మీ చిన్నారికి ప్రతిస్పందించడానికి మరియు వారికి సహాయం చేయడానికి 5 దశలు.
చాలా మంది చిన్నారుల జీవితాలలో డిజిటల్ టెక్నాలజీ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇది శిక్షణ, కనెక్షన్ మరియు వినోద ప్రపంచాన్ని తెరుస్తుంది. కానీ ఆన్‌లైన్‌లో ఉండటం కూడా ప్రమాదంతో కూడుకున్న విషయమే. చిన్నారులు ఆన్‌లైన్ బెదిరింపులు, వేధింపులను ఎదుర్కోవడం, అనుచితమైన కంటెంట్‌ను చూడడం లేదా వారు కలత చెందడం, అసౌకర్యం లేదా భయాన్ని కలిగించే ఇతర అనుభవాలను ఎదుర్కోవడం వంటివి జరగవచ్చు. మీ చిన్నారులు ఆన్‌లైన్‌లో ఇలాంటివి ఎదుర్కొన్నట్లయితే, వారికి సహాయం అందజేయడానికి మీరు తీసుకోగలిగే చర్యలకు సంబంధించిన ఐదు దశలు ఇక్కడ ఉన్నాయి.