ఆన్‌లైన్ వేధింపులు: కొనసాగుతున్న సమస్య
వేధింపులు అనేవి మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయిల పాఠశాల గోడలకు ఉండేవి కావు. అనేకమంది విద్యార్థులు తమ సహవిద్యార్థులతో టచ్‌లో ఉండేందుకు సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నందున, వారు ఆన్‌లైన్‌లో ఒత్తిడి లేదా బెదిరింపులను ఎదుర్కొంటుండవచ్చని మీరు గుర్తుంచుకోవాలి.
ఆన్‌లైన్ వేధింపులు అనేవి సామాజిక మాధ్యమం, వచన సందేశాలు, యాప్‌లు లేదా వీడియో గేమ్‌ల ద్వారా కూడా జరగవచ్చు. ఇందులో ఎవరినైనా నేరుగా బెదిరించడం మొదలుకుని సమాచారాన్ని బహిర్గతం చేయడం (అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేయడం) లేదంటే అవాంఛిత లేదా హానికరమైన ప్రవర్తన వరకు ప్రతిదీ ఉండవచ్చు.