బేషరతుగా వారికి అండగా నిలబడండి
లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న యువతీయువకులు సమస్యలు ఎదురవుతాయేమోనని భయపడుతూ ఉండవచ్చు. వారి తల్లిదండ్రులు అవమానాల పాలవడం లేదా పాఠశాల నుండి సస్పెండ్ చేయడం, స్నేహితులు తమ గురించి తప్పుగా అనుకోవడం లేదా పోలీసులతో సమస్య తలెత్తడం వంటివి జరుగుతాయని భయపడుతూ ఉండవచ్చు. వేధింపులకు గురి చేసే వ్యక్తి వారిని ఆధీనంలో ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ భయాలను కలిగించి ఉండవచ్చు, చింతించాల్సిన విషయం ఏమిటంటే ఇలాగే జరుగుతుంది. ఈ భయాల వలన యువతీయువకులు నిశబ్దంగా ఉండిపోతారు, తత్ఫలితంగా అనుకోని ఫలితాలకు దారి తీయడం జరుగుతుంది.
మీకు భయం మరియు చిరాకు కలగడం సహజం, కానీ విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో ఎల్లప్పుడూ వారితో కలిసి ఉంటారని మీ టీనేజ్ పిల్లలకు తెలియజేయడం అవసరం. మీరు వారికి అండగా నిలబడతారనే విషయం వారికి తెలుసని మీరనుకున్నప్పటికీ, ఇలాంటి సంభాషణలు జరపడం వలన పరిస్థితులు బాగా లేనప్పుడు లేదా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మీతో వారి అనుభవాలను పంచుకునేలా వారిలో మార్పు తీసుకురావచ్చు.