మీ యుక్తవయస్సు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి
మీ యుక్తవయస్సు పిల్లల సురక్షత మరియు సంరక్షణకు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వారికి మద్దతు ఉన్నట్లు, వారి సమస్యలను విన్నట్లు మరియు వారిని ప్రోత్సహిస్తున్నట్లు భావించేలా మీరు వారికి ఎలా సహాయపడగలరు? వారు చాలా బలహీనమైన స్థితిలో ఉండే అవకాశం ఉన్నందున, బేషరతుగా మద్దతుని తెలియజేయడం అవసరం. మీరిద్దరూ ఒకే రకమైన తుది ఫలితం: సైబర్ వేధింపులను ఆపడం మరియు అది మళ్లీ జరగకుండా చూసుకోవడం కోరుకుంటున్నట్లుగా మాటలు మరియు చర్యల ద్వారా వారికి తెలియజేయండి. పరస్పరం అంగీకరించిన చర్యల కోర్స్‌ను పొందడానికి కలిసి పని చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు. వారి దృక్కోణాన్ని తిరస్కరించకుండా, వారి వాదన మరియు దృక్పథాన్ని ధృవీకరించడం చాలా క్లిష్టమైనది; ఇది వాస్తవానికి వారు కోలుకుని, పునరుద్ధరించబడే ప్రక్రియలో సహాయపడవచ్చు. సైబర్ వేధింపులకు గురైన పిల్లలు తమ బాధలను వింటున్న పెద్దలు తమ కష్టాలలో హేతుబద్ధంగా మరియు తార్కికంగా జోక్యం చేసుకుంటారని మరియు పరిస్థితిని మరింతగా దిగజార్చరని ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు వారి పక్షాన ఉన్నట్లుగా మరియు విషయాలను మెరుగుపరచడానికి వారితో భాగస్వామ్యం వహించబోతున్నట్లుగా వారికి భరోసా ఇవ్వండి.
సాక్ష్యాలను సేకరించడం
జరిగిన విషయాలు మరియు ప్రమేయం వ్యక్తులకు సంబంధించి మీకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించండి. అనేక సందర్భాల్లో మీ యుక్తవయస్సు పిల్లలు తమను వేధిస్తున్న వారు అనామక వాతావరణంలో ఉన్నప్పటికీ లేదా తెలియని స్క్రీన్ పేరుతో ఉన్నప్పటికీ, వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటారు (లేదా కనీసం తమకు తెలుసని అనుకుంటారు). ఈ దుర్వినియోగం తరచుగా పాఠశాలలో జరుగుతున్న వాటితో ముడిపడి ఉంటుంది. అలా జరుగుతున్నట్లయితే, మీ సమస్యలతో అక్కడి నిర్వాహకులకు సంప్రదించి, పాఠశాల విధాన ఆవశ్యకాలకు అనుగుణంగా సంఘటన రిపోర్ట్ మరియు విచారణ ప్రారంభించబడినట్లు నిర్ధారించుకోండి. మీ యుక్తవయస్సు పిల్లలు సైబర్ వేధింపులకు గురవుతున్నట్లు నిరూపించే రుజువులుగా ఉండే సంభాషణలు, సందేశాలు, చిత్రాలు, వీడియోలు మరియు ఏవైనా ఇతర అంశాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు లేదా స్క్రీన్ రికార్డింగ్‌లను రూపొందించి, వాటిని సాక్ష్యంగా సమర్పించండి. విచారణ ప్రక్రియలో సహాయపడటానికి, అన్ని సంఘటనలకు సంబంధించిన రికార్డ్‌ని ఉంచుకోండి. అలాగే, సంఘటన ఎప్పుడు మరియు ఎక్కడ (పాఠశాలలో, నిర్దిష్ట యాప్‌లలో) జరిగిందనే విషయంతో పాటు (వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తులు లేదా సాక్షులుగా) ఎవరు ప్రమేయాన్ని కలిగి ఉన్నారు వంటి సంబంధిత వివరాలపై గమనికలు వ్రాసి ఉంచుకోండి.
సైట్ లేదా యాప్‌కు రిపోర్ట్ చేయడం
సైబర్ వేధింపులు అనేది అనేక చట్టబద్ధమైన సేవా ప్రదాతల (ఉదా., వెబ్‌సైట్‌లు, యాప్‌లు, గేమింగ్ నెట్‌వర్క్‌లు) సేవా నిబంధనలు మరియు/లేదా కమ్యూనిటీ మార్గదర్శకాలకు ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. మీ యుక్తవయస్సు పిల్లలు వారిని వేధిస్తున్న వారిని గుర్తించగలరా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ప్రమేయం ఉన్న ప్లాట్‌ఫారమ్‌ను సంప్రదించండి. రిపోర్ట్ చేసిన తర్వాత, దుర్వినియోగ కంటెంట్ వెంటనే తీసివేయబడవలసి ఉంటుంది. చాలా సైట్‌లు మరియు యాప్‌లు అనామక రిపోర్టింగ్‌ను అనుమతిస్తాయనీ, అలాగే రిపోర్ట్ చేసిన వారి గుర్తింపును బహిర్గతం చేయవని తెలుసుకోండి.
కంటెంట్‌ని ఏ వర్గం క్రింద రిపోర్ట్ చేయాలనే విషయాన్ని తెలుసుకునేందుకు, సంబంధిత సేవా నిబంధనలు మరియు/లేదా కమ్యూనిటీ మార్గదర్శకాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించండి. చట్టాన్ని అమలు చేసే సంస్థ వారి ప్రమేయం లేకుండా సైట్ లేదా యాప్ మీకు ఖాతా సమాచారాన్ని బహిర్గతం చేసే అవకాశం లేదని గుర్తుంచుకోండి, కాబట్టి పరిస్థితి ఎవరి భద్రతకైనా ముప్పు వాటిల్లే స్థాయికి చేరుకున్నట్లయితే, పోలీసులను సంప్రదించడం అవసరం కావచ్చు. మీ స్థానిక విభాగం సహాయకరంగా లేనట్లయితే, చట్టాన్ని అమలు చేసే సంస్థకు సంబంధించిన కౌంటీ లేదా రాష్ట్ర అధికారులకు సాంకేతిక సంబంధిత నేరాలలో వనరులు మరియు నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని సంప్రదించండి.
మీ యుక్తవయస్సు పిల్లలు సైబర్ వేధింపులకు గురైనప్పుడు, ప్రతిస్పందించడానికి చిట్కాలు
సైబర్ వేధింపులకు పాల్పడుతున్న యుక్తవయస్సు పిల్లల తల్లిదండ్రులను మీరు సంప్రదించాలా?
ఇది చాలా క్లిష్టమైన ప్రతిపాదన కావచ్చు. సిద్ధాంతపరంగా, ఇది మంచి విధానం వలె కనిపించవచ్చు, అలాగే చాలా మంది తల్లిదండ్రులకు ఇది సమర్థవంతమైన వ్యూహంగానూ ఉండవచ్చు. అయితే, ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలు మీ యుక్తవయస్సు పిల్లలకు భయం కలిగించవచ్చు. వేధింపులకు పాల్పడే వ్యక్తుల తల్లిదండ్రులను కలవడం వలన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని వారు తరచుగా నమ్ముతారు. అలాగే సంభాషణ సజావుగా సాగకపోయినట్లయితే, ఖచ్చితంగా అలాగే జరగవచ్చు. సమస్య ఏమిటంటే, తమ యుక్తవయస్సు పిల్లలు సైబర్ వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొనే కొంతమంది తల్లిదండ్రులు వారికి కాపాడే ప్రయత్నం చేయవచ్చు లేదా తీసిపారేయవచ్చు, తదనుగుణంగా మీరు చెప్పే ఈవెంట్‌ల వివరణను పట్టించుకోకపోవచ్చు. వారు ఒప్పుకోకుండా మీతో వాదించేందుకు సిద్ధం కావచ్చు. ఇలా సంభాషణను నిర్వహించడం అవసరమా కాదా అని ఆలోచిస్తున్న తల్లిదండ్రులుగా, ముందుగా వేధింపులకు పాల్పడుతున్నవారి తల్లిదండ్రుల గురించి మీకు ఎంత బాగా తెలుసనేది జాగ్రత్తగా అంచనా వేయడంతో పాటు వారు ఎలా ప్రతిస్పందిస్తారనే దానిపై మీ నమ్మకాలను అంచనా వేయండి.