టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎలా తెలుసుకుంటారు, క్రియేట్ చేస్తారు, అలాగే అన్వేషిస్తారనే విషయంలో AI అతిపెద్ద పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతున్నందున మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అడుగులు వేయడం తల్లిదండ్రులకు ఒక సవాలుతో కూడుకున్న విషయం. అయితే ఒక శుభవార్త, అదేమిటంటే మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో AI గురించి అర్థవంతమైన సంభాషణ జరపాలంటే మీరు ఆ సాంకేతికతలో నిపుణులుగా ఉండవలసిన అవసరం లేదు. మీకు ఆసక్తి, కొత్త విషయాలను స్వీకరించే తత్వం, అలాగే చెప్పేది వినగలిగే ఓర్పు ఉంటే చాలు. ప్రస్తుతం మీరు చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే సంభాషణను ప్రారంభించడం.సంభాషణను ప్రారంభించే ప్రాంప్ట్‌లను అభివృద్ధి చేయడానికి మేము సైబర్ వేధింపుల పరిశోధన కేంద్రంతో కలిసి పని చేసాము: AIతో మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి అనుభవాల గురించి వారితో స్నేహపూర్వక సంభాషణను ప్రారంభించడంలో సహాయంగా రూపొందించినటువంటి మీరు వారిని అడగగల వివరణాత్మక ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ప్రశ్నతో పాటు, దాని ఉద్దేశ్యాన్ని వివరించే మార్గదర్శకాలను, అలాగే ఆ విషయాన్ని పిల్లల వద్ద ఎలా ప్రస్తావించాలో తెలిపే సూచనలను కూడా అందించాము.
1. AI సహాయంతో మీరు పొందిన అత్యంత ఉపయోగకరమైన ప్రయోజనం ఏమిటి?
సానుకూలంగా ప్రారంభించండి. టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు సాంకేతికతను ఎలా ఉపయోగిస్తున్నారనే దాని గురించి వయోజనుల నుండి తగినన్ని సూచనలు పొందుతారు, కాబట్టి నిజమైన ఉత్సుకతతో సంభాషణను ప్రారంభించడం వలన సంభాషణ యొక్క పూర్తి వాతావరణాన్నే మార్చేస్తుంది. మీరు ఇక్కడ నిర్దిష్ట సమాధానాన్ని ఆశించడం లేదు. వినండి. ఒకవేళ మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలినా లేదా తమకు తెలియదని చెప్పినా, పాఠశాలకు సంబంధించి గానీ లేదా వారికి కలిగే ఏదైనా సందేహాన్ని తీర్చుకోవడానికి గానీ AI వారికి ఎప్పుడైనా సహాయం చేసిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే మీరు ప్రయత్నిస్తున్నారని వారికి తెలియజేయండి. ఆలోచనలను ప్రారంభించడంలో వారికి సహాయపడండి. వారు ప్రస్తావించే విషయాల వల్ల నిజానికి వారు ఈ టూల్‌లను ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి.2. AI కారణంగా ఎవరైనా ఆసక్తికరమైన పరిస్థితిలో పడినట్లు మీరు విన్నారా? పాఠశాలలో లేదా స్నేహితుల మధ్య ఇలాంటివి జరిగినట్లు విన్నారా?
మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయిని వారి స్వంత ఎంపికల గురించి నేరుగా అడగడం కంటే వారి స్నేహితులు లేదా సహవిద్యార్థుల గురించి విచారించడం అనేది దాదాపుగా ఎల్లప్పుడూ సులభంగా ఉంటుంది. చాలా మందికి స్వయంగా ఇలాంటివి ఎదురై ఉంటాయి లేకుంటే కనీసం వారి సహచరుల గ్రూప్‌లో ఇలాంటి కథ ఒకటైనా వినే ఉంటారు. మీరు దాన్ని పొందిన తర్వాత, దాని గురించి వారు ఏమనుకున్నారు, అలాగే వారు ఏమి చేసి ఉంటారో అడగవచ్చు. విద్యాపరమైన నిజాయితీ, వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోవడం లేదా AI సహాయం తీసుకోవడానికి బదులుగా ఒక వ్యక్తిని కలిసి సహాయం అడగాలి వంటి విషయాలను అన్వేషించడానికి ఇది ఒక సహజమైన స్థలం. మీరు వారిని విచారించడం లేదు. నేటి ఆన్‌లైన్ ప్రపంచంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, మారుతున్న ధోరణులపై మీరు నిజమైన ఆసక్తిని కలిగి ఉన్నారు.3. AI మిమ్మల్ని ఎప్పుడైనా అసౌకర్యానికి గురిచేసే లేదా చాలా వింతగా అనిపించే ఏదైనా విషయాన్ని చెప్పినట్లయితే, మీరు ఆ విషయాన్ని నాకు చెప్తారా?
ఇది మీరు అడగగలిగే అత్యంత ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి. వాస్తవానికి మీరు మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి మీ దగ్గరకు వచ్చేందుకు అనుమతిస్తున్నారు, అలాగే ప్రోత్సహిస్తున్నారు. ఆపై వెంటనే, మీరు ఆందోళన చెందడం లేదని వారికి చెప్పండి, మీరిద్దరూ కలిసి బాగా ఆలోచించి, తర్వాత ఏమి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికే ఈ విషయాన్ని అడుగుతున్నట్లు వారికి చెప్పండి. మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి మీకు అస్పష్టమైన సమాధానం ఇచ్చినా లేదా దానిని పట్టించుకోనట్లుగా వ్యవహరించినా, వారిని బలవంతం చేయకండి. ఆ విషయం గురించి మాట్లాడటం ఆపివేయండి. మీరు ఒక ఆలోచనకు పునాది వేశారు, దాని ఫలితం అప్పటికి కనిపించకపోయినప్పటికీ మీ ప్రయత్నం ఎంతో విలువైనది.4. మీరు AIకి ఎప్పటికీ చెప్పకూడదనుకునే విషయాలు ఏవైనా ఉన్నాయా? అంటే మీరు వ్యక్తిగతంగా ఉంచాలనుకునే విషయాల వంటివి?
చాలా మంది వ్యక్తులు దీని గురించి ఆలోచించలేదు. వారు ఆ సమయంలో లిగిన ఆలోచనల ప్రకారమే ఏ విషయాన్ని పంచుకోవాలో నిర్ణయించుకుంటారు, అలాగే ఆ సమయాలలో వారు ఎల్లప్పుడూ అత్యంత స్పష్టంగా ఆలోచించకపోవచ్చు. మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి తర్వాత భవిష్యత్తులో పశ్చాత్తాపపడేలా ఏదైనా విషయాన్ని పంచుకోకముందే ఇప్పుడే దాని గురించి చర్చించడం మంచిది. ముందుగా మీరే మొదలుపెట్టండి. సిస్టమ్‌లు సంభాషణలో మనం ముందుగా పంచుకున్న విషయాలను మళ్లీ గుర్తుంచుకోగలవని తెలిసి, మీరు AIలో టైప్ చేసేటప్పుడు వాటి గురించి ఎంత జాగ్రత్తగా మరియు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారో మీరు ప్రస్తావించవచ్చు. అలాగే మీరు వ్యక్తిగత సమయంలో ఒక బాట్‌తో మాత్రమే మాట్లాడుతున్నట్లు భావించడం సులభం, అయితే మీరు షేర్ చేసే విషయం ఇప్పటికీ ఎక్కడో ఒకచోట డేటా రూపంలో ఉంటుందని గుర్తుంచుకోవడానికి ఇది సహాయపడుతుంది, అలాగే ఆ విషయంలో విచక్షణతో వ్యవహరించడమే సరైన మరియు తెలివైన నిర్ణయం. ఆపై మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి ఆలోచనలను తెలుసుకోండి. ఇక్కడ తప్పు సమాధానాలు అంటూ ఏవీ ఉండవు, అలాగే చాలా మంది వ్యక్తుల విషయంలో ఇది వారి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మీకు కూడా అన్ని విషయాలు పూర్తిగా తెలియవని నిజాయితీగా చెప్పడం వల్ల, ఆ సంభాషణ మరింత సహజంగా ఉండి, అవతలి వ్యక్తికి దగ్గర కావచ్చు.5. నిజమైన వ్యక్తిని అడగడం కంటే AIని అడగడం చాలా సులభమని మీరు ఎప్పుడైనా భావించి, ఎప్పుడైనా దాని సహాయం తీసుకున్నారా?
మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి మనస్సు విప్పి మాట్లాడితే, మీరు వారితో రెండు విషయాలను స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. మొదటిది, వారు ఏ విషయంలో అయినా, ఎప్పుడైనా సంకోచించకుండా మీ దగ్గరకు రావచ్చని, అలాగే మీరు వారిని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోరని వారికి భరోసా ఇవ్వండి. రెండవది, వారు స్వయంగా లేదా స్నేహితులతో కలిసి పరిష్కరించుకోగలిగిన విషయాలు ఉంటే, అది పూర్తిగా సరైనదే అని వారికి స్పష్టం చేయండి. అది ఎదుగుదల స్థాయిలో ఒక సహజమైన భాగం, అలాగే అందులో AI పాత్ర ఎంతవరకు ఉండాలనే విషయంపై చర్చించడం ఖచ్చితంగా సమంజసమైన విషయమే. AI అన్నివేళలా ఖచ్చితంగా పని చేయకపోవచ్చని, అలాగే ఈ సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందుతోందని వారికి సున్నితంగా వివరించండి. నిజంగా ముఖ్యమైన ఏ విషయంలో అయినా, వారు తమకు తెలిసిన, నమ్మకం ఉన్న వ్యక్తులతో ముఖాముఖి మాట్లాడటం మంచిది.6. నిజానికి Meta AI పెద్దవారి కంటే మీ వయస్సు వ్యక్తులకు భిన్నంగా పని చేస్తుందని మీకు తెలుసా?
Meta AI టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల కోసం నిర్దిష్ట అంశాలను భిన్నంగా నిర్వహించేలా రూపొందించబడిందని గుర్తుంచుకోండి. కొన్ని ప్రశ్నలను మళ్లించడం జరుగుతుంది, అలాగే ఇతర అంశాల విషయంలో Meta AI అస్సలు ప్రతిస్పందించదు. ఉదాహరణకు మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాల విషయానికి వస్తే, Meta AI చాట్ చేయడానికి బదులుగా వెలుపలి వనరుల వైపు మార్గనిర్దేశం చేసేలా రూపొందించబడింది. మీకు తెలిసిన విషయాలను షేర్ చేసుకోండి, ఆపై మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి తెలిసిన విషయాలను చెప్పనివ్వండి. బహుశా వారు దాని గురించి ఇప్పటికే ఆలోచించి ఉండవచ్చు. వారు ఇప్పటికీ దాని గురించి ఆలోచించకుంటే, మీరు వారికి పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక అంశాన్ని అందించినట్లు అవుతుంది.7. మీరు ఇటీవల [అంశం] గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు నేను గమనించాను. ఆ అంశానికి సంబంధించి మీ మనస్సులో ఏమి ఉంది?
కుటుంబ సభ్యుల ఖాతాల నిర్వహణ కేంద్రం ద్వారా, మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి గత ఏడు రోజులలో Meta AIతో అన్వేషించిన ఆరోగ్యం, సంరక్షణ, సాంకేతికత లేదా ప్రయాణం వంటి పది ప్రధాన అంశాలను మీరు చూడవచ్చు. విభాగాలు అనేవి చాలా విస్తృతంగా ఉంటాయి, వాటిలో ఒక అంశాన్ని చూడటం వలన వారు నిజానికి ఏమి అడిగారో మీకు తెలియదు. బదులుగా, దీన్ని సంభాషణను ప్రారంభించడానికి ఒక వేదికగా లేదా అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. ఈ అంశాలను మీరు మాత్రమే చూడటానికి బదులుగా మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో కలిసి చూడటాన్ని పరిగణనలోకి తీసుకోండి. దీన్ని మీరిద్దరూ కలిసి చేసే ఉమ్మడి కార్యకలాపంగా చేయడం వల్ల వారి తప్పును పట్టుకోవడానికి మీరు ప్రయత్నించడం లేదని వారికి సంకేతం పంపినట్లవుతుంది. మీ లక్ష్యం వారు శ్రద్ధ వహించే విషయాలపై నిజమైన ఆసక్తిని ప్రదర్శించడం, అంతే కానీ వారికి వ్యతిరేకంగా అభియోగాలు మోపడం లేదా వారిని తప్పుబట్టడం కాదు. ఏదైనా సున్నితమైన విషయం చర్చకు వస్తే, అతిగా స్పందించకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దీన్ని తదుపరి సంభాషణ కోసం ఒక వేదికగా లేదా అవకాశంగా ఉపయోగించండి. టూల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని Meta సహాయ కేంద్రంలో కనుగొనవచ్చు.8. AI మీకు ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని చెప్పి, అది ఆ తర్వాత తప్పు అని తేలిందా?
AI కొన్నిసార్లు సమాచారాన్ని సృష్టిస్తుంది, అలాగే దాన్ని పూర్తి విశ్వాసంతో తెలియజేస్తుంది. దీని కోసం ఉపయోగించే పదం ఇదే అని మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి ఇప్పటికే తెలిసి ఉండవచ్చు: "భ్రమ కల్పించడం." కాలక్రమేణా AI మోడల్‌లు మెరుగుపడుతున్నప్పటికీ, భ్రమలు ఇప్పటికీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి AI అనేది సెర్చ్ ఇంజిన్ లాగా ఉండదని అర్థం చేసుకోవాలి, అలాగే అది వారికి అందించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం అనేది ఒక మంచి, ప్రామాణిక పద్ధతి అని వారు గుర్తుంచుకోవడం ముఖ్యం. అది తమకు ఎప్పుడూ తప్పుడు సమాచారాన్ని ఇవ్వలేదని వారు చెప్తే, ఒకవేళ అది తప్పుడు సమాచారాన్ని అందిస్తే దాన్ని ఎలా గుర్తించాలో వారికి తెలుసా అని వారిని అడగండి. అలాగే ఏదైనా విషయాన్ని స్నేహితులతో, తరగతిలో లేదా అసైన్‌మెంట్‌లో నమ్మకంగా షేర్ చేసుకున్న తర్వాత, అది AI అందించిన తప్పుడు సమాచారం అని తెలిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అనే విషయాన్ని వారికి సున్నితంగా వివరించండి.9. పాఠశాల పనుల కోసం AIని ఉపయోగించడం గురించి మీ ఉపాధ్యాయులు ఏమి చెప్తున్నారు? ఏది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనది, అలాగే ఏది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు అనే దాని గురించి మీ స్నేహితులు ఏమి చెప్తున్నారు? మీ ఉద్దేశంలో ఆ పరిమితి ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు?
ఇతరుల గురించి అడగడం వలన మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయిపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ఆలోచనలు చేసేందుకు సహాయంగా AIని ఉపయోగించడం, అలాగే తమ పని చేయడానికి AIని ఉపయోగించుకోవడం మధ్య వ్యత్యాసాన్ని వారు గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. దీనికి సులభమైన సమాధానం ఏమీ లేదు, అందుకే మీరిద్దరూ దీని గురించి మాట్లాడుకోవడం అవసరం. ఈ అంశంపై మీ వ్యక్తిగత అభిప్రాయాలను వేరొకరిపై రుద్దడం కంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతను కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. మీరు వారితో పూర్తిగా ఏకీభవించవచ్చు, అలాగే కొన్ని విషయాల్లో మీ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. వారు కూడా అలాగే చేయవచ్చు. అది సంభాషణను అర్థవంతమైన, ఉత్పాదకమైనదిగా చేస్తుంది.10. ప్రస్తుతం AI అనేది అందరూ తరచుగా మాట్లాడుకునే అంశం. దీని గురించి మీరు విన్న లేదా చదివిన విషయాలలో, మిమ్మల్ని ఆలోచింపజేసేవి, మీకు ఆందోళన కలిగించేవి లేదా ప్రస్తుతం మీకు అస్సలు అర్థం కానివి ఏవైనా ఉన్నాయా?
ఈ ప్రశ్న అడిగినప్పుడు, మీరు వారి కోసం సమాధానాలు చెప్పాలనే ఒత్తిడిని ఎక్కువ అనుభవించవచ్చు. ఆ అవసరం లేదు. మనం పరివర్తన చెందే కాలంలో ఉన్నాము, అలాగే తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మన సమాజంలో, అలాగే మన జీవితాలలో AI వినియోగం పెరుగుతున్నందున, దానిపై చర్చించడం కోసం ప్రస్తుతానికి, అలాగే భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. మీకు ఆలోచన కలిగించే లేదా ఆందోళనకు గురిచేసే ఏ విషయం గురించి అయినా మాకు చెప్పడానికి సంకోచించకండి. ఈ విషయంలో మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి చెప్పే సరికొత్త, ఉపయోగకరమైన అభిప్రాయాలు, మీ ఆలోచనలను సరిదిద్దుకోవడానికి లేదా స్పష్టత తెచ్చుకోవడానికి మీకు ఎంతగానో తోడ్పడవచ్చు. దీనిని ఇప్పుడే గుర్తించకపోయినా ఫర్వాలేదు, మీ కుటుంబం కాలక్రమేణా కలిసి, చర్చించుకుని ఏవైనా సందేహాలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాము.11. నిజానికి మీరు AIని ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి నాకు అంతగా తెలియదు. వీలైనప్పుడు నాకు కొంత సమయం కేటాయించి చూపించగలరా?
మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయిని ఏదైనా నేర్పించమని అడిగినప్పుడు, మీకంటే వారే ఆ విషయంలో అధికారం లేదా పట్టు ఉన్న వ్యక్తులుగా కనిపిస్తారు. మీరు వారిని మంచి సమయంలో ఆడిగితే, మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి ఈ అభ్యర్థనకు సానుకూలంగా ప్రతిస్పందిస్తారు. దీనివల్ల నిజానికి వారు ఈ టూల్‌లను ఎలా ఉపయోగిస్తున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది; ఈ విధమైన లోతైన అవగాహనను వేరే ఏ ఇతర మార్గంలోనూ పొందడం సాధ్యం కాదు. వారికి ఇష్టమైన కాఫీ షాప్‌కో లేదా ఐస్ క్రీమ్ షాప్‌కో మీరిద్దరూ కలిసి వెళ్లి, అక్కడ సరదాగా గడుపుతూనే, వారు AIని ఎలా అందిపుచ్చుకున్నారో, అలాగే దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందుతున్నారో అడిగి తెలుసుకోవచ్చు. ఆ సమయంలో వారు సానుకూలంగా స్పందిస్తే, క్యాలెండర్‌లో వెంటనే ఏదైనా సమయాన్ని షెడ్యూల్ చేసుకోండి. మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి వారి ప్రపంచాన్ని మీకు పరిచయం చేసే అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి.ఫీచర్‌లు మరియు టూల్‌లు
సంబంధిత వనరులు
వర్చువల్ రియాలిటీకి కుటుంబ సభ్యుల మార్గదర్శకం
మరిన్ని వివరాలు చదవండి