Meta
© 2025 Meta
భారతదేశం

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్

సామాజిక మాధ్యమం & ఆత్మహత్య నిరోధం: సహాయాన్ని ఎలా కనుగొనాలి మరియు సహాయాన్ని ఎలా అందించాలి

Meta

మార్చి 12, 2024

  • Facebook చిహ్నం
  • సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్ X చిహ్నం
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని, నవ్వుతూ బయట నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు.
ఆత్మహత్య అనేది క్లిష్టమైన అంశం, అయితే మనం దాని గురించి మాట్లాడాలి. పెద్దవారి విషయంలో లాగానే, టీనేజ్ పిల్లలు ఈ భయంకరమైన దృగ్విషయానికి లోను కావచ్చు. టీనేజ్ పిల్లల జీవితంలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు మరియు ఇతర విశ్వసనీయ వ్యక్తులు అందరూ ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు, భావనలు లేదా ప్రవర్తనల సంకేతాలను అర్థం చేసుకునే విషయంలో కీలక పాత్ర పోషిస్తారు.

ఆత్మహత్య గురించి టీనేజ్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు సహాయకరమైన భాష.

ఈ సమస్య గురించి మీ టీనేజ్ పిల్లలతో మాట్లాడటం అంత సులభం కాదు, అయితే మీరు ఆ సంభాషణ జరుపుతున్నప్పుడు (లేదా వారు ఆ విషయాన్ని లేవనెత్తినప్పుడు), ఆ విషయాన్ని దాటవేయవద్దు.

సహాయకరమైన మార్గంలో సమస్యలను ఫ్రేమ్ చేసేలా ఎల్లప్పుడూ జాగ్రత్త వహించండి. మీరు భాష మరియు సందర్భాన్ని ఉపయోగించే విధానం పట్ల చాలా జాగ్రత్త వహించండి. మీరు ఎంచుకునే పదాలు సంభాషణను లోతైన మార్గాల్లో ప్రభావితం చేయవచ్చు. మీ సంభాషణ ప్రారంభంలో ఆశ, కోలుకోవడం మరియు సహాయం కోరే కథనాలను ఉంచండి. వారి మనోభావాలను పంచుకోవడాన్ని సౌకర్యవంతంగా భావించే స్పేస్‌ను క్రియేట్ చేయండి. మీరు వారిని ప్రేమిస్తున్నట్లు మరియు ఎల్లప్పుడూ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారికి తెలియజేయండి.

యువతకు మానసిక ఆరోగ్య సేవల అందించడంపై దృష్టి సారించే సంస్థ అయిన మా భాగస్వామి ఆరిజన్ ద్వారా సమగ్రపరచబడిన మార్గదర్శకం నుంచి సహాయకరమైన భాషకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు దిగువన ఉన్నాయి. ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్‌లను గుర్తుంచుకోవడం ముఖ్యం:

సహాయకరమైన భాష

  • వ్యక్తి గురించి చెప్పేటప్పుడు “ఆత్మహత్య వల్ల చనిపోయారు” అని చెప్పేందుకు ప్రయత్నించండి (“ఆత్మహత్య చేసుకున్నారు” అని చెప్పడానికి బదులుగా – దిగువన సహాయకరమైన భాష యొక్క ఉదాహరణలు చూడండి).
  • ఆత్మహత్య సంక్లిష్టమైనదని మరియు ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని సూచించండి.
  • ఆశ మరియు కోలుకునే సందేశాలను చేర్చండి.
  • ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఉండగల ఇతరులు సహాయాన్ని ఎక్కడ మరియు ఎలా పొందగలరో వారికి చెప్పండి.
  • వారికి ఇష్టమైన పనులు చేయడం మరియు వారి స్నేహితులతో హ్యాంగ్ అవుట్ కావడంలో ఎంగేజ్ అయ్యేటటువంటి ఆత్మహత్య చేసుకోకుండా రక్షించడంలో సహాయపడే అంశాలపై సమాచారాన్ని చేర్చండి.
  • ఆత్మహత్యను నివారించవచ్చని, సహాయం లభిస్తుందని, దానికి సంబంధించిన చికిత్సలు విజయవంతమయ్యాని మరియు కోలుకోవడం సాధ్యమేనని సూచించండి.
  • తమ మనస్సులోని భావాల గురించి ఎవరితోనైనా మాట్లాడవలసిందిగా యువతను ప్రోత్సహించండి — అది స్నేహితులు కావచ్చు, విశ్వసించే పెద్దలు కావచ్చు లేదా ప్రొఫెషనల్ కావచ్చు.

దీనికి విరుద్ధంగా, సంభాషణను సరైన దిశలో మళ్లించని ఆత్మహత్య గురించి మాట్లాడే మార్గాలు ఉన్నాయి.

సహాయకరంగా ఉండని భాష

  • ఆత్మహత్యను నేరపూరిత చర్యగా లేదా పాపంగా వర్ణించే పదాలను ఉపయోగించవద్దు (“ఆత్మహత్య చేసుకున్నారు” అని చెప్పడానికి బదులుగా “ఆత్మహత్య వల్ల చనిపోయారు” అని చెప్పండి). ఇది ఎవరికైనా తాము తప్పుగా భావించడం లేదా ఆమోదయోగ్యం కాదని సూచించవచ్చు లేదా తాము సహాయం కోరినట్లయితే వారి గురించి తప్పుగా అనుకుంటారని బాధపడవచ్చు.
  • సమస్యలు, జీవితంలో ఒత్తిళ్లు లేదా మానసిక ఆరోగ్య సమస్యలకు ఆత్మహత్య ‘పరిష్కారం’ అని చెప్పవద్దు.
  • అందంగా, రొమాంటిక్‌గా చూపే లేదా ఆత్మహత్యను ఆకర్షణీయంగా చూపే పదాలను ఉపయోగించవద్దు.
  • ఆత్మహత్యను తేలికగా చూపే లేదా తక్కువ సంక్లిష్టంగా అనిపించే పదాలను ఉపయోగించవద్దు.
  • ఒక సంఘటనను నిందించవద్దు లేదా వేధింపులు లేదా సామాజిక మాధ్యమం వినియోగం వంటి ఒకే కారణం వల్ల ఆత్మహత్య జరిగిందని చెప్పవద్దు.
  • అపోహలు, కళంకం, మూస పద్ధతులను బలపరిచే లేదా ఆత్మహత్య గురించి ఏమీ చేయలేమని సూచించే నిర్ణయాత్మక పదబంధాలను ఉపయోగించవద్దు.
  • వాస్తవమైన ఆత్మహత్య లేదా ఆత్మహత్యా ప్రయత్నం గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించవద్దు.
  • ఆత్మహత్య పద్ధతులు లేదా ఆత్మహత్య స్థానం గురించిన సమాచారాన్ని అందించవద్దు.
  • నిర్దిష్ట ప్రదేశంలో లేదా 'హాట్ స్పాట్'లో అనేక ఆత్మహత్య ప్రయత్నాలు జరిగినా తెలియజేయవద్దు.
హూడీ ధరించి, లోపలి ప్రదేశంలో కూర్చుని, ఫోన్ చూసుకుంటున్న వ్యక్తి.

సామాజిక మాధ్యమంలో టీనేజ్ పిల్లల్లో ఆత్మహత్యకు సంబంధించిన ప్రవర్తనను పరిశీలించండి


మీ టీనేజ్ పిల్లలు “నేను మాయమైపోవాలనుకుంటున్నాను” లేదా “నేను దీన్ని ముగించాలనుకుంటున్నాను” వంటివి చెప్తుంటే అది ఆత్మహత్యకు సంబంధించిన ప్రవర్తనకు హెచ్చరిక సంకేతం. ఇవి వారు నిరాశ నిస్పృహలలో ఉన్నట్లు లేదా ఇతరులకు భారంగా ఉన్నారని బాధపడుతున్నట్లు సూచించవచ్చు. వారు సాధారణంగా చేసే విషయాల పట్ల ఆసక్తిని కోల్పోయి ఉండవచ్చు లేదా ఆవేశంలో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండవచ్చు.

ఆరిజన్ సంస్థ హైలైట్‌ చేసిన విధంగా, యువకుడు/యువతి ఆత్మహత్యకు పాల్పడవచ్చని తెలియజేసే ఇతర సంకేతాల్లో ఇవి ఉండవచ్చు:

  • అతను/ఆమె తమను తాము గాయపరచుకునేలా లేదా ఆత్మహత్య చేసుకునేలా బెదిరించడం
  • ఆత్మహత్య చేసుకోవడం ద్వారా చనిపోవడానికి మార్గాల కోసం వెతకడం (ఉదా. మాత్రలు, ఆయుధాలు లేదా ఇతర మార్గాల లభ్యతను కోరడం)
  • ఉద్దేశ్యపూర్వకంగా అతను/ఆమెను గాయపరచడం (అంటే, రక్కడం, కోయడం లేదా కాల్చడం ద్వారా)
  • మరణం, చనిపోవడం లేదా ఆత్మహత్య గురించి మాట్లాడటం లేదా వ్రాయడం
  • నిస్సహాయత
  • ఆవేశం, కోపం, ప్రతీకారం తీర్చుకోవడం
  • నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదా ప్రమాదకర కార్యకలాపాలలో పాల్గొనడం, ఆలోచనలేనట్లు కనిపించడం
  • బయటపడేందుకు మార్గం లేకుండా చిక్కుకుపోయినట్లు భావించడం
  • ఆల్కహాల్ లేదా డ్రగ్ వినియోగాన్ని పెంచడం
  • స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సమాజానికి దూరంగా గడపడం
  • ఆతురత, ఆందోళన, నిద్ర లేదా ఆకలిలో మార్పులు
  • మానసిక స్థితిలో నాటకీయ మార్పులు
  • జీవించడానికి కారణం ఏదీ లేదు, జీవితంలో ఎటువంటి ప్రయోజనం లేదు

ఈ ప్రవర్తనను పరిశీలించే క్రమంలో, ఇవి తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు ఇతరులు ఆత్మహత్య ప్రవర్తన యొక్క సంకేతాలను చూపుతున్న టీనేజ్ పిల్లలకు సపోర్ట్‌గా తీసుకోగల చర్యలు.

టీనేజ్ పిల్లలకు సపోర్ట్ ఇవ్వడానికి తల్లిదండ్రులు తీసుకోగల చర్యలు:


మీ టీనేజ్ పిల్లలలో హెచ్చరిక సంకేతాలు కనిపించిన తర్వాత లేదా వారు మీతో మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పిన తర్వాత ఎలా ప్రారంభించాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు వారికి సపోర్ట్ ఇవ్వగల కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఫోర్‌ఫ్రంట్: ఆత్మహత్య నిరోధంలో ఆవిష్కరణ చేపట్టిన చర్యల ద్వారా సమాచారం అందించబడిన జాబితా.

  • సానుభూతి వ్యక్తం చేసి, వారు చెప్పేది వినండి. వారి బాధ వ్యక్తం చేస్తున్నప్పుడు బాగా శ్రద్ధగా వినండి. వారికి పరిస్థితులు మెరుగవుతాయని నచ్చజెప్పడానికి లేదా పరిష్కారాలు చెప్పడానికి ప్రయత్నించకండి; ఆ సమయంలో వారు చెప్పేది ఓపిగ్గా వినే వ్యక్తిని మాత్రమే వారు కోరుకుంటారు. వారికి అర్థమయ్యేలా చేయండి, అంతేగానీ వారికి తప్పొప్పుల గురించి తీర్పులు ఇవ్వవద్దు. వారి భావాలు వ్యక్తపర్చగలిగే లాంటి ప్రశ్నలు అడగడం ద్వారా వారి ఆలోచనా విధానం పసిగట్టడానికి ప్రయత్నించండి, ఉదాహరణకు “నువ్వు ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్లున్నావు. కాసేపు మాట్లాడుకుందామా? మీరు ఎలా భావిస్తున్నారనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.”
  • ఆత్మహత్య గురించి అడగండి. "ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నావా?" అని వారిని సూటిగా మరియు స్పష్టంగా అడగడం ద్వారా, మీరు వారిపై ఎంతటి శ్రద్ధని కనబరుస్తున్నారో మరియు వారు ఎంత ఒత్తిడిలో ఉన్నారో మీకు అర్థమైనట్లు వారికి తెలిసేలా చేయవచ్చు. మీరు ఎవరినైనా సూటిగా అలా ప్రశ్నించడం వలన ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదమేమీ ఎక్కువ కాదు. “అవును, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను,” అని చెబితే, కంగారు పడకండి. మీకు ఈ విషయం చెప్పడానికి వారికి ఎంతో ధైర్యం చేయాల్సి వచ్చిందని చెప్పి, సంభాషణను పొడిగించండి. వారు ఎదుర్కొంటున్న బాధల గురించి చెప్పేలా సంభాషణను పొడగించడం వలన వారు ఒంటరితనంలో ఉన్నారనే భావనను తగ్గించవచ్చు.
  • ప్రమాదాన్ని తీసివేయండి.వారు ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నట్లు చెబితే, వారి దగ్గర ఏదైనా పథకం ఉందేమో అడగండి. వారు అవును అని చెబితే, మత్తు పదార్థాలు, ఆయుధం లేదా తాడు వంటివి ఏవైనా వారికి అందుబాటులో ఉన్నాయేమో తెలుసుకోండి. వారికి ఈ వస్తువులను దూరం చేయడానికి మీ శాయశక్తులా కృషి చేయడం లేదా ఇతర స్నేహితుల సహాయం తీసుకోవడం లేదా పోలీసులకు సమాచారం అందించడం వంటివి ముఖ్యంగా చేయాలి.
  • వారు తదుపరి సంరక్షణ స్థాయిని పొందడంలో సహాయపడండి. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం చాలా ముఖ్యం, అంతేకాకుండా మీరు వారిని సలహాదారు, వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లడం లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించేలా ప్రోత్సహించడం చేయవచ్చు.
    ఆత్మహత్య నిరోధం
    జాతీయ ఆత్మహత్య నిరోధక లైఫ్‌లైన్ 1-800-273-8255
    సంక్షోభ సంరక్షణ టెక్స్ట్ ‌లైన్ 741-741

ప్రమాదకరమైన ఆన్‌లైన్ "సవాళ్ల"కు ప్రతిస్పందించడం


ఆన్‌లైన్ “ఆత్మహత్య సవాళ్లు” లేదా “గేమ్‌ల”లో సాధారణంగా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయవలసిందిగా వ్యక్తులకు అందించే హానికరమైన పనులు ఉంటాయి, తరచుగా వాటి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ సవాళ్లు Meta విధానాలకు విరుద్ధంగా ఉంటాయని చర్చించే కంటెంట్. Meta ఈ కంటెంట్‌ను తీసివేస్తుంది మరియు కొన్ని పరిస్థితులలో దీన్ని పోస్ట్ చేసిన ఖాతాలను కూడా మేము తీసివేయవచ్చు.

మీ టీనేజ్ పిల్లలు ఈ రకమైన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని మీరు చూసినట్లయితే (లేదా దాన్ని సహవిద్యార్థులు షేర్ చేయడాన్ని తాము చూసినట్లు వారు మీకు చెబితే), తర్వాత ఏమి చేయాలో ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి:

  • ప్రమాదాన్ని అర్థం చేసుకోండి. ప్రమాదాన్ని తప్పించవద్దు. ఈ కంటెంట్‌ను వ్యాపింపజేయడాన్ని ఆపివేయడంలో అందరికీ బాధ్యత ఉంది.
  • యాక్టివ్‌గా వినండి. యుక్తవయస్సులోని వారికి తాము ఆన్‌లైన్‌లో చూసిన విషయాలపై లేదా స్నేహితులు లేదా ఇతరులు చేసిన పోస్ట్‌లు లేదా కామెంట్‌లపై ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలను వ్యక్తం చేస్తే, వాటిని విని, సపోర్ట్‌ చేయడం ముఖ్యం.
  • ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోండి. ఆన్‌లైన్‌లో స్వీయ-హాని మరియు ఆత్మహత్య సవాళ్ల గురించి హెచ్చరికలను ఫార్వార్డ్ చేయడం కూడా కొందరు వ్యక్తులకు కనిపించవచ్చు. వ్యక్తులకు సమాచారం అందించడం చాలా ముఖ్యం, అయితే ఆత్మహత్య అంశానికి సంబంధించి మీరు ఏమి షేర్ చేస్తారు మరియు అది ఇతరులను ఎలా ప్రభావితం చేస్తుందో దయచేసి గుర్తుంచుకోండి.
  • దాన్ని రిపోర్ట్ చేయండి. సామాజిక మాధ్యమం ఛానెల్‌లకు హానికరమైన లేదా బాధ కలిగించే అనుచితమైన ఆన్‌లైన్ విషయాలను ఎవరైనా రిపోర్ట్ చేయవచ్చు. ప్లాట్‌ఫామ్‌లు సమీక్షించి, తమ విధానాలకు సంభావ్యంగా విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను తీసివేయగలవు.
  • దాని గురించి మాట్లాడండి. మీకు టీనేజ్ పిల్లలు ఉంటే (లేదా యువతతో కలిసి పని చేస్తే), వారి ఆన్‌లైన్ కార్యాచరణ గురించి వారితో మాట్లాడే మార్గాలను కనుగొనండి, తద్వారా వారు ఏమి చేస్తున్నారో లేదా చూస్తున్నారో షేర్ చేసుకునేలా ప్రోత్సహించండి. సవాలు గురించి నేరుగా అడగడం కుదరకపోతే, కనుగొనడానికి మరిన్ని పరోక్ష మార్గాలను ప్రయత్నించండి. యువత తమ తల్లిదండ్రులను విశ్వసించవచ్చని మరియు నిజాయితీగా ఉన్నందుకు శిక్షించబడరని తెలుసుకోవాలి.

వనరులు


Metaకి సంబంధించిన ప్రోడక్ట్‌లలో శ్రేయస్సు మరియు ఆన్‌లైన్ సురక్షతపై అదనపు ఆన్‌లైన్ వనరుల కోసం, మా ఆత్మహత్య నిరోధం కేంద్రం లేదా మా సురక్షత కేంద్రం చూడండి.

మా సాంకేతికతలను ఉపయోగించే వ్యక్తులకు మెరుగైన సపోర్ట్‌ అందించేందుకు, నైపుణ్యం కలిగిన ఈ సంస్థలతో Meta భాగస్వామిగా ఉంది:

యునైటెడ్ స్టేట్స్

జాతీయ ఆత్మహత్య నిరోధక లైఫ్‌లైన్ 1-800-273-8255
సంక్షోభ సంరక్షణ టెక్స్ట్‌ లైన్ 741-741

ఫీచర్‌లు మరియు టూల్‌లు

Instagram లోగో
రోజువారీ సమయ పరిమితి సెట్ చేయడం
Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు
Instagram లోగో
స్లీప్ మోడ్‌‌‌ని ప్రారంభించండి
Facebook లోగో
సమయ పరిమితులు సెట్ చేయండి

సంబంధిత వనరులు

ఆత్మహత్య గురించిన సంభాషణలకు తల్లిదండ్రులు మరియు సంరక్షకుల మార్గదర్శకం
మరిన్ని వివరాలను చదవండి
సానుకూల ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌ల గురించి టీనేజ్ పిల్లలతో మాట్లాడటం
మరిన్ని వివరాలను చదవండి
ఆన్‌లైన్‌లో సమతుల్యతను పాటించడం
మరిన్ని వివరాలను చదవండి
ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కోవడానికి చిట్కాలు
మరిన్ని వివరాలను చదవండి
ఆత్మహత్య మరియు స్వీయ గాయం వనరులు
మరిన్ని వివరాలను చదవండి
సంరక్షణ కోసం చిట్కాలు మరియు టూల్‌లు
మరిన్ని వివరాలను చదవండి
మానసిక ఆరోగ్య కేంద్రం
మరిన్ని వివరాలను చదవండి
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు