చిట్కా #4: కంటెంట్ గురించి ఎప్పుడు ఫిర్యాదు చేయాలి మరియు వినియోగదారులను ఎప్పుడు అన్‌ఫాలో చేయాలి లేదా బ్లాక్ చేయాలి వంటివి చర్చించండి
మీ టీనేజ్ పిల్లలు ఆన్‌లైన్‌లో ఉండకూడని కంటెంట్ లేదా ప్రవర్తనను ఎప్పుడైనా ఎదుర్కొన్నట్లయితే, వారి ఆన్‌లైన్ అనుభవాలను సురక్షితంగా మరియు సానుకూలంగా ఉంచుకోవడంలో సహాయపడగల టూల్‌లను ఉపయోగించే విధానం వారికి తెలుసని నిర్ధారించుకోండి.
Instagramలో, టీనేజ్ పిల్లలు ఖాతాలను బ్లాక్ చేయడం లేదా అన్‌ఫాలో చేయడం ద్వారా తమ అనుభవాన్ని నియంత్రించగలరు. యాప్ కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు సేవా నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్‌ను పరిశీలన కోసం ప్రపంచవ్యాప్త బృందాలకు ఫిర్యాదులను పంపి, వీలైనంత త్వరగా దానిని తీసివేసే విధంగా పని చేసే అంతర్నిర్మిత ఫిర్యాదు ఫీచర్‌లను కూడా Instagram కలిగి ఉంది.టీనేజ్ పిల్లలు తమను వేధిస్తున్న వారిని గమనిస్తూనే తమ ఖాతాను నిశబ్ధంగా రక్షించుకోగల సాధికారతను వారికి కల్పించేలా రూపొందించబడిన Instagramలోని ‘పరిమితం చేయండి’ ఫీచర్‌ను కూడా వారు ఉపయోగించవచ్చు. ‘పరిమితం చేయండి’ ఫీచర్ ప్రారంభించబడిన తర్వాత, వారు పరిమితం చేసిన వ్యక్తి నుండి వారి పోస్ట్‌లపై వచ్చే కామెంట్‌లు ఆ వ్యక్తికి మాత్రమే కనిపిస్తాయి. మీ టీనేజ్ పిల్లలకు వారు పరిమితం చేసిన వ్యక్తి కామెంట్ చేసినట్లు నోటిఫికేషన్‌లు కనిపించవు.Instagramలో కంటెంట్ గురించి ఫిర్యాదు చేయడం ఎలా అనే దాని గురించి ఇక్కడ మరిన్ని వివరాలు తెలుసుకోండి.చిట్కా #5: Instagramలో పర్యవేక్షణ సెటప్ చేయండి
మీ టీనేజ్ పిల్లల ఆన్‌లైన్ అలవాట్ల గురించి మీరు వారితో మాట్లాడిన తర్వాత, Instagramని నావిగేట్ చేయడంలో వారికి సహాయపడటానికి కలిసి ప్రణాళికను రూపొందించండి.
మీరిద్దరూ కలిసి అంగీకారానికి వచ్చిన దాని ఆధారంగా, Instagramలో తల్లిదండ్రుల పర్యవేక్షణ టూల్‌లను సెటప్ చేయడానికి వారితో కలిసి పని చేయండి. వారి ఫాలోవర్‌లు మరియు వారు ఫాలో చేసేవారి జాబితాలను చూడటానికి, రోజువారీ సమయ పరిమితులను సెట్ చేయడానికి మరియు వారు యాప్‌లో ఎంత సమయాన్ని గడుపుతున్నారో చూడటానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. అలాగే మీ టీనేజ్ పిల్లలు Instagramలో పోస్ట్ లేదా మరొక ఖాతా వంటి ఏదైనా కంటెంట్ గురించి ఫిర్యాదు చేసినట్లు వారు షేర్ చేసినప్పుడు, మీరు వాటిని చూడగలరు.చిట్కా #6: మీ Facebook ఖాతా కోసం గోప్యతా తనిఖీలు
గోప్యతా తనిఖీలు అనగా Facebookలో మీ యొక్క మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క గోప్యతా ప్రాధాన్యతలను పరిశీలించగల Meta కేంద్రం. మీరు పోస్ట్ చేసే వాటిని ఎవరెవరు చూడగలరు, సమాచారానికి ఏయే యాప్‌లు యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఎవరెవరు పంపగలరు మరియు మరిన్నింటిని పరిమితం చేయడం వంటి మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మీరు టూల్‌ని సర్దుబాటు చేయవచ్చు. శక్తివంతమైన పాస్‌వర్డ్ మరియు రెండు దశలలో ధృవీకరణ ప్రక్రియను ఉపయోగించడం ఎంత ముఖ్యమో గోప్యతా సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం కూడా ఎల్లప్పుడూ మంచి ఆలోచన. Facebook భద్రతా తనిఖీ వంటి టూల్‌లను ఉపయోగించి మీ టీనేజ్ పిల్లల సామాజిక ఖాతాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా ముఖ్యం. పాత పాస్‌వర్డ్‌లను మళ్లీ ఉపయోగించకుండా ఉండటం మరియు రెండు దశలలో ధృవీకరణ ప్రక్రియను ఉపయోగించడం వంటి మంచి భద్రతా పద్ధతులను కొనసాగించడానికి ఇది అదనంగా ఉంటుంది.చిట్కా #7: డివైజ్‌లు మరియు యాప్‌లలో తల్లిదండ్రుల నియంత్రణలను ప్రారంభించండి
మీ టీనేజ్ పిల్లల డివైజ్‌ను నిర్వహించడంలో మీకు మరింత సహాయం అవసరమైనట్లయితే, Android మరియు iOS డివైజ్‌లు రెండింట్లోనూ అందుబాటులో ఉన్న తల్లిదండ్రుల నియంత్రణలను పరిశీలించండి. మీరు యాప్ డౌన్‌లోడ్‌లను బ్లాక్ చేయడానికి, కంటెంట్‌ని పరిమితం చేయడానికి లేదా డివైజ్ సమయ పరిమితులను సెట్ చేయడానికి ఎంపికలను కనుగొనవచ్చు. మీ పిల్లల డివైజ్ సెట్టింగ్‌లను పరిశీలించి, అవి మీకు మరియు మీ టీనేజ్ పిల్లలకు సరిపోయే విధంగా సెట్ చేయబడినట్లు నిర్ధారించుకోండి.
మీ తల్లిదండ్రుల నియంత్రణ ఎంపికలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మీరు మీ టీనేజ్ పిల్లల యాప్‌ల సెట్టింగ్‌లను కూడా పరిశీలించవచ్చు. ఉదాహరణకు, తల్లిదండ్రులకు వారి టీనేజ్ పిల్లల ఫాలోవర్ మరియు ఫాలోయింగ్ జాబితాలను చూడగల, అలాగే సమయ పరిమితులను సెట్ చేయగల సౌలభ్యాన్ని అందించే పర్యవేక్షణ టూల్‌లు Instagramలో ఉన్నాయి.Instagram పర్యవేక్షణ టూల్‌ల గురించి ఇక్కడ మరిన్ని వివరాలు తెలుసుకోండి.చిట్కా #8: నిష్కపటంగా ఉంటూ విశ్వాసాన్ని ఏర్పరుచుకోండి
మీ టీనేజ్ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాన్ని గౌరవం మరియు స్పష్టతతో పర్యవేక్షించడమే ఉత్తమమైన మార్గం. యువతలో కొంతమంది ఇతరులతో పోలిస్తే ఎక్కువగా మోసపోయే ప్రమాదం ఉండవచ్చు, కనుక వారిని తల్లిదండ్రులు మరింత ఎక్కువగా గమనించాల్సిన అవసరం ఉండవచ్చు.
మీరు మీ టీనేజ్ పిల్లలను పర్యవేక్షిస్తున్నట్లయితే, దాని గురించి వారికి ముందుగానే తెలియజేయడం సహాయకరంగా ఉంటుంది. ఆ విధంగా, అందరూ ఒకే అభిప్రాయంపై ఉండటంతో పాటు వారి నమ్మకాన్ని వమ్ము చేసినట్లుగా ఎవరూ భావించరు.