే, యాప్‌ల అంతటా పరిమితులను విధించడం, అలాగే సంభాషణను కొనసాగించడంలో Meta పర్యవేక్షణ టూల్‌లు మీకు సహాయపడగలవు—అప్పటికీ విశ్వాసం, స్వతంత్రత కోసం అవకాశం కల్పిస్తుంది.
ఇది అంత సులభమైన విషయం కాదు, ముఖ్యంగా ఈ సవాళ్లను తల్లిదండ్రులు ఇంతకు ముందు ఎదుర్కొని ఉండాల్సిన అవసరం లేదు. డిజిటల్ పేరెంటింగ్ ప్లేబుక్ ఇప్పటికీ దాని మొదటి దశలోనే ఉంది. అదృష్టవశాత్తూ, మీకు సహాయపడే ఎన్నో అద్భుతమైన వనరులు Meta వారి 'కుటుంబ సభ్యుల ఖాతాల నిర్వహణ కేంద్రం'లో అందుబాటులో ఉన్నాయి, ఇందులో డిజిటల్ శ్రేయస్సు గురించి సంభాషణను మొదలుపెట్టే చిట్కాలు, పేరెంట్ గైడ్స్ వంటి మరెన్నో ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి, ఆ ప్రయాణాన్ని ఆనందించండి, ఎందుకంటే వారు చెప్పేది అక్షర సత్యం: వారు చాలా త్వరగా పెరిగి పెద్దవారవుతారు.

రచయిత వ్యక్తిగత వివరాలు

విక్కీ షాట్‌బోల్ట్ 40కి పైగా దేశాలలో కుటుంబాలు, యువతతో కలిసి పని చేస్తున్న పేరెంట్ జోన్ అనే నిపుణుల సంస్థకు వ్యవస్థాపకులు మరియు CEO.

ఫీచర్‌లు, టూల్‌లు

Instagram లోగో
రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయడం
Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు
Instagram లోగో
స్లీప్ మోడ్‌‌‌ని ప్రారంభించండి
Facebook లోగో
సమయ పరిమితులు సెట్ చేయండి

సంబంధిత వనరులు

ఒక చిన్నారి Meta Quest హెడ్‌సెట్ మరియు కంట్రోలర్‌లు ఉపయోగిస్తూ, VRని ఉపయోగించి ఆడుతూ ఉండగా ఇతరులు సోఫాలో ఉంటూ వారిని ఉత్సాహపరుస్తున్న దృష్టాంతం.
వర్చువల్ రియాలిటీకి కుటుంబ సభ్యుల మార్గదర్శకం
మరిన్ని వివరాలు చదవండి
బయట ప్రదేశంలో వెల్లకిలా పడుకుని ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తి, సమీపంలో ఇతరులు మాట్లాడుతున్నారు.
Facebook, అలాగే Messengerలలో టీనేజ్ పిల్లల ఖాతాలు: మీ టీనేజ్ పిల్లలను సురక్షితంగా ఉంచడంలో అంతర్నిర్మిత రక్షణలు ఏ విధంగా సహాయపడతాయి
మరిన్ని వివరాలు చదవండి
ఒకరి చుట్టూ మరొకరు చేతులు వేసుకుని నవ్వుతూ, కలిసి నిలబడి ఉన్న ఆరు మంది టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల 3D Meta అవతార్‌లు.
మార్గదర్శకం: మీ Meta అవతార్‌ని స్టార్‌గా వెలుగొందేలా చేయడం
మరిన్ని వివరాలు చదవండి

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta భద్రతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల గైడ్Instagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
© 2026 Meta
భారతదేశం