వ్యక్తిగత బ్రాండింగ్
పరిశోధన1లో సామాజిక మాధ్యమం అనేది వ్యక్తిగత బ్రాండింగ్, స్వీయ-ప్రచారం మరియు ఇంప్రెషన్ మేనేజ్‌మెంట్ వంటి ముఖ్యమైన వృత్తిపరమైన ప్రయోజనాలను అందించగలదని చూపుతోంది. అందుకని, మేము దాని ఉద్దేశ్యపూర్వక సానుకూల వినియోగాన్ని ప్రోత్సహిస్తాము. యువతీయువకులందరూ కేవలం వ్యక్తిగత వృద్ధి కోసం కాకుండా, ఇతరులు వారి కోసం ఆన్‌లైన్‌లో వెతికినప్పుడు వారి కఠోర శ్రమ, సమగ్రత మరియు పౌర మనస్తత్వం ఆనవాళ్లు కనుగొనబడే విధంగా పాఠశాలలో మరియు వారి కమ్యూనిటీలో గొప్ప పనులు (ఉదా. గౌరవప్రదమైన పాత్ర పోషించడం, స్వచ్ఛందంగా సేవలందించడం, ఇతరేతర కార్యకలాపాలు మొదలైనవి) చేయడం కోసం అదనంగా కష్టపడి పని చేయడం ముఖ్యం.
సంబంధితంగా, వ్యక్తిగత వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయమని మీ టీనేజ్ పిల్లలను ప్రోత్సహించడం (లేదా సహాయపడటం) తెలివైన చర్య కావచ్చు. ఇక్కడ, వారు విద్యాసంబంధిత, క్రీడా సంబంధ, వృత్తిపరమైన లేదా సేవ-ఆధారిత అచీవ్‌మెంట్‌లు, వారి గురించి గొప్పగా మాట్లాడే ఇతరుల వాంగ్మూలాలు మరియు సిఫార్సులు, అలాగే పరిపక్వత, వ్యక్తిత్వం, సమర్థత మరియు దయను వర్ణించే సముచితమైన ఫోటోలు మరియు వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. టీనేజ్ పిల్లలు గతంలో పొరపాటు చేసి, ఆన్‌లైన్‌లో ఏదైనా అనుచితమైనది పోస్ట్ చేసి ఉన్నట్లయితే, ఇది మరింత ముఖ్యం. సాధ్యమైతే, వారు ప్రతికూల కంటెంట్ దృశ్యమానత మరియు ప్రభావాన్ని తగ్గించగలిగేలా ఆన్‌లైన్‌లో తమ గురించి సానుకూల కంటెంట్‌ను హైలైట్ చేయడానికి మరియు పరిమాణాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. మొత్తంమీద, టీనేజ్ పిల్లలు వారి గురించి పోస్ట్ చేయబడినది వారికి హాని కలిగించే బదులుగా వారికి ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపై నిరంతర పరిశీలనతో వారి ఆన్‌లైన్ భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులుగా, మీ టీనేజ్ పిల్లలకు ఎదురుకాగల అవకాశాల కోసం వారి డిజిటల్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడానికి వారితో భాగస్వామిగా మారండి మరియు ఈ విధంగా విజయం సాధించగల వారి అవకాశాలను అనుకూలపరచండి.
1 — "చెన్. వై, రుయి, హెచ్., & విన్‌స్టన్, ఎ. (2021). ఎగువకు ట్వీట్ చేయాలా? సామాజిక మాధ్యమం వ్యక్తిగత బ్రాండింగ్ మరియు కెరీర్ ఫలితాలు. MIS Quarterly, 45(2)."